pregnant death
-
ఏ చర్యలు తీసుకుంటారో తేల్చుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20) పురుటినొప్పులతో బాధపడుతున్నా కరోనా వైరస్‌కు భయపడి వైద్యం అందించని వైద్యులపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేసి వి చారణ తర్వాత చర్యలు తీసుకోవాలని తాము ఆ దేశాలు జారీ చేయగలమని, అయితే కరోనాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్లో మనోధైర్యం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఉత్తర్వులు ఇవ్వ డం లేదని తెలిపింది. క్రిమినల్ కేసు నమోదా లేక శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదీ ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. వైద్యం అందకే జెనీలా మరణించిందని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్‌కుమార్, శ్రీనిత పూజారి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిందని దాఖలు చేసిన కౌంటర్‌తో సంతృప్తికరంగా ఉన్నందున పిల్స్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘నిండు’ ప్రాణాలు బలి
విధి వక్రీకరించడమంటే ఇదేనేమో.. తాను రెండేళ్ల వయసున్నప్పుడు అమ్మను కోల్పోయి తల్లి లేని అనాథగా పెరిగింది. ఇప్పుడు తాను చనిపోతూ రెండేళ్ల కుమార్తెను ఒంటరి చేసి వెళ్లిపోయింది. డెంగీ మహమ్మారి కారణంగా చింతాడలో నిండు గర్భిణితో పాటు కడుపులో బిడ్డ సైతం మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారం పది రోజుల్లో ఇంటికి మరో చిన్నారి వస్తుందని ఆశగా ఎదురుచూసినా కుటుంబ సభ్యులు గర్భిణి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని చింతాడ గ్రామంలో డెంగీ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చింతాడకు చెందిన గుండ సత్యనారాయణతో కిల్లిపాలెం గ్రామానికి చెందిన గీత గాయత్రీ(27)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 21 నెలల వయసున్న దేదీప్య అనే కుమార్తె ఉంది. భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గీత గాయత్రీ తొమ్మిది నెలల గర్భిణి కావడంతో ప్రసవం కోసం చింతాడకు రెండు వారాల క్రితమే వచ్చింది. ఈ నెల 11న జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో విశాఖపట్నం తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా డెంగీ జ్వరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించినా జ్వరం తగ్గలేదు. నిండు గర్భిణి కావ డం, శరీరం సహకరించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున గీత గాయత్రీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లు తెరవకుండానే కాటికి. గీత గాయత్రీకి చికిత్స అందిస్తున్నప్పుడే కడుపులోని బిడ్డ మృతి చెందింది. వైద్యులు సాధారణ ప్రసవం చేయించి మృతశిశువును బయటకు తీశారు. తల్లి రెండు గంటల సమయంలో మృతి చెందింది. గీతగాయత్రీ మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియక కుమార్తె దేదీప్య బిత్తరచూపులు చూడటం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గీతా గాయత్రీ రెండేళ్ల పాపగా ఉన్నప్పుడే తల్లి మృతి చెందిందని, ఇప్పుడు ఆమె కూడా అలాగే చనిపోవడం ఘోరమని స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరో పది మంది వరకు డెంగీ బాధితులు.. చింతాడలో బోర హనీష్, గుండ నవ్య, మణ్యం రామలక్ష్మి, చింతాడ అరుణలు ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వీరితో పాటు మరో పది మంది డెంగీ జ్వరంతో, సుమారు 70 మంది వైరల్, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టినట్లు పేర్కొన్నారు. గీత గాయత్రీ మృతితో ఆయా కుటుంబాలు భయాందోళనకు గురౌతున్నాయి. పారిశుద్ధ్య లోపం వల్లే జ్వరాల విజృంభణ చింతాడలో పారిశుద్ధ్యం క్షీణించింది. శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో కలిసి ఈ గ్రామం ఉండడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి అయినప్పటికీ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామం మధ్యలో ఉన్న సాంబయ్య బంద మురికికూపంగా మారినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. వారపు సంతలోనూ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలేదని, రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి పారిశుద్ధ్య పనులు నిర్వహించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రసవ వేదనతో గర్భిణి మృతి
ఆసిఫాబాద్ రూరల్: సరైన వైద్య సదుపాయం అందక ప్రసవ వేదనతో నిండు గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఇది. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రక్తస్త్రావం కావడంతో మృతిచెందింది. సోమవారం కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొడప గంగ (24)కు పురిటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. అయితే జిల్లాలో సిబ్బంది సమ్మెలో ఉండటంతో వాహనం రాలేదు. పురిటి నొప్పులు అధికంగా కాగా భర్త శేఖర్ ఆటోలో గంగను తీసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లేసరికి అధిక రక్తస్రావం కావడంతో పిండం బయటపడి గంగ అక్కడికక్కడే మృతి చెందింది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేక..ఉన్నా వైద్యులు పట్టించుకోక నిండు గర్భిణుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఇది ఆరో ఘటన కావడం గమనార్హం. -
గర్భంలోనే పిండం మృతి
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్‌బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్‌కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
భర్త వేధింపులతో గర్భిణి మృతి
మంచిర్యాలక్రైం: భర్త వేధింపులతో అనారోగ్యానికి గురై గర్భిణి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నిమ్మకంటి శ్రీలత (22) బెల్లంపల్లికి చెందిన ఎండీ అజ్గర్‌తో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో శ్రీలత కుటుంబ సభ్యులు కొంత కాలంగా ఇంటికి రానియ్యలేదు. తరుచూ వేధింపులకు గురి చేస్తూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటికే శ్రీలత నాలుగు నెలల గర్భిణి. దీంతో అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక మృతి చెందింది. ఆమె మృతికి భర్త అజ్గర్ కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. -
బైక్‌ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్ చెకింగ్ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంబడించి కాలితో తన్నడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్‌ప్లాజా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా భార్యతో కలసి బైక్‌పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్ యత్నించారు. కానీ రాజా బైక్‌ను ఆపలేదు. వెంటనే మరో బైక్‌పై వెంబడించిన కామరాజ్.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్‌ను కాలితో తన్నారు. దీంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కామరాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. -
అత్యాచారయత్నం.. డీసీఎం నుంచి దూకి గర్భిణి దుర్మరణం
తూప్రాన్: మెదక్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కూతురి(7)తో కలిసి డీసీఎం వ్యాన్‌లో ప్రయాణించిన ఓ గర్భిణిపై డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ గర్భిణీ వాహనంలోంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని తూప్రాన్ మండలం రావెల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఉగిడే కళావతి (32) ఎనిమిది నెలల గర్భిణి. తన కూతురు శిరీష(8)తో కలసి బట్టల వ్యాపారం కోసం మేడ్చల్ జిల్లా కొంపల్లికి వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో డీసీఎంలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే డీసీఎం కరీంగూడ చౌరస్తా వద్ద ఆపకుండా అతివేగంగా వెళ్తుండటంతో వాహనాన్ని ఆపాలని ఆమె కోరింది. అయినా డ్రైవర్ వినిపించుకోకుండా ముందుకు వెళ్లడంతో కలవరపడిన ఆమె డీసీఎం నుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. షాక్‌కు గురైన డ్రైవర్ ఆమె కూతురును, బట్టల మూటను రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యాడు. సమీపంలోని కొందరు గమనించి కుటుంబీకులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పరుశురాంగౌడ్ తెలిపారు. స్టేజీ వెళ్లిపోతోందన్న తొందరలో.. దిగే స్టేజీ వెళ్లిపోతోందన్న తొందరలో కళావతి దూకి మరణించినట్లు ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొనగా.. ఆమె తల్లిదండ్రులు మాత్రం డీసీఎంలోని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడటంతో కళావతి దూకి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కట్టలు తెగిన ఆగ్రహం
♦ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి ♦ అవగాహనారాహిత్యంతో చికిత్స ♦ ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ♦ వద్ద బాధితులు, గ్రామస్తుల ఆందోళన లింగపాలెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సంచలనం కలిగించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మఠంగూడెం గ్రామ శివారు సుందరరావుపేట గ్రామానికి చెందిన దేవరపల్లి తంబి భార్య విఘ్నేశ్వరి (23)కి నెలలు నిండటంతో శనివారం ఉదయం ధర్మాజీగూడెం పీహెచ్‌సీకి తీసుకువచ్చా రు. సాయంత్రం 4 గంటల నుంచి పురు టి నొప్పులు రావడంతో స్టాఫ్ నర్సులు జ్యోతి, దుర్గ, గంగా వైద్యం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రాత్రంతా విఘ్నేశ్వరి నొప్పులు భరించింది. ఈ సమయంలో విఘ్నేశ్వరి బాధను చూడలేక భర్త తం బి, కుటుంబసభ్యులు ఆమెను చింతలపూడి ఆస్పత్రికి తీసుకువెళతామని అడిగినా నర్సులు అంగీకరించలేదు. అవగా హనరాహిత్యంతో వైద్యసేవలు అందించారు. వైద్యాధికారి బి.మోజెస్ వినయ్‌కుమార్ గర్భిణిని కనీసం పట్టించుకోలేదు. ఆది వారం ఉదయం 9 గంటలకు వైద్యాధి కారి ఆస్పత్రికి వచ్చినా కనీసం వచ్చి చూడలేదు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో విఘ్నేశ్వరికి నర్సులు సీజేరియన్ చేసే ప్రయత్నంలో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. విషయం తెలిసిన వైద్యాధికారి మోజెన్ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పాటు అందుబాటులో లేరు. ముగ్గురు నర్సులు పీహెచ్‌సీలోని ఒక గదిలో గడివేసుకుని దాక్కున్నారు. విషయం తెలిసిన సుందరరావుపేట ప్రజలు పెద్ద ఎత్తున పీహెచ్‌సీకి తరలివచ్చి ఆందోళన చేశారు. డీఎంహెచ్ఓకు విషయాన్ని తెలియజేశారు. ఏలూరు–చింతలపూడి రహదారిపై ధర్నాకు దిగా రు. ఎస్సై వి.క్రాంతికుమార్ వీరితో చ ర్చించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విచారణాధికారిగా కె.సురేష్‌బాబు ఇక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. డాక్టర్ మోజెస్ మద్యం సేవించి, గుట్కాలు నములుతూ ఆస్పత్రిలో తిరుగుతుం టారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పీతల సుజాత విషయాన్ని కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన విచారణాధికారితో ఫోన్లో మాట్లాడారు. డాక్టర్ మోజెస్ వినయకుమార్‌ను సస్పెం డ్ చేస్తూ క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్టు తెలిసింది. తహసీల్దార్ బి.సోమశేఖరరావు, ధర్మాజీగూడెం సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు గారపాటి బుజ్జియ్య, సీఐ రాజేష్ తది తరులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాధి కారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి విఘ్నేశ్వరి మృతదేహన్ని ఏ లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చినట్టు ఎస్సై చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే.. ధర్మాజీగూడెం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నా భార్య కన్నుమూసింది. ఆస్పత్రిలో దాదాపు 17 గంటలపాటు నరకయాతన అనుభవించింది. సరైన వైద్యం అందలేదు. డాక్టర్ సరిగా స్పందించలేదు. సిబ్బంది అవగాహనలేమితో కాన్పు చేయలేక ప్రాణం పోగొట్టారు. – తంబి, మృతురాలి భర్త కనీసం డాక్టర్ పట్టించుకోలేదు నొప్పులు ఎక్కువగా వచ్చి నరకయాతన పడుతుంది విఘ్నేశ్వరిని పంపించండి అని ప్రాధేయపడినా నర్సులు ఒప్పుకోలేదు. డాక్టర్‌ను వచ్చి చూడమన్నా చూడకుండా వెళ్లిపోయారు. కనీసం డాక్టర్ వచ్చి చూసి రిఫర్ చేసినా విఘ్నేశ్వరి బతికేది. – చిట్లూరి ఝాన్సీరాణి, మృతురాలి వదిన -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి
► తప్పు కప్పిపుచ్చేందుకు వైద్యులయత్నాలు ► మరణించిన గంటన్నర తర్వాత పెద్దాసుపత్రికి రెఫర్ జైనూర్(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి బలైంది. పురిటి నొప్పులు, వాంతులతో బాధపడుతూ చికి త్స కోసం ఆస్పత్రికి వచ్చిన గిరిజన గర్భిణి గంటసేపు నరక యాతన అనుభవించింది. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు వైద్యులు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గర్భిణి మరణించిన గంట సేపు తర్వాత మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. మృతి చెందిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించినా.. తమ నిర్వాకం బహిర్గతం కాకుండా ఉండేందుకు డెత్ సర్టిఫి కెట్ అవసరం ఉంటుందని మెప్పించినట్లు బాధిత కుటుంబీ కులు తెలిపారు. జైనూర్ మండల కేంద్రం రాంనగర్‌కు చెం దిన ఆత్రం అరుణకు పురిటినొప్పులు రావడంతో శనివారం జైనూర్ ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆమె భర్త సుదర్శన్ డాకర్ట్స్ క్వార్టర్స్‌కు వెళ్లి విషయం చెప్పారు. గంటసేపు తర్వాత వచ్చి న వైద్యుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అరుణ కొద్ది సేపటికే కన్నుమూసింది. మర ణించిన గంట తర్వాత అరుణను అవ్వాల్ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. శవాన్ని ఉట్నూర్ ఎందుకు పంపిస్తున్నారని వైద్యులను నిలదీయగా ..డెత్ సర్టిపికెట్ కోసం ఉట్నూర్ వెళ్లాల్సిందేనని చెప్పినట్లు సుదర్శన్ వివరిం చాడు. అయితే, అంబులెన్స్‌లో ఉట్నూర్ వెళ్లగా అప్పటికే ఫోన్ మాట్లాడుకున్న ఉట్నూర్ ఆస్పత్రి వైద్యుడు వాహనం వద్దకే వచ్చి శ్వాస ఆడక మృతి చెందిందని చెప్పి తిరిగి పంపించినట్లు కుటుంబీకులు తెలిపారు. గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించాం అరుణ మరణించిన తర్వాత ఉట్నూర్ ఆస్పత్రికి పంపించిన విషయమై వైద్యుడు నరేశ్‌ను సంప్రదించగా, మృతికి గల కారణాలతో పాటు.. మరణించినట్లు ధ్రువీకరించేందుకు గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించానన్నారు. తాను వెంటనే చికిత్స ప్రారంబించానని ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు. -
ప్రతి ఐదు నిమిషాలకో గర్భిణి మృతి!
ముంబై: దేశంలో ప్రతి ఐదు నిమిషాలకో గర్భిణి మృతి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదివారం తెలిపింది. గర్భం మోస్తున్నప్పుడు, ప్రసవం సమయంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న గర్భిణుల్లో 25.7 శాతం మంది భారతీయ మహిళలే ఉంటున్నారు. వీటిలో మూడింట రెండు వంతులు ప్రసవం తర్వాత సంభవిస్తున్న మరణాలే. కాన్పు సమయంలో అధిక రక్తస్రావమే ఇందుకు కారణం. ప్రతీ లక్ష మంది గర్భిణుల్లో 83 మందికి ప్రసవం తర్వాత గర్భసంచి తొలగించాల్సి వస్తోంది. కాన్పు సమయంలో అర్ధలీటరు నుంచి లీటరు వరకు రక్తం పోతే దాన్ని అధిక రక్తస్రావంగా భావిస్తారు. ప్రసూతి మరణాలు అస్సాంలో అత్యధికంగా, కేరళలో అత్యల్పంగా నమోదవుతున్నాయి. -
గర్భిణి మృతిపై ఎమ్మెల్యే ఆరా
కొమరాడ: మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురం గ్రామంలో గిరిజన గర్భిణి కోలక ఇందిర(22) గత నెల 6న ఆకస్మికంగా మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి సోమవారం సంబంధిత సిబ్బందిని ఆరా తీశారు. దీనిపై వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసలు ఐసీడీఎస్ నుంచి గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. కొమరాడ మండలంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి సక్రమంగా పౌష్టికాహారం అందడంలేదని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆమె మృతిపై వైద్యాధికారులు కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని అసహనం వెలిబుచ్చారు. ఎక్కువగా ఏజెన్సీలో గిరిజన గర్భిణులే మృతిచెందుతున్నారని, ఇదంతా వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంవల్లే జరుగుతున్నట్లు తేలిందన్నారు. సూపర్వైజర్లు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పర్యవేక్షించాలని, తాను కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, తన తనిఖీలో అక్రమాలు వెలుగులోకొస్తే బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని స్పష్టం చేశారు. పౌష్టికాహారం వినియోగంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అలాగే వైద్యసిబ్బంది కప్పటికప్పుడు తనిఖీలుచేసి తగిన మందులు అందించాలని సూచించారు.