ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలేదని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలేదని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి. స్థానికంగా వైద్య సదుపాయం లేకపోవడంతో పాటు.. విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో.. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాంకిడి బస్టాండ్ సమీపంలో.. రాస్తారోకో నిర్వహించడంతో.. హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారి పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది.