Child deaths
-
తన్విత.. లేమ్మా!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మూడేళ్ల చిన్నారి తన్వితకు మూడురోజులుగా తీవ్ర జ్వరం. కళ్లు తెరవలేని పరిస్థితి. వైద్యం చేయిద్దామన్నా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి తల్లిదండ్రులది. జ్వరంతోనే ఈ చిన్నారి మృత్యువాతపడింది. న్యూ రాజరాజేశ్వరి పేటలోని జీప్లస్ త్రీ అపార్ట్మెంట్ 20వ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్న రొట్టా కృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు. తని్వత(3) పెద్దపాప. కృష్ణ పెయింటింగ్ పనులు చేస్తూ, సునీత ఇంటి వద్ద కుట్టుమిషన్ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద కృష్ణ ఇంటిలోకి చేరడంతో సమీపంలో బంధువుల ఇంటిలో తలదాచుకున్నారు. వారం రోజులుగా రాజరాజేశ్వరిపేటను వరద ముంచేసింది. బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వీలులేదు. ఈ క్రమంలో తని్వతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లలేని నిస్సహాయస్థితి. ఇంట్లోనే అందుబాటులో ఉన్న మాత్రలు వేశారు. సోమ వారం కొంత వరద తగ్గడంతో తన్వితను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యంలోనే పాప చనిపోయిందని నిర్ధారించారు. మాయ దారి వరద తమ బిడ్డను మింగేసిందంటూ తన్విత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘తన్వీ.. లేనాన్న.. నన్ను చూడు.. నీకేం కాదు. నేనున్నాను..’ అంటూ చిన్నారి మృతదేహంపైపడి తల్లి సునీత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. -
ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..!
తూర్పుగోదావరి: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు నీటి ట్యాంకులో పడి దుర్మరణం చెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనలో గట్టిం వినిత (4), కమ్మిల జస్వంత్ (4) మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన గట్టిం శ్రీనివాస్, దేవి దంపతులు, కమ్మిల రాము, గణేశ్వరి దంపతులు పక్కపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు వినిత పెద్ద కుమార్తె. ఆమె తరువాత ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాము దంపతులకు జస్వంత్‌తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వినిత, జస్వంత్ నర్సరీ చదువుతున్నారు. కాన్వెంట్కు వెళ్లి వచ్చిన తరువాత వీరిద్దరూ సాయంత్రం వినిత్ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకుకు ఉన్న నిచ్చెన ఎక్కి, ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయారు. పిల్లలిద్దరూ చాలాసేపు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వారి కోసం వెతికారు. చివరకు వాటర్ ట్యాంకులో చూడగా చిన్నారులిద్దరూ విగతజీవులై ట్యాంకులో తేలుతూ కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే పిల్లల జీవితం విషాదాంతం కావడంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి వినిత తండ్రి శ్రీనివాస్ వాటర్ ట్రాక్టర్లపై ట్యాంకర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఇంటి వాటర్ ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిచ్చెనే పిల్లల ఉసురు తీస్తుందనుకోలేదంటూ అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరో మృతుడు జస్వంత్ తండ్రి రాము వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్నామని, ఇంతలోనే తమ బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని వారు రోదిస్తున్నారు. ఇవి కూడా చదవండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి -
బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్‌డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్‌తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్‌పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. -
TS Crime News: నిన్న వేడుక.. ఈరోజు ఇలా.. తీవ్ర విషాదం!
ఖమ్మం: పాప పుట్టిన ఆనందంలో ఆ కుటుంబం బారసాల వేడుకగా నిర్వహించారు. అంతకుముందు కుమారుడు ఉండడంతో ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడపొచ్చని అనుకున్నారు. కానీ ఆటో రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇంట విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు రేళ్లపాడు రాజీవ్ నగర్‌కు చెందిన భరత్‌కుమార్, వేంసూరు మండలం రాయుడుపాలెంకు చెందిన దివ్య వివాహం చేసుకున్నారు. భరత్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరికి రెండేళ్ల కుమారుడు దర్షిత్ ఉన్నాడు. తాజాగా మరో కుమార్తె జన్మించడంతో పాపకు రాయుడుపాలెంలో బుధవారం బారసాల వేడుక నిర్వహించారు. కాగా, గురువారం ఉదయం దర్షిత్ రోడ్డు పక్కన ఆడుకుంటుండగా అజాగ్రత్తగా ఉల్లిపాయల ఆటో నడిపిన డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్షిత్‌ను సత్తుపల్లి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాయుడుపాలెం ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చిన్నారుల ప్రాణాలు తీసిన కాల్వ గుంత!
మహబూబ్‌నగర్: ప్రమాదవశాత్తు సాగునీటి కాల్వలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆముదంబండ తండాకు చెందిన ఇస్లావత్ లాలునాయక్, శ్రీనునాయక్‌లు అన్నదమ్ములు. వీరు శుక్రవారం తమ వ్యవసాయ భూమిలో వరినాట్లు వేసేందుకు ఉదయమే కుటుంబసభ్యులందరితో కలిసి పొలం వద్దకు వెళ్లారు. వర్షం వచ్చేలా ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇస్లావత్ లాలు, లక్ష్మీ దంపతుల కుమారుడు ప్రవీణ్(9), ఇస్లావత్ శ్రీనునాయక్, ముత్యాలి కుమార్తె వైష్ణవి (7)ని ఇంటికి వెళ్లి నాయనమ్మ వద్ద ఉండమని తల్లిదండ్రులు పంపించారు. వారు ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న కర్నె తండా ఎత్తిపోతల కాల్వ కోసం పైపులు వేసేందుకు కాంట్రాక్ట్ గుంతలు తవ్వి ఉంచారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంతల్లో నీళ్లు నిండాయి. ఇది గమనించని చిన్నారులు కొద్ది నీళ్లు ఉన్నాయి అనుకుని దాటేందుకు వెళ్లి.. అందులో పడిపోయారు.ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో తండాలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో దారివెంట వెతుకుతూ.. అనుమానం వచ్చి నీటి గుంతలో దిగి వెతికారు. దీంతో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ప్రతి రోజు కళ్లముందు ఆడుతూపాడుతూ కనిపించే చిన్నారులు విగతాజీవులుగా పడిఉండడం చూసి గిరిజనులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్ప్రత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తెలిసింది. డాకర్టులు వేసిన ఇంజెక్షన్లు వికటించడం వల్లే తమ పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్లు వల్లే చిన్నారులు చనిపోయారని కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారులను ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే వారి ఆరోగ్యం విషమించిందని తెలిపారు. చనిపోయింది ఒకరే.. ఇద్దరు కాదు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయింది ఒక చిన్నారని, ఇద్దరు కాదని వెల్లడించారు. ఈ నెల 28న చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారని తెలిపారు. రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధితో ఆ చిన్నారి బాధ పడుతుందని అన్నారు. 7వ నెలలో పుట్టిన ఒక కేజీ బరువుతో ఉన్న ఆ చిన్నారి బుధవారం ఉదయం సుమారు 6గంటల సమయంలో మృతి చెందినట్లు చెప్పారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లోపల అవయవాలు ఎదుగుదల ఉండదని అన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచామని తెలిపారు. బాధలో ఉన్న తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తప్పిదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
బంగారు తల్లులు అమ్మకే బరువుగా మారుతున్నారు..!
ఔను...అమ్మకే ఆడ శిశువు బరువవుతోంది. దీంతో జిల్లాలో మగ,ఆడ పిల్లల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలి కాన్పులో కూడా ఆడపిల్లను తిరస్కరించడంతో పిండ దశలోనే పిండేస్తున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా నారీ గళాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. నిఘాల మాటునే నీరుగార్చేస్తున్నారు. సాక్షి,విజయనగరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడపిల్లను పిండ దశలోనే పిండేస్తున్నారు. దీంతో మగపిల్లల నిష్పత్తితో పోల్చుకుంటే ఆడపిల్లల నిష్పత్తి (1000:938)గా గుర్తించారు. జిల్లాలో బంగారు తల్లులను ఉమ్మనీటిలోనే కన్నుమూసే పరిస్థితి ఎదురవుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడే లోపల పెరిగేది ఆడ, మగ అని తెలుసుకుని మరీ చంపేస్తున్న ఘటనలు వైద్యుల సాయంతోనే గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇందుకు గర్భిణులు కూడా సహకరిస్తుండడంతో ఇవేవీ బయటకు రావడం లేదు. జిల్లాలో 66 ప్రైవేట్, 14 ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లున్నాయి. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం సంబంధిత వ్యక్తులకు సైగలతో చెప్పడంతో గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రూ.10 వేలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిసినా పరస్పర ఒప్పంద ప్రాతిపదికగా చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. రెండోసారి తప్పు చేసినట్లు నిర్ధారణయితే ఐదేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు వైద్య ధ్రువీకరణ పత్రం భారత వైద్య మండలి ద్వారా ఐదేళ్ల రద్దు చేస్తారు. తర్వాత కూడా ఇదే పనికి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానాతోపాటు శాశ్వతంగా వైద్య ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తారు. 12 ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానంతో జిల్లాలో బొబ్బిలి, ఎస్.కోట, సాలూరు ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం. ఇలా మొత్తం 12 ఆసుపత్రుల్లో తమ సిబ్బంది డెకోయ్ ఆపరేషన్ నిర్వహించింది. వైద్యులు తప్పిదాలకు పాల్పడితే వారి వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు చేస్తాం. గర్భస్ధ పిండం పరిస్ధితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో డెకోయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల్లో ఎవరైనా సరే లింగ నిర్ధారణకు పాల్పడుతున్నారని తెలిస్తే నేరుగా 9849902385 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ, విజయనగరం చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’ -
గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని చిన్నారి మృతి
పావగడ: గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య (9 నెలలు) సంతానం. ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... కుమారుడు సత్య ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ బ్యాంక్ మేనేజర్ -
ఆకలి రాజ్యం
ఛిఏమిటీ.. మీరు ప్రపంచంలో ఆకలి లెక్కలు వేసి మాకు చెబుతారా? త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి... ఆకలి రాజ్యమా. ఏం లెక్కలివి? ఎవరి లెక్కలివి? అయిదేళ్లు నిండని పాపలకు మేం సరిగా అన్నంపెట్టడం లేదా? ఆర్నెల్ల పసికందుల నుంచి రెండేళ్ల పాపలలో 84 శాతం మందికి మేం కనీస తిండి కూడా పెట్టడం లేదా? అద్భుతంగా వెలిగిపోతున్న మా దేశాన్ని అంతర్జాతీయంగా పరువు దీయడానికేనా ఈ మాటలు. మొత్తం 119 దేశాలలో మాదేశం 102 రెండవస్థానంలో ఉందన్నా ఫరవాలేదు. దక్షిణాఫ్రికా కన్నా హీనంగా ఉన్నామన్నా సర్దుకుంటాం. కానీ బాంగ్లాదేశ్ కన్నా, చిన్నిచిట్టి దేశం నేపాల్ కన్నా మేం తీసిపోయామా? 2015లో మా దేశానికి కింద పాకిస్తాన్ ఉందని మీరే చెప్పారు. మాకు 93వ ర్యాంకు ఇచ్చి పాక్‌కు 106 ఇచ్చారు. అది న్యాయం. ఆకలి మంటల్లో మేం ఎక్కడున్నా సరే పాకిస్తాన్ కన్నా ముందున్నాం అని అప్పటినుంచి మేం సంతోషిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు ఆ అపరిమితానందం కరువుచేస్తారా? మా దాయాది, మా శత్రువు, వారి పేరు చెబితే చాలు మాకు ఓట్లు కుప్పలు తెప్పలుగా పడతాయి. మావాళ్లే ప్రతిసారీ గెలిచినా సరే మేం వారితో క్రికెట్ ఆడనే ఆడం. అటువంటి పాకిస్తాన్ కన్నా మాదేశాన్ని 8 అడుగుల కిందకు తోస్తారా? 2016లో మాకు 97, పాక్‌కు 107 ఇచ్చారు, 2017లో మాకు 100, మా దాయాదికి 106 ఇచ్చారు. ఫరవాలేదు. చివరకు పోయినేడాది 2018లో పాక్‌కు 106 ఇచ్చి మాకు 103వ ర్యాంకు ఇచ్చారు. అదే కరెక్టు. ఈసారి మా ర్యాంక్‌ను 103 నుంచి 102 చేశారు. మాకది పెద్ద ప్రమోషనే కదా అని సంతోషిద్దామనుకున్నాం. కాని పాక్‌కు 93వ ర్యాంక్ ఇచ్చి మమ్మల్ని అవ మానించారు. కనీసం పాక్‌కన్నా ముందున్నాం అని చెప్పినా మిమ్మల్ని క్షమించే వాళ్లం. మీరు టెర్ర రిస్టుల్లో కలిసిపోయారా లేక మా దేశంలో అర్బన్ నక్సలైట్లు మీమీద ఏమైనా మత్తుమందు జల్లారా? మాకు చెత్త ర్యాంకు ఇస్తే ఇచ్చారని సరిపెట్టుకుందామనుకుంటే, బంగ్లాదేశ్‌ను తెగ మెచ్చుకుంటారా? బాలబాలికలకు పోషకాహారం ఇచ్చే బుద్ధి వారికి ఎక్కువగా ఉందా, పరిశుభ్రత కల్పించడంలో, ప్రచారంలో, ఆరోగ్యం రక్షించడంలో బంగ్లాదేశ్‌కు అన్ని మార్కులు, పక్కనే ఉన్న మా దేశానికి మరీ అంత తక్కువ మార్కులు? వేస్తారా? మాకన్నా చిన్న దేశం నేపాల్‌ను అంతగా పొగి డారు. సరే అది మా హిందూ రాజ్యం గనుక ఫరవాలేదు. కాని మరీ అన్ని ప్రశంసలా? 2000 సంవత్సరం తరువాత నేపాల్ వారు ఆకలి మీద యుద్ధంలో చాలా ముందుకు వెళ్లారంటారా? మేమేమీ చేయలేదంటారు. మా దేశంలో చాలామంది పిల్లలు పురిట్లోనే పోయారంటారా? పిల్ల లకు ఎత్తుకు తగిన బరువు, వయసుకు సరిపోయే ఎత్తు లేదంటారా? ఏం మా పిల్లల్ని ఎప్పుడైనా ఎత్తుకున్నారా? లేకపోతే మీకెలా తెలుస్తుందో? మేం స్వచ్ఛభారత్ ద్వారా పారిశుధ్యం చాట డం లేదా, బహిర్భూమిలో విసర్జన మీద యుధ్దం ప్రకటించి, బోలెడు మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం కదా, అంతర్జాలం డాష్‌బోర్డులో క్లిక్ కొడితేచాలు ఏ ఊళ్లో ఎన్ని మరుగుదొడ్లు కట్టామో లెక్క చూసుకునే అద్భుతమైన, అదిరిపోయే పారదర్శక పాలనా విధానాన్ని తీసుకువచ్చాం. మేం ఎంత పారదర్శకంగా ఉన్నామంటే అసలు మాకు ఆర్టీఐతో పనే లేదు తెలుసా. అందుకే మేం మా సమాచార కమిషనర్లకు అంత పెద్ద ర్యాంకు ఎందు కని తగ్గించి పడేశాం. మీరు మా ఆకలి ర్యాంకు పెంచుతారా? మాదేశంలో ప్రతి శుక్రవారం వందల సినిమాలు విడుదల అవుతాయి. వాటిలో బోలెడు సినిమాలు వందల కోట్లు సంపాయిస్తున్నాయి. అయినా మాదేశంలో ఆర్థిక మాంద్యం ఉందని తప్పుడు ప్రచారం చేసి ఫేక్ న్యూస్ పంచుతున్నారని మేం జనానికి నచ్చజెప్పుకుంటున్నాం. కొత్తగా ఈ ఆకలి అంకెల పంచాయతీ ఏమిటి? ఆకలిమంటలు పెరిగాయనే అనుకుందాం. దానికి మేమా కారణం. పర్యావరణ వాతావరణ మార్పులు, భూమి వేడెక్కడం కావచ్చు, పాక్– చైనా సమష్టి కుట్ర కావచ్చు. కమ్యూనిస్టులు తెచ్చిన విదేశీ హస్తం కావచ్చు. పటేల్‌ను పక్కన బెట్టి ప్రధాని అయిన నెహ్రూ రాజకీయ కుట్ర కావచ్చు. మేం మాత్రం కాదు. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల సమయంలో ఇదేదో కొత్త కుట్ర అయి ఉంటుంది. మీ ఆకలి లెక్కలు, మా డబ్బుల లెక్కలు చెప్పి మా జనాన్ని భయపెట్టాలని చూడకండి. 370 మాకు చాలు. ఆకలట ఆకలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
టీకా వికటించి చిన్నారి మృతి
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. తండాలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. అరుణ, హన్మాన్ సింగ్ దంపతుల తమ చిన్న కూతురు చిన్నారి (3 నెలలు)కి పోలియో రాకుండా చుక్కలు వేసి, టీకాలు ఇచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే చిన్నారి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. వైద్య సిబ్బంది వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది. డీఎంహెచ్‌వో సుదర్శనం విచారణ చేపట్టారు. ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, చిన్నారికి ఇచి్చన టీకాలు, చుక్కల మందును సీజ్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
బిడ్దకు నిప్పంటించి..ఆ తర్వాత
సాక్షి, నిజామాబాద్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మౌనిక మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇంట్లో తన కూతురు అద్వైత (ఏడాదిన్నర)పై కిరోసిన్‌పోసి, తాను పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తట్టుకోలేక బకెట్లో ఉన్న నీటిని కూతురిపై, తనపై పోసుకుని మంటలను ఆర్పేసింది. అప్పటికే పూర్తిగా కాలిపోయిన కూతుర్ని తీసుకొని బయటకు వచ్చి ఏడుస్తుండగా, గ్రామస్తులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా, పాప మృతి చెందింది. చికిత్స పొందుతున్న మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మౌనికకు నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పదిరోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఈ అఘాత్యానికి పాల్పడింది. కాగా కార ణాలు తెలియరాలేదు. -
రెప్పపాటులో ఘోరం..
కొమరాడ: రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. శుభకార్యానికి వచ్చిన చిన్నారి లారీ ప్రమాదంలో కన్నుమూసింది. కళ్లముందే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన నరాల రాజు, మాధురి దంపతులు విశాఖలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో విక్రమపురంలోని బంధువుల ఇంటిలో జరగనున్న శుభకార్యంలో పాల్గొనేందుకు బుధవారం గ్రామానికి వచ్చారు. రెండో సంతానమైన హరిణిక (8) విక్రంపురం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా.. పార్వతీపురం నుంచి ఒడిశా వైపు అతివేగంగా వెళ్తున్న లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో కళ్లముందే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొమరాడ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలెన్నో....? కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.అతివేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు మీదకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు నిలదీశారు. -
ముళ్ల పొదలో నిర్జీవ శిశువు
సాక్షి, పెద్దదోర్నాల: పేగు తెంచుకొని పుట్టిన ఆ పసి బిడ్డ ఏ తల్లికి భారమయ్యాడో ఏమో.. 9 నెలలు పాటు తల్లి కడుపులో పెరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ముళ్ల పొదల మధ్య నిర్జీవంగా కన్పించాడు. కుక్కలు పీక్కు తినటంతో ఓ కాలు, ఓ చేయి లేని శిశువు మాంసం ముద్దలా మారి మంగళవారం సాయంత్రం నిర్జీవంగా స్థానికుల కంట పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపంలో కర్నూల్, గుంటూరు ప్రధాన రహదారి పక్కనే చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఐనముక్కల వద్ద నిరుపయోగంగా ఉన్న ఎమ్మార్సీ భవనం ఎదురుగా ఉన్న చిల్ల చెట్లలో శిశువు మృతదేహం పడి ఉన్న వార్త వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆకర్షిణీయంగా ఉన్న ఆ మగ శిశువు పదునైన ముళ్ల కంపలో పడి ఉండటాన్ని చూసి.. చిన్నారిని అలా పడేయడానికి ఆ తల్లిదండ్రులకు ఎలా మనస్సు వచ్చిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు బతికి ఉండగానే భారమని అక్కడ పారవేశారా లేక పుట్టిన వెంటనే ప్రాణం పోవడంతో తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అని చర్చించుకున్నారు. కాగా చనిపోయిన మృతశిశువును అక్కడే ఉన్న మట్టికుప్పలో నామమాత్రంగా పూడ్చి వేయటం వల్ల మృత శిశువును కుక్కలు బయటకు లాక్కొనివచ్చి ఉంటాయని మరి కొందరు భావిస్తున్నారు. మృత శిశువు పడి ఉన్న విషయాన్ని పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై సుబ్బారావు మాట్లాడుతూ సమీప గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ మహిళ మృత శిశువుకు జన్మనిచ్చి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొంతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఏ తల్లి కన్న బిడ్డో
శ్రీకాకుళం, రాజాం సిటీ: స్థానిక నగరపంచాయతీ పరిధిలోని బంగారమ్మ కోనేరులో శిశువు మృతదేహం సోమవారం లభ్యమయింది. నెల రోజుల క్రితం ఈ శిశువు జన్మించి ఉండవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముక్కుపచ్చలారని శిశువు మృతిచెందడం బంగారమ్మ చెరువు పరిసర ప్రాంత ప్రజలతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నవారిని కలచివేసింది. చెరువులో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. చెరువులోని పసికందు మృతదేహాన్ని బయటకు తీశారు. మగశిశువుగా గుర్తించారు. నెల నుంచి రెండు నెలల వయసు ఉంటుందని అంచనా వేశారు. ఈ శిశువుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు, ఫిర్యాదులు లేకపోవడంతో నగరపంచాయతీ అధికారులకు సమాచారం అందించారు. నగరపంచాయతీ సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని శిశువు మృతదేహాన్ని తీసుకుని చెరువు సమీపంలోనే ఖననం చేశారు. ఎవరిదీ పాపం పిల్లలు పుట్టక చాలా మంది గుడులు, గోపురాలు, ఆస్పత్రులు చుట్టూ తిరుగుతుంటే పుట్టిన పండంటి మగబిడ్డను ఇలా చెరువులో పారవేయడం పలువురిని ఆవేదనకు గురిచేసింది. ఈ శిశువును ఎవరో హత్యచేసి ఉంటారా? లేక చేసిన పొరపాటుకు పుట్టిన బిడ్డను ఇలా బలిచేశారా అనేది అనుమానంగా మారింది. ఏది ఏమైనా చెరువు పరిసర ప్రాంతాల నుంచి ఎటువంటి అనుమానాలు వ్యక్తం కాలేదు. కాగా ఈ చెరువు ప్రాంతం రాజాం సంతమార్కెట్ పక్కనే ఉండడం మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఏడాదిలో రెండో ఘటన రాజాంలో ఇటువంటి శిశువుల మృతదేహాలు లభించడం ఏడాది వ్యవధిలో రెండో ఘటన కావడం శోచనీయం. సరిగ్గా ఏడాది క్రితం డోలపేటలోని చెరువులో ఇటువంటి శిశువు మృతదేహమే లభించింది. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. రాజాంలో ఆకతాయిలు అధికంగా తిరగడం, వాహనాలను దగ్ధం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మద్యం సేవించడం, సంతమార్కెట్ ప్రాంతంలో విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండడం పట్టణ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవే కాకుండా రాజాంలో పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా, పోలీసు పరమైన చర్యలు ఎటువంటివి లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రాజాం పట్టణ ప్రాంతంలోనే కాకుండా బొబ్బిలి రోడ్డులోని తోటపల్లి కాలువ సమీపంలో, శ్రీకాకుళం రోడ్డులోని పొగిరి సమీపంలో, పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ ఐటీ సమీపంలో ఇటువంటి అసాంఘిక కార్యకాలాపాలు అధికంగా జరుగుతున్నాయని, మృతశిశువులను అధికంగా కాలువల్లో పడేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాజాం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఆ ఆస్పత్రి మృత్యు కుహరం..
♦ 40 ఏళ్లలో 25వేల మంది చిన్నారుల మృతి ♦ నేటికి కొనసాగుతున్న వైనం ♦ పాలకులు మారినా మారని తీరు ♦ వైద్యుల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శాపం గోరఖ్‌పూర్ అంటే మృతి చెందుతున్న పసిబిడ్డలు గుర్తుకు వస్తారు. ఒకరు..ఇద్దరు.. వందలు కాదు.. వేల సంఖ్యలో ఇక్కడ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1400 వరకూ ఉంది. అదే గత 40 ఏళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఎంతో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆగస్టు నెల్లో 60 మంది చిన్నారులు ఒక్కసారిగా మృతిచెందారు. ఈ ఘటనపై దేశమంతా స్పందించింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అప్పటినుంచే బీఆర్డీ ఆసుపత్రి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కానీ బీఆర్‌డీలో చిన్నారుల మృతి అనేది 40 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. సెప్టెంబర్ 1న కూడా..! పిల్లల మృతుల పరంపర బీఆర్‌డీలో నేటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. మొత్తం మృతులు బీఆర్డీ ఆసుపత్రిలో గడచిన 40 ఏళ్లలో 25 వేల మంది చిన్నారులు మృతి చెందారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన వారిలో అత్యధికులు మెదడు వాపుకు గురైనవారే. చర్యలేవీ? మెదడువాపు వ్యాధితో చిన్నారులు ఆసుపత్రిలో చేరడం సర్వసాధారణం. ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధి ప్రబలకుండా ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. అదే సమయంలో ఈ వ్యాధికి సంబంధించిన వైద్య సౌకర్యాలు కూడా ఇక్కడ పెద్దగా లేవు. తాజా పరిస్థితి ప్రస్తుతం బీఆర్డీ ఆసుపత్రిలో 344మంది చిన్నారులు మెదడు వాపు, న్యుమోనియా వంటి వ్యాధులతో చేరారు. వీరికి వీలైనంత మంచి వైద్యాన్ని అందిస్తున్నామని, గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆసుపత్రి డైరెక్టర్ రాజేష్ మణి చెబుతున్నారు. ధనార్జనలో డాక్టర్లు గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి అధికంగా ఉండడంతో గతంలో ఇక్కడ 100 వైద్య కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే డాక్టర్లలో ధనార్జన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు.. సర్కార్ దవాఖానాల్లో కాకుండా సొంత క్లినిక్‌లలో అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ వైద్య కేంద్రాలకు పంపే మందులు, ఇతర సామగ్రిని ఆ వైద్యులు తమ సొంత క్లినిక్స్‌కు తరలించడం ప్రధాన సమస్య.