కట్టలు తెగిన ఆగ్రహం
♦ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
♦ అవగాహనారాహిత్యంతో చికిత్స
♦ ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
♦ వద్ద బాధితులు, గ్రామస్తుల ఆందోళన
లింగపాలెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సంచలనం కలిగించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మఠంగూడెం గ్రామ శివారు సుందరరావుపేట గ్రామానికి చెందిన దేవరపల్లి తంబి భార్య విఘ్నేశ్వరి (23)కి నెలలు నిండటంతో శనివారం ఉదయం ధర్మాజీగూడెం పీహెచ్‌సీకి తీసుకువచ్చా రు. సాయంత్రం 4 గంటల నుంచి పురు టి నొప్పులు రావడంతో స్టాఫ్ నర్సులు జ్యోతి, దుర్గ, గంగా వైద్యం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రాత్రంతా విఘ్నేశ్వరి నొప్పులు భరించింది.
ఈ సమయంలో విఘ్నేశ్వరి బాధను చూడలేక భర్త తం బి, కుటుంబసభ్యులు ఆమెను చింతలపూడి ఆస్పత్రికి తీసుకువెళతామని అడిగినా నర్సులు అంగీకరించలేదు. అవగా హనరాహిత్యంతో వైద్యసేవలు అందించారు. వైద్యాధికారి బి.మోజెస్ వినయ్‌కుమార్ గర్భిణిని కనీసం పట్టించుకోలేదు. ఆది వారం ఉదయం 9 గంటలకు వైద్యాధి కారి ఆస్పత్రికి వచ్చినా కనీసం వచ్చి చూడలేదు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో విఘ్నేశ్వరికి నర్సులు సీజేరియన్ చేసే ప్రయత్నంలో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. విషయం తెలిసిన వైద్యాధికారి మోజెన్ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పాటు అందుబాటులో లేరు.
ముగ్గురు నర్సులు పీహెచ్‌సీలోని ఒక గదిలో గడివేసుకుని దాక్కున్నారు. విషయం తెలిసిన సుందరరావుపేట ప్రజలు పెద్ద ఎత్తున పీహెచ్‌సీకి తరలివచ్చి ఆందోళన చేశారు. డీఎంహెచ్‌ఓకు విషయాన్ని తెలియజేశారు. ఏలూరు–చింతలపూడి రహదారిపై ధర్నాకు దిగా రు. ఎస్సై వి.క్రాంతికుమార్ వీరితో చ ర్చించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విచారణాధికారిగా కె.సురేష్‌బాబు ఇక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. డాక్టర్ మోజెస్ మద్యం సేవించి, గుట్కాలు నములుతూ ఆస్పత్రిలో తిరుగుతుం టారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే పీతల సుజాత విషయాన్ని కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన విచారణాధికారితో ఫోన్‌లో మాట్లాడారు. డాక్టర్ మోజెస్ వినయకుమార్‌ను సస్పెం డ్ చేస్తూ క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్టు తెలిసింది. తహసీల్దార్ బి.సోమశేఖరరావు, ధర్మాజీగూడెం సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు గారపాటి బుజ్జియ్య, సీఐ రాజేష్ తది తరులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాధి కారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి విఘ్నేశ్వరి మృతదేహన్ని ఏ లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చినట్టు ఎస్సై చెప్పారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే..
ధర్మాజీగూడెం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నా భార్య కన్నుమూసింది. ఆస్పత్రిలో దాదాపు 17 గంటలపాటు నరకయాతన అనుభవించింది. సరైన వైద్యం అందలేదు. డాక్టర్ సరిగా స్పందించలేదు. సిబ్బంది అవగాహనలేమితో కాన్పు చేయలేక ప్రాణం పోగొట్టారు.
– తంబి, మృతురాలి భర్త
కనీసం డాక్టర్ పట్టించుకోలేదు
నొప్పులు ఎక్కువగా వచ్చి నరకయాతన పడుతుంది విఘ్నేశ్వరిని పంపించండి అని ప్రాధేయపడినా నర్సులు ఒప్పుకోలేదు. డాక్టర్‌ను వచ్చి చూడమన్నా చూడకుండా వెళ్లిపోయారు. కనీసం డాక్టర్ వచ్చి చూసి రిఫర్ చేసినా విఘ్నేశ్వరి బతికేది.
– చిట్లూరి ఝాన్సీరాణి, మృతురాలి వదిన