Bodhan Assembly Constituency
-
ప్రజలు కోరుకుంది ఇలాంటి తెలంగాణ కాదు: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదని.. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. కాంగ్రెస్‌తోనే రాష్ట్రం మళ్లీ కోలుకోలగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం బోధన్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది. ధరణి పేరుతో ఎమ్మెల్యేలకు భూములు అప్పజెప్తున్నారు. దళిత బంధు పథకంలో తీవ్ర అవినీతి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వకుంటే దళిత బంధు రాదు. తెలంగాణలో భూ, ఇసుక, వైన్స్ మాఫియా పెరిగింది. ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరింది. .. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని కేసీఆర్ సర్కార్ ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది అని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200గా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిలిండర్ ధర తగ్గిస్తాం. కాంగ్రెస్ గెలిచాక.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కేసీఆర్ కారు పంక్చర్ అయ్యింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో చేరిన మండవ బోధన్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆదిలాబాద్ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఇసుకలో.. మైనింగ్‌లో.. ఎటు నుంచి చూసినా కేసీఆర్ ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. ఎవరి భూములు వారికి ఇచ్చేదే ప్రజా తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లీ దళితుల అభివృద్ధి అని గండికొట్టారు. మీ స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారు. మీ చేతుల్లో తెలంగాణ గ్యారెంటీ కార్డు పెట్టాం. ఇవి గ్యారెంటీలు కావు(కాంగ్రెస్ గ్యారెంటీ ప్రతిని చూపిస్తూ..) చట్టంగా అమలు చేయబోతున్నాం. తొలి కేబినెట్లోనే వీటిని చట్టాలుగా మారుస్తాం. -
TS Election 2023: బోధన్ నియోజక వర్గం.. ఆసక్తికర అంశాలు!
సాక్షి, నిజామాబాద్: బోధన్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది. నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో జన్నెపల్లి, సిరన్‌పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని ఆయకట్టు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఈ కాలువ గండిపడి రైతులు ఏళ్లకాలంగా నష్టపోతున్నారు. ఈ సమస్య ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. బోధన్‌లో మూతపడి ఉన్న నిజాం షుగర్స్ ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారబోతుంది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల ముందు ప్రకటించింది.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాజా హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్ హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపేందుకు అవకాశాలున్నాయి. అతి పెద్ద మండలం, ప్రభావితం చూపే పంచాయతీ.. అతి పెద్ద మండలం: నవీపేట ప్రభావితం చేసే పంచాయతీలు: నవీపేట, ఎడపల్లి, సాలూర నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య.. మొత్తం ఓటర్ల సంఖ్య: 2,04218 మహిళలు: 1,06226 పురుషులు: 97,989 ఇతరులు: 03 కొత్త ఓటర్లు: 12,300 వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజక వర్గంలో రైతులు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు? బీసీ ఓటర్లు: 1 లక్ష వరకు ఎస్సీ,ఎస్టీలు: 30 వేలు క్రిస్టియన్లు: 8500 ముస్లీం మైనార్టీలు: 50 వేలు ఇతరులు, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణులు: 18500 (మున్నూర్‌కాపు, పద్మశాలి, లింగాయత్‌లు, గూండ్ల, గొల్లకుర్మలు, ముదిరాజ్ సంఖ్య అధికంగా ఉంటుంది.) నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజక వర్గం అంచున మంజీర, గోదావరినదులు ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే గోదావరి నది రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద తెలుగు నేలపై అడుగు పెడుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెగ్డెవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి (రెంజల్ మండలం) నవీపేట మండలానికి నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సమీపంలో ఉంటుంది. బోధన్‌లో ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మూతపడింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపే – ఠానాకలాన్ గ్రామాల మధ్య అలీసాగర్ రిజర్వాయర్, ఉద్యావనం పర్యాటక కేంద్రంగా ఉంది. నవీపేట మండలంలోని కోస్లీవద్ద గోదావరి నదిపై అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మించారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది.. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో ఉంటుంది. బోధన్‌లో ప్రముఖ ఏకచక్రేశ్వరాలయం ఉంది. నియోజక వర్గానికి మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఆసక్తికర అంశాలు.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలంగాణలోనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యే.. వరుసగా రెండుసార్లు గెలిచారు.. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మిమ్ పార్టీ సహకారం ముస్లింల సహకారం ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది.. కానీ మిమ్ నేతలకు ఎమ్మెల్యే షకీల్‌కు మధ్య సంబంధాలు చెడి పోయాయి.. ఆ పార్టీ నేతలు ఎనిమిది మందిపై ఎమ్మెల్యే హత్యాయత్నం కేసు పెట్టారు.. దాంతో నేతలు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.. వారిని మిమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జైలుకు వెళ్లి పరామర్శించి బోధన్ లో యుద్ధం ప్రకటించారు.. ఇటీవల జరిగిన ఈ పరిణామంతో మిమ్ బోధన్ లో బీఆర్ఎస్కు సహకరించే పరిస్తితి లేదు. షకీల్‌ను మారిస్తే మనసు మారొచ్చు. ఇతర రాజకీయ అంశాలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ మధ్య అంతర్గత విబేదాలు రచ్చకెక్కాయి. శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ , ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకులతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్సీకవిత, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే షకీల్‌కు మళ్లీ టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని ,ఓడిస్తామని తూము శరత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేను అడ్డగించిన ఎంఐఎం ఇద్దరు నాయకులను హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. -
TS Election 2023: బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు! కొందరికి చుక్కెదురు!
ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విషయంలో ఉత్కంఠకు తెర పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్టీపరంగా బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రాష్ట్రంలో అధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చోటు దక్కగా, ఉమ్మడి జిల్లా పరంగా పరిశీలిస్తే.. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కులకు చుక్కెదురైంది. ఇక్కడ బోథ్ నుంచి జెడ్పీటీసీ జాదవ్ అనిల్ కుమార్, ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మిలను ప్రకటించారు. ఇక ఆదిలాబాద్ జనరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి బరిలో నిలవనున్నారు. తీవ్ర ప్రయత్నాలు.. బోథ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరోసారి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది. మాజీ ఎంపీ గొడం నగేశ్ కూడా విస్తృతంగా ప్రయత్నించారు. ఆయనకు కూడా మొండి చెయ్యి ఎదురైంది. ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌కు అధిష్టానం ఆశీస్సులు దక్కలేదు. ఆమెతో పాటు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ శర్వన్ నాయక్ సైతం ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌కు ఆప్తుడుగా ఉన్న జాన్సన్ నాయక్ రానున్న ఎన్నికల్లో పార్టీ పరంగా అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బీఆర్ఎస్ సంబరాలు.. ఎమ్మెల్యే జోగు రామన్నకు మరో సారి టికెట్ ఖరారుకావడంపై స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు సంబ రాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ఎమ్మెల్యే రామన్నను భుజాన ఎత్తుకొని నృత్యాలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్‌రంజాని, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అజయ్, అష్రఫ్, నాయకులు సాజిద్ పాల్గొన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలో అనిల్‌జాదవ్‌కు టికెట్ దక్క డంపై పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఆరోసారి బరిలో.. ఎమ్మెల్యే జోగు రామన్న ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆరోసారి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి నాలుగోసారి పోటీకి రెడీ అంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఆయనకు చోటు దక్కింది. నాలుగు సార్లు శాసన సభ్యుడిగా గెలిచిన ఆయన 2014 తెలంగాణ మొదటి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఓటమి.. జోగు రామన్న రాజకీయ చరిత్రలో గెలుపోటములు ఉన్నాయి. 2004లో టీడీపీ అభ్యర్థిగా ఆది లాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సి.రాంచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009లో టీడీపీ నుంచి పో టీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సీఆర్ఆర్పైనే గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 2011లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి సీఆర్‌ఆర్‌పై గెలిచారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై గెలుపొందారు. 2018లోనూ మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన శంకర్‌పై గెలుపొందారు. రాజకీయ చరిత్ర.. టీడీపీతో జోగు రాజకీయ ఆరంగేట్రం జరిగింది. 1984లో పార్టీలో చేరారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా వ్యవహరించారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ ఎంపీపీగా కొనసాగారు. తర్వాత జైనథ్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. కిందిస్థాయి పదవుల నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకు ఎదిగారు. బీఆర్ఎస్తో కలిసొచ్చేనా.. అనిల్ జాదవ్ గతంలో మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ జాదవ్ ఈసారి బీఆర్ఎస్ నుంచి కలిసొస్తుందో.. లేదోననేది కాలం నిర్ణయించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్టీ పరంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించగా, అందులో బోథ్ని యోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ పేరు ఉంది. అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ జెడ్పీటీసీగా కొనసాగుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ పరంగా టికెట్ సాధించాలని విశ్వప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో ఉండడం ద్వారా అధిష్టానం దృష్టిలో పడడంతో పాటు నియోజకవర్గంలోని ఇతర ద్వితీయశ్రేణి నేతల సపోర్ట్‌ను సాధించడంలో విజయం సాధించారు. రెండు దశాబ్దాల రాజకీయం.. అనిల్ జాదవ్ రెండు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మొదట టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి మాతృ పార్టీలోనే చేరి ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామపంచాయతీకి నాలుగు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. మొత్తంగా రాజకీయ కుటుంబం నుంచే అనిల్ జాదవ్ వచ్చారు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్లో చేరిన అనిల్ జాదవ్ 2004లోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే అప్పట్లో అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి సోయం బాపురావుకు టికె ట్ దక్కడంతో నిరుత్సాహం చెందారు. అప్పటికీ పార్టీలోనే కొనసాగినప్పటికీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి అప్పుడు టీడీపీ అభ్యర్థి గొ డం నగేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ టిక్కెట్ బోథ్ నుంచి సోయం బాపురావుకు దక్కడంతో అనిల్‌జాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచినప్పటికీ 28,206 ఓట్లు సాధించడం ద్వారా గుర్తింపు పొందారు. బాపురావుకు.. నో.. ప్రస్తుతం బోథ్ నుంచి ఎమ్మెల్యేగా రాథోడ్ బాపురావు ఉన్నారు. అయితే మూడోసారి పార్టీ పరంగా పోటీ చేయాలనుకున్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ వెళ్లిన ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావును కలిశారు. అప్పుడే ఈసారి టికెట్ ఇవ్వడంలేదని వారు చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి అక్కడే ఉన్న ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆదివారం తన అనుచరులు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి మరోసారి రాథోడ్ బాపురావుకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయట జరిగే ప్రచారాలు, ఊహగానాలు నమ్మవద్దని చెప్పారు. చివరికి జాబి తాలో చోటు దక్కకపోవడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. వరుసగా రెండుసార్లు.. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో కొనసాగిన రాథోడ్ బాపురావు అప్పట్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. 2014లో పార్టీ పరంగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జాదవ్ అనిల్‌పై గెలుపొందారు. 2018లోనూ మరోసారి టికెట్ దక్కించుకొని పార్టీ పరంగా పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు. మూడోసారి పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. టికెట్ దక్కని ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. జిల్లాకు తిరిగి వచ్చిన ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచిచూడాల్సిందే. పార్టీ అభ్యర్థికి సహకరించాలన్న అధిష్టానం సూచనలు పాటిస్తారా.. లేనిపక్షంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
TS Election 2023: బోథ్ బీఆర్ఎస్ టికెట్ దాదాపుగా ఖరారు.. తెరపైకి అనిల్ జాదవ్ పేరు!
ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ టికెట్ విషయంలో నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ పేరు తెరపైకి వచ్చింది. శనివారం ఉదయం నుంచి ఇది మొదలైంది. ప్రస్తుతం స్థానికంగానే ఉన్న ఆయనను నేరడిగొండలోని తన నివాసంలో రోజంతా పలువురు నాయకులు కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన గృహానికి తరలివస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని అంటున్నారు. మొదటి జాబితాలోనే బోథ్ నియోజకవర్గ అభ్యర్థిని పార్టీ ప్రకటించనున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నగేశ్‌కు చుక్కెదురు.. మాజీ ఎంపీ గోడం నగేశ్‌కు టికెట్ విషయంలో చుక్కెదురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో ఆయన కూడా హైదరా బాద్ బయల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం ఆయన కేటీఆర్, హారీశ్ రావును కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగేశ్ ఆశిస్తున్న బోథ్ టికెట్ ఇవ్వడం కుదరదని ఆ నేతలు చెప్పినట్లు సమాచారం. తనకు ఎలాంటి హామీ లభించకపోవడంతో నగేశ్ నిరుత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో నేతల భేటీలు వేర్వేరుగా జరిగినట్లు తెలుస్తోంది. రాథోడ్ బాపురావుకు బుజ్జగింపులు.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఈసారి పార్టీ పరంగా టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలపరిచే అభ్యర్థికి సహకరించాలని సూచించారు. గిరిజన కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాథోడ్ బాపురావు ఉద్యమకాలంలో పార్టీ వెంట ఉన్నానని, టీచర్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లో రావడం జరిగిందన్నారు. రెండుసార్లు ప్రజలు ఆదరించారని, ఈ సారి కూడా తాను గెలుస్తానన్న నమ్మకం ఉందని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఇరువురు ముఖ్యనేతలతో భేటీ అనంతరం బాపురావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శనివారం సీఎంతో భేటీ అయ్యేందుకు ప్రగతిభవన్‌లో ఉన్నారు. అయితే ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు. భవిష్యత్ కార్యాచరణ.. ఎమ్మెల్యే బాపురావుకు అధిష్టానం బుజ్జగింపుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి ఆయన అనుచరులు కొంతమంది వాట్సాస్ స్టేటస్‌లలో టికెట్ ఎవరికి వచ్చినా తాము కార్యకర్తలుగా పార్టీకోసం పని చేస్తామని పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న బాపురావు శనివారం రాత్రి బయల్దేరి ఇక్కడి చేరుకుంటారని, ఆదివారం కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది. -
బోధన్ నియోజకవర్గం చరిత్ర...ఇదే
బోధన్ నియోజకవర్గం బోధన్‌లో టిఆర్ఎస్ అభ్యర్ధి షకీల్ అహ్మద్ మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ మంత్రి సుదర్శనరెడ్డిని 8101 ఓట్ల తేడాతో ఓడిరచారు. షకీల్‌కు 74895 ఓట్లు రాగా, సుదర్శనరెడ్డికి 66794 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన అల్జాపూర్ శ్రీనివాస్‌కు ఎనిమిదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. అహ్మద్ ముస్లిం వర్గానికి చెందినవారు. నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు గాను కేవలం బోధన్ నియోజకవర్గంలోనే 2009లో సుదర్శన్‌రెడ్డి ఒక్కరే గెలుపొంది మంత్రిగా అవకాశం దక్కించుకుంటే, 2014, 2018లలో ఆయన కూడా ఓడిపోయారు. బోధన్‌లో ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఇక్కడ గెలిచిన బషీరుద్దీన్ బాబూఖాన్ ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు మంత్రివర్గంలోను పనిచేసారు. అప్పట్లో టిడిపి కేంద్రంలో బిజెపికి మద్దతు ఇచ్చినందుకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత 2004లో కాంగ్రెస్ ఐలో చేరిపోయారు. బోధన్ లో 1962లో గెలిచిన రామ్‌గోపాల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా మేడారం నుంచి కూడా పోటీచేసి గెలుపొంది. బోధన్ స్థానానికి రాజీనామా చేసారు. రామ్‌గోపాల్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైతే, ఇక్కడ ఒకసారి గెలిచిన నారాయణరెడ్డి మరోసారి లోక్‌సభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. బోధన్‌లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు కమ్మ, ఐదుసార్లు ముస్లిం,ఒక్కోక్కసారి బ్రాహ్మణ, వైశ్య,ఇతర వర్గాలవారు ఎన్నికయ్యారు. బోధన్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బోథ్ (ST) రాజకీయ చరిత్ర..!
బోథ్ నియోజకవర్గం బోథ్ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి రాదోడ్ బాపూరావు రెండోసారి గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సోయం బాపూరావుపై 6639 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాగా స్వతంత్ర అభ్యర్ధి అనిల్ జాదవ్ 27368 ఓట్లు తెచ్చుకుని మూడో స్తానంలో ఉన్నారు. సోయం బాపూరావు 2009లో టిఆర్ఎస్ తరపున గెలిచి, ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా అనిల్ జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి, టిక్కెట్ రాకపోవడంతో 2018లో ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. రాదోడ్ బాపూరావుకు 60967 ఓట్లు రాగా, సోయం బాపూరావుకు 54328 ఓట్లు లభించాయి. బాపూరావు ఆ తర్వాత 2019లో బిజెపిలో చేరి లోక్ సభకు ఎన్నికవడం విశేషం. బోథ్ నుంచి 2014లో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాదోడ్ బాపూరావు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయనకు 26993 ఓట్ల ఆదిక్యత లబించింది. కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ అనిల్ కుమార్ 35877 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు 35218 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2009లో టిడిపి పక్షాన గెలిచిన ఎమ్మెల్యే గొడం నగేష్ 2014లో టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ నుంచి ఎమ్.పిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. కానీ 2019లో లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందారు. బోథ్ నియోజకవర్గంలో నగేష్ మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందారు. ఈయన తండ్రి గొడం రామారావు కూడా రెండుసార్లు గెలిచారు. రామారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే నగేష్ 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరు మంత్రుల్కెన ఘనత పొందారు. బోథ్ కు 1962 నుంచి ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు, ఐదుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. 2004లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ధి ఎస్.బాపూరావు ఆ తరువాత కాలంలో అసమ్మతి ఎమ్మెల్యేగా మారారు. టిఆర్ఎస్కు భిన్నంగా ఈయన శాసనమండలి ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కారణంగా ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడై పదవిని కోల్పోయారు. శాసనసభ చరిత్రలో తొలిసారిగా అనర్హుల్కెన తొమ్మిది మందిలో ఈయన ఒకరు. 2014 ఎన్నికలో టిడిపిలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ, తదుపరి బిజెపిలోకి ఆయన మారి 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. బోథ్ నియోజకవర్గం జనరల్‌గా ఉన్నప్పుడు ప్రముఖ సోషలిస్టు నేత సి. మాధవరెడ్డి 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 1952లో సోషలిస్టుగా ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైతే, 1984లో టిడిపి పక్షాన మరోసారి లోక్‌సభకు ఎన్నికై, ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయడం విశేషం. బోథ్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..