
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. తండాలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. అరుణ, హన్మాన్ సింగ్ దంపతుల తమ చిన్న కూతురు చిన్నారి (3 నెలలు)కి పోలియో రాకుండా చుక్కలు వేసి, టీకాలు ఇచ్చారు.
ఇంటికి చేరుకున్న వెంటనే చిన్నారి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. వైద్య సిబ్బంది వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది. డీఎంహెచ్‌వో సుదర్శనం విచారణ చేపట్టారు. ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, చిన్నారికి ఇచి్చన టీకాలు, చుక్కల మందును సీజ్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment