హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్ప్రత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తెలిసింది. డాకర్టులు వేసిన ఇంజెక్షన్లు వికటించడం వల్లే తమ పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్లు వల్లే చిన్నారులు చనిపోయారని కన్నీరుమున్నీరవుతున్నారు.
దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారులను ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే వారి ఆరోగ్యం విషమించిందని తెలిపారు.
చనిపోయింది ఒకరే.. ఇద్దరు కాదు
నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయింది ఒక చిన్నారని, ఇద్దరు కాదని వెల్లడించారు. ఈ నెల 28న చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారని తెలిపారు. రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధితో ఆ చిన్నారి బాధ పడుతుందని అన్నారు. 7వ నెలలో పుట్టిన ఒక కేజీ బరువుతో ఉన్న ఆ చిన్నారి బుధవారం ఉదయం సుమారు 6గంటల సమయంలో మృతి చెందినట్లు చెప్పారు.
ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లోపల అవయవాలు ఎదుగుదల ఉండదని అన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచామని తెలిపారు. బాధలో ఉన్న తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తప్పిదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment