కైలాస్‌నగర్/నిర్మల్: ఎంతో మంది కరసేవకుల బలిదానాల, త్యాగాల స్ఫూర్తిగా రామాలయా న్ని నిర్మించిన అవతార పురుషు డు ప్రధాని నరేంద్ర మోదీ అని, అలాంటి మోదీ రాజ్యం కావాలా.. రాక్షసుల్లా వస్తున్న కాంగ్రె స్, బీఆర్‌ఎస్ రజాకార్ల పాలన కావాలా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకో వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీ ఆధ్వ ర్యంలో చేపట్టిన విజయసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బండి మాట్లాడారు.
అయోధ్యలో బాబ్రీ మసీద్ ఉండాలనే వారిని బట్టలూడదీసి కొట్టాలని, రాముడి పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజ ల పక్షాన ఉద్యమించి తాము పోరాడితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలో చక్రం తిప్పుతానని భావించిన కేసీఆర్, తెలంగాణ ప్రజల తీర్పుతో బొక్కబోర్లాపడి ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందని, గల్లీలో నే ఓడిపోయిన ఆ పారీ్టతో తమకు పొత్తు ఎలా ఉం టుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో హిందువులు సంఘటితమై 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తామని బండి హామీ ఇచ్చారు.
రాంజీగోండు స్ఫూర్తి కేంద్రానికి భూమిపూజ
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌కు గడువు సమీపిస్తున్నందున ఆలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందని బండి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి మార్గంలో ఉన్న అమరుల స్థూపానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌లతో కలిసి ఆయన నివాళులర్పించారు.
మహేశ్వర్‌రెడ్డితో కలిసి రాంజీగోండు స్ఫూర్తికేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే వెయ్యిఉరుల మర్రి ఉండేదో అక్కడే స్ఫూర్తి కేంద్రాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తామని చెప్పారు.
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతల గడువులో 70 రోజులు ముగిశాయన్నారు. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని, ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment