సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసి.. గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ కార్యకర్త నాగరాజు ఇంటికి వెళ్లే దారి మూసేశారంటూ ఫోటోలు తీసి.. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎల్లోమీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీసు అధికారులు టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి దారి మూసేయలేదని.. తన స్థలం హద్దుల్లో బండలు వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించగా వారి మధ్య వివాదం రాజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment