staff neglect
-
సిబ్బంది నిర్లక్ష్యం.. తల్లికి గర్భశోకం
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది! తల్లి కడుపులోనే బిడ్డ మరణించాడని తెలిసినా.. ఆమెకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఫలితంగా వారం రోజుల పాటు మృత శిశువును గర్భంలోనే ఉంచుకుని పంటి బిగువున ఆ బాధను దిగమింగింది ఆ మాతృమూర్తి!! ఈ హృదయ విదారక సంఘటన పలాసలో జరిగింది. కాశీబుగ్గకు చెందిన గర్భిణి ఎల్.గాయత్రి మొదటి నుంచి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చి పరీక్షలు చేయించుకుంటోంది. సెప్టెంబరు 30వ తేదీన కడుపులో బిడ్డ కదలికలు లేవని గ్రహించి.. ఈ విషయాన్ని భర్త జీవన్‌రావుకు తెలిపింది. హుటాహుటిన ఇద్దరూ పలాస ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వైద్యం చేసేందుకు నిరాకరించి తర్వాత రావాలని సూచించారు. మళ్లీ ఈనెల 2న మరోసారి ఆమె ఆస్పత్రికి వెళ్లింది. వైద్యపరీక్షలు చేసి బిడ్డ చనిపోయాడని చెప్పడంతో గాయత్రి హతాశురాలైంది. బాధను దిగమింగి చనిపోయిన బిడ్డను తీయించేందుకు 5వ తేదీన వెళ్లారు. అప్పటికీ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించలేదు. ఇలా ప్రభుత్వాసుపతిల్రో వైద్యం కోసం ఎదురుచూడలేక స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో 6వ తేదీన చేరారు. ఉమ్మ మింగిన మగ శిశువును బయటకు తీసి తల్లి ప్రాణాలు రక్షించారు. గాయత్రి ఆరోగ్యం కుదుటపడటంతో 9వ తేదీ ఇంటికి చేరింది. పలాస ఆస్పత్రిలో ప్రసూతి వైద్యులు ముగ్గురు ఉండే వారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పందించక వైద్యులను నియమించకపోవడంతో ఒక్క వైద్యురాలే రేయింబళ్లు పనిచేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వం ప్రకటనలే తప్ప ప్రాణాలను కాపాడలేకపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అయ్యో.. ఆర్టీసీ!
పెరగని ఆక్యుపెన్సీరేషియో రూ.2.20కోట్ల నష్టాల్లో ఎమ్మిగనూరు డిపో ఎమ్మిగనూరు: సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయివేటు వాహనాల తాకిడి.. పని చేయని పరిరక్షణ కమిటీ.. వెరసి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నష్టాల బాటలో నడుస్తోంది. డిపోలో ఆక్యుపెన్సీరేషియో పెరగకపోగా మరింత దిగజారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎమ్మిగనూరు డిపో ఒకప్పుడు లాభాలబాటలో ఉండేది. ప్రయివేటు వాహనాలు.. స్టీరింగ్, మాక్సి ఆటోలు ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సమయ పాలన కొరవడడం కూడా నష్టాలకు కొంత కారణంగా తెలుస్తోంది. సమయానికి బస్సులు రాని పరిస్థితి ఉండటంతో ప్రయాణీకులు అందుబాటులో ఉన్న ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సంపూర్ణంగా అమలు కావడంలేదన్న ఆరోపణలున్నాయి. డిపోకు సంబంధించి 84 బస్సులుండగా 48 సర్వీసులు పల్లెవెలుగులే. మిగతా వాటిలో 10 సూపర్ లక్జరీ, 24 ఎక్స్‌ప్రెస్, 2 ఆల్ట్రాడీలక్స్ బస్సులున్నాయి. వీటిలో సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైగా ఉండగా, పల్లెవెలుగు బస్సులకు 55శాతానికి మించడం లేదు. అధిక సర్వీసులుండే పల్లెవెలుగు బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి కనీసం 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో వస్తేనే రాబడికి, వ్యయానికి సరిపోతుంది. ప్రస్తుతం 75శాతం వరకు ఆక్యుపెన్సీ పెరిగినా నష్టాలు నివారించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో కూడా 2 నుంచి 3శాతం వరకు స్కూల్ పిల్లల బస్ పాసుల రీయింబర్స్మెంట్ డబ్బు కలుస్తోంది . అక్రమ రవాణాను అరికట్టకుండా ఆక్యుపెన్సీరేషియో పెంచాలనడం సమంజసం కాదని, వీటిని అరికడితే సీట్ల భర్తీ శాతం పెంచడం పెద్ద కష్టమేమికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా దిగువ చూపులు.. మూడేళ్లుగా ఎమ్మిగనూరు డిపో ఆక్యుపెన్సీ రేషియో హెచ్చుతగ్గులుగా ఉంటూ అసలైన రేషియోకు చేరుకోవడంలేదు. 2015–16లో 71శాతం, 2016–17లో 68శాతంగా ఉండగా 2017–18కి సంబంధించి ఇప్పటి వరకు 74శాతం మాత్రమే ఉంది. ఈ రేషియో 80శాతం వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమంటున్నారు ఆర్టీసీ అధికారులు. వరుసగా నష్టాలు.. ఎమ్మిగనూరు డిపో సుమారు రూ.3.90కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంగా రూ.1.68కోట్ల నష్టాన్ని పూడ్చినా రూ.2.20కోట్ల నష్టం మిగిలే ఉంది. అభయ పథకం, సేవాకేంద్రాలు, ట్రాఫిక్ గైడ్స్ నియామకం, గిఫ్ట్ స్కీం, వనిత, క్యాట్ కార్డులు తదితర పథకాలు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. పనిచేయని ఆర్టీసీ పరిరక్షణ కమిటీ.. ప్రయివేటు వాహనాలను నియంత్రిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏర్పాటు చేసిన ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు. కమిటీలో భాగస్వాములుగా ఉన్న డిపో మేనేజర్, స్థానిక ఎస్ఐ, ఆర్టీఓ.. నెలలో కనీసం రెండుసార్లు ఆయా రూట్లలో పర్యటించి అక్రమ వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు లైసెన్సులున్నాయో లేదో పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే డిపో పరిధిలో చాలా కాలంగా పరిరక్షణ కమిటీ పనిచేయడంలేదు. అమలుకు నోచుకోని మోటార్‌వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం 1989, సెక్షన్ 185(సి) ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయివేటు వాహనాలు, ఆటోలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కిలోమీటరు బయట ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు పరిరక్షణ కమిటీకి ఉంది. కానీ ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద అమలు కావడం లేదు. కమిటీ తరఫున కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉంచడంతో వారి మాట ప్రయివేటు బస్సులు, ఆటో వాలాలు వినడంలేదు. నిత్యం బస్టాండ్ ప్రధాన ద్వారం వద్దే ఉండి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. -
కట్టలు తెగిన ఆగ్రహం
♦ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి ♦ అవగాహనారాహిత్యంతో చికిత్స ♦ ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ♦ వద్ద బాధితులు, గ్రామస్తుల ఆందోళన లింగపాలెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సంచలనం కలిగించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మఠంగూడెం గ్రామ శివారు సుందరరావుపేట గ్రామానికి చెందిన దేవరపల్లి తంబి భార్య విఘ్నేశ్వరి (23)కి నెలలు నిండటంతో శనివారం ఉదయం ధర్మాజీగూడెం పీహెచ్‌సీకి తీసుకువచ్చా రు. సాయంత్రం 4 గంటల నుంచి పురు టి నొప్పులు రావడంతో స్టాఫ్ నర్సులు జ్యోతి, దుర్గ, గంగా వైద్యం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రాత్రంతా విఘ్నేశ్వరి నొప్పులు భరించింది. ఈ సమయంలో విఘ్నేశ్వరి బాధను చూడలేక భర్త తం బి, కుటుంబసభ్యులు ఆమెను చింతలపూడి ఆస్పత్రికి తీసుకువెళతామని అడిగినా నర్సులు అంగీకరించలేదు. అవగా హనరాహిత్యంతో వైద్యసేవలు అందించారు. వైద్యాధికారి బి.మోజెస్ వినయ్‌కుమార్ గర్భిణిని కనీసం పట్టించుకోలేదు. ఆది వారం ఉదయం 9 గంటలకు వైద్యాధి కారి ఆస్పత్రికి వచ్చినా కనీసం వచ్చి చూడలేదు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో విఘ్నేశ్వరికి నర్సులు సీజేరియన్ చేసే ప్రయత్నంలో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. విషయం తెలిసిన వైద్యాధికారి మోజెన్ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పాటు అందుబాటులో లేరు. ముగ్గురు నర్సులు పీహెచ్‌సీలోని ఒక గదిలో గడివేసుకుని దాక్కున్నారు. విషయం తెలిసిన సుందరరావుపేట ప్రజలు పెద్ద ఎత్తున పీహెచ్‌సీకి తరలివచ్చి ఆందోళన చేశారు. డీఎంహెచ్ఓకు విషయాన్ని తెలియజేశారు. ఏలూరు–చింతలపూడి రహదారిపై ధర్నాకు దిగా రు. ఎస్సై వి.క్రాంతికుమార్ వీరితో చ ర్చించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విచారణాధికారిగా కె.సురేష్‌బాబు ఇక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. డాక్టర్ మోజెస్ మద్యం సేవించి, గుట్కాలు నములుతూ ఆస్పత్రిలో తిరుగుతుం టారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పీతల సుజాత విషయాన్ని కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన విచారణాధికారితో ఫోన్లో మాట్లాడారు. డాక్టర్ మోజెస్ వినయకుమార్‌ను సస్పెం డ్ చేస్తూ క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్టు తెలిసింది. తహసీల్దార్ బి.సోమశేఖరరావు, ధర్మాజీగూడెం సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు గారపాటి బుజ్జియ్య, సీఐ రాజేష్ తది తరులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాధి కారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి విఘ్నేశ్వరి మృతదేహన్ని ఏ లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చినట్టు ఎస్సై చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే.. ధర్మాజీగూడెం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నా భార్య కన్నుమూసింది. ఆస్పత్రిలో దాదాపు 17 గంటలపాటు నరకయాతన అనుభవించింది. సరైన వైద్యం అందలేదు. డాక్టర్ సరిగా స్పందించలేదు. సిబ్బంది అవగాహనలేమితో కాన్పు చేయలేక ప్రాణం పోగొట్టారు. – తంబి, మృతురాలి భర్త కనీసం డాక్టర్ పట్టించుకోలేదు నొప్పులు ఎక్కువగా వచ్చి నరకయాతన పడుతుంది విఘ్నేశ్వరిని పంపించండి అని ప్రాధేయపడినా నర్సులు ఒప్పుకోలేదు. డాక్టర్‌ను వచ్చి చూడమన్నా చూడకుండా వెళ్లిపోయారు. కనీసం డాక్టర్ వచ్చి చూసి రిఫర్ చేసినా విఘ్నేశ్వరి బతికేది. – చిట్లూరి ఝాన్సీరాణి, మృతురాలి వదిన