బోథ్ నియోజకవర్గం
బోథ్ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి రాదోడ్ బాపూరావు రెండోసారి గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సోయం బాపూరావుపై 6639 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాగా స్వతంత్ర అభ్యర్ధి అనిల్ జాదవ్ 27368 ఓట్లు తెచ్చుకుని మూడో స్తానంలో ఉన్నారు. సోయం బాపూరావు 2009లో టిఆర్‌ఎస్ తరపున గెలిచి, ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా అనిల్ జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి, టిక్కెట్ రాకపోవడంతో 2018లో ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు.
రాదోడ్ బాపూరావుకు 60967 ఓట్లు రాగా, సోయం బాపూరావుకు 54328 ఓట్లు లభించాయి. బాపూరావు ఆ తర్వాత 2019లో బిజెపిలో చేరి లోక్ సభకు ఎన్నికవడం విశేషం. బోథ్ నుంచి 2014లో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాదోడ్ బాపూరావు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయనకు 26993 ఓట్ల ఆదిక్యత లబించింది. కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ అనిల్ కుమార్ 35877 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు 35218 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2009లో టిడిపి పక్షాన గెలిచిన ఎమ్మెల్యే గొడం నగేష్ 2014లో టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరి ఆదిలాబాద్ నుంచి ఎమ్.పిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. కానీ 2019లో లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందారు.
బోథ్ నియోజకవర్గంలో నగేష్ మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందారు. ఈయన తండ్రి గొడం రామారావు కూడా రెండుసార్లు గెలిచారు. రామారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో పనిచేస్తే నగేష్ 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరు మంత్రుల్కెన ఘనత పొందారు. బోథ్ కు 1962 నుంచి ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు, ఐదుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు టిఆర్‌ఎస్ గెలుపొందాయి. 2004లో గెలిచిన టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఎస్.బాపూరావు ఆ తరువాత కాలంలో అసమ్మతి ఎమ్మెల్యేగా మారారు.
టిఆర్‌ఎస్‌కు భిన్నంగా ఈయన శాసనమండలి ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కారణంగా ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడై పదవిని కోల్పోయారు. శాసనసభ చరిత్రలో తొలిసారిగా అనర్హుల్కెన తొమ్మిది మందిలో ఈయన ఒకరు. 2014 ఎన్నికలో టిడిపిలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ, తదుపరి బిజెపిలోకి ఆయన మారి 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. బోథ్ నియోజకవర్గం జనరల్‌గా ఉన్నప్పుడు ప్రముఖ సోషలిస్టు నేత సి. మాధవరెడ్డి 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 1952లో సోషలిస్టుగా ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైతే, 1984లో టిడిపి పక్షాన మరోసారి లోక్‌సభకు ఎన్నికై, ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయడం విశేషం.
బోథ్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment