సాదాసీదాగా.. | Zilla Parishad meetings of standing committees were plain | Sakshi
Sakshi News home page

సాదాసీదాగా..

Published Wed, Oct 15 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

సాదాసీదాగా..

సాదాసీదాగా..

ఆదిలాబాద్ అర్బన్ : మొదటిసారిగా నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు సాదాసీదాగా కొనసాగాయి. కొత్త ప్రజాప్రతినిధులు.. కొత్త బాధ్యతలు.. మొదటిసారి కమిటీ అధ్యక్షులు.. ఇలా అంతా కొత్తకొత్తగా అన్నట్లు సాగింది. సమావేశాలు జిల్లా పరిషత్‌లోని చైర్‌పర్సన్ చాంబర్‌లో మంగళవారం జరిగాయి. ఆయా కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు స్థాయీ సంఘాలు ఉండగా.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగాయి.

ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ, గ్రామీణాభివ ృద్ధి కమిటీ, వ్యవసాయ కమిటీ, విద్య, వైద్య సేవల కమిటీ, మహిళా సంక్షేమ కమిటీ, సాంఘిక సంక్షేమ కమిటీ, పనుల స్థాయి కమిటీలు ఉన్నాయి. కాగా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి, కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆరు స్థాయీ సంఘ సమావేశాలు జరుగగా, వ్యవసాయ కమిటీ స్థాయీ సంఘ సమావేశం జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సమావేశాలకు కమిటీ జెడ్పీ సభ్యురాళ్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. కాగా.. మొదటిసారి నిర్వహించిన ఈ సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. పనుల కమిటీలో ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తప్ప ఇతర శాసన, పార్లమెంట్, మంత్రి, మండలి సభ్యులు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, స్థాయి సంఘాల సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించినా అంశాలు మండల స్థాయి సమస్యలు కావడం శోచనీయం. జిల్లా స్థాయి సమస్యలు చర్చకు రావడం లేదని అధికారులు చర్చించుకోవడం విశేషం. కాగా కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా స్థాయి అధికారులు సమాధానాలు ఇస్తూ అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

స్థాయి సంఘాల వారీగా...
గ్రామీణాభివ ృద్ధి కమిటీ : ఈ స్థాయి కమిటీకి అధ్యక్షులుగా జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి నిర్వహించగా.. ఆమె ఆధ్వర్యంలోనే కమిటీ సమీక్ష జరిగింది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలు, మార్కెటింగ్, పింఛన్లు, ఉన్నతి, వికలాంగుల సంక్షేమంపై చర్చించారు. జిల్లాలో 122 మంది వికలాంగులకు పోలియో వ్యాధికి శస్త్ర చికిత్సలు మొదటి సారిగా చేయించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ భూములకు చెందిన 1,07,936 కేసులు నమోదు కాగా, 1,00,472 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో పది పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం నాలుగు పని చేయడం లేదని వివరించారు. హెల్త్ నూట్రిషీయన్ ద్వారా 2042 మంది బాలింతలు లబ్ధిపొందుతున్నారని వివరించారు.

బంగారుతల్లి పథకం కింద ఇప్పటి వరకు 14,158 మందిని నమోదు చేశామన్నారు. జిల్లాలోని పర్యాటక అభివ ృద్ధి పనులపైనా చర్చించారు. కాగా, పింఛన్లు అర్హులకు సైతం రావడం లేదని, నడవలేని వారు సైతం ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు నెలనెలా పింఛన్ ఇచ్చేలా చూడాలని కమిటీ సభ్యులు చైర్‌పర్సన్ ద ృష్టికి తెచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్లు సొంత డబ్బులతో నిర్మించుకున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఉపాధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూలీ డబ్బులు చెల్లించని దుస్థితి నెలకొందని వివరించారు. దీంతో పాటు వివిధ 13 అంశాలను ఈ కమిటీలో సమీక్షించారు.

ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి అధ్యక్షులుగా వ్యవహరించారు. సాధించిన ప్రగతి అంశాలపై చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు.

వ్యవసాయ కమిటీ  : ఈ కమిటీకి అధ్యక్షుడిగా జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి వ్యవహరించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన అంశాలను చర్చించారు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, మార్కెటింగ్, ఆత్మ, ఇతర అంశాలు చర్చించారు. ముఖ్యంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని, భూమి రైతులకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని నిలుపుదల చేసి రైతులకు మేలు చేయాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. 30 శాతం మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఆదర్శ రైతుల వల్ల పూర్తి స్థాయిలో వారు చెప్పిన పేర్లు పరిహారం జాబితాలో ఉన్నాయని కమిటీ ద ృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం రైతులు రుణాల మాఫీకి, రీ షెడ్యూల్‌కు, నష్ట పరిహారానికి నోచుకోవడం లేదని కమిటీ సభ్యులు వివరించారు. కోటపల్లి మండలంలోని సిర్పా గ్రామంలో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆ ఏరియాలో 200 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని జేడీఏ రోజ్‌లీల ద ృష్టికి తెచ్చారు. అనంతరం ఒక్కో శాఖపై సమీక్షించారు.

విద్య, వైద్య సేవల కమిటీ : ఈ కమిటీకి జెడ్పీ చైర్‌పర్సనే అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మూలనపడిందని, పాఠశాలల్లో కంప్యూటర్ నిర్వహణ కొత్త సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర స్థాయికి పంపాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. భీమిని మండల వైద్యాధికారి కార్యాలయంలో ఒకే డాక్టర్ ఉన్నారని, అక్కడ స్థానికంగా ఉండే డాక్టర్‌ను నియమించాలన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ వ్యాధికి మెడిసిన్ దొరుకుతుందా.. అని అధికారులను ప్రశ్నించారు. లక్షలు ఖర్చు చేస్తూ ఇతర జిల్లాలో వైద్యం చేయించుకున్నారని చెప్పారు. సిర్పూర్(టి)లోని ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నా.. అత్యవసర సమయానికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండరని చెప్పారు.

మహిళా సంక్షేమ కమిటీ.. : కుంటాల జెడ్పీటీసీ సభ్యురాలు రాథోడ్ విమల అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఈమె ఆధ్వర్యంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది. అంగన్‌వాడీ భవనాలు కావాలని, జైనూర్‌లో పనిచేస్తున్న సూపర్‌వైజర్, అంగన్వాడీ వర్కర్లు ఇంత వరకు తెలియడం లేదని జెడ్పీటీసీ సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చింది. పౌష్టికాహారం వివరాలు ఇంత వరకు తెలియదని భైంసా జెడ్పీటీసీ సభ్యుడు తెలిపారు.

సాంఘిక సంక్షేమ కమిటీ.. : ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఖానాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తాళ్లపెల్లి సునిత ఉన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన ప్రగతి అంశాలపై చర్చించారు. సాంఘిక, వెనుకబడిన తరగతుల పాఠశాలల్లో ఇంత వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, హాస్టల్ విద్యార్థులకు బెడ్‌షీట్ ఇవ్వలేదని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. గురుకుల పాఠశాలల్లో, వసతి గ ృహాల్లో సోలార్ వెలుగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో నాణ్యత లేని కూరగాయలు కొని విద్యార్థులకు పెడుతున్నారని చెప్పారు.

పనుల స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి అధ్యక్షులు. కమిటీలో ఉన్న మొత్తం 26 అంశాలపై చర్చించారు. ఒక్కో అంశానికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. పనుల స్థాయి కమిటీ సమీక్షల్లో పెండింగ్‌లో ఉన్న పనులు ప్రధానంగా చర్చించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశాలకు సైతం 50 శాతం మంది మండల స్థాయి అధికారులు హాజరుకావడం లేదనినిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి కమిటీ ద ృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పనులు పూర్తైపెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లులు, భవన ప్రారంభోత్సవాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. భవనాలు పూర్తి చేసి తాళాలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ఒక్కో అంశంపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement