అరకొర వైద్యసేవలే! | so many problems face to govt hosptials | Sakshi
Sakshi News home page

అరకొర వైద్యసేవలే!

Published Sat, Nov 22 2014 2:28 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అరకొర వైద్యసేవలే! - Sakshi

అరకొర వైద్యసేవలే!

కంచికచర్ల పీహెచ్‌సీలో వసతుల లేమి
భర్తీకాని వైద్యసిబ్బంది పోస్టులు..పరుపుల్లేని మంచాలు
వైద్యశాలలో మంచినీటికి కటకటే
రోగుల అవస్థలు పట్టించుకోని పాలకులు

 
కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండీ ఉపయోగం లేనట్లుగా తయూరైంది. రూ.30లక్షలతో పీహెచ్‌సీకి నూతన భవనం నిర్మించిన పాలకులు..వైద్యశాలలో వసతుల కల్పన, వైద్యసిబ్బంది పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పూర్తిస్థారుులో వైద్య  సేవలు అందక మండల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
 
నూతనంగా నిర్మించిన కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ మెరుగైన వైద్యసేవలు అందక రోగులు అవస్థలుపడుతున్నారు. ఈ వైద్యశాలలో కనీస వసతులు లేకపోవడంతో అరకొర వైద్యసేవలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  గతంలో  పీహెచ్‌సీ పట్టణ నడిబొడ్డుగా ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోని ఓ క్వార్టర్‌లో ఉండగా,  వైద్యాధికారులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న మందులిచ్చి పంపించేవారు. అరుుతే వర్షాకాల సమయంలో నీరంతా గదుల్లోకి వచ్చి మందుల తడిచిపోతుండేవి. భవనం శిథిలావస్థకు చేరడంతో  వైద్యం చేసేందుకు వైద్యులు ఇబ్బందిపడుతున్న తరుణంలో గ్రామానికి కిలోమీటరు దూరంలో పంటపొలాల మధ్య దాతలు స్థలాన్ని కేటారుుంచడంతో నూతన పీహెచ్‌సీ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పీహెచ్‌సీకి నూతన భవనాలను నిర్మించిన పాలకులు, కనీసవ సతులు కల్పించడాన్ని మాత్రం విస్మరించారు. పీహెచ్‌సీ పనులు పూర్తికావడంతో  సెప్టెంబర్ నెలాఖరులో పీహెచ్‌సీని నూతన భవనంలోని మార్పు చేయగా..పట్టణానికి కిలోమీటరు దూరంలో అరకొర వసతులు ఉన్న ఈ వైద్యశాలకు వచ్చేందుకు రోగులకు అవస్థలు తప్పడం లేదు.
 
అధ్వానంగా ఉన్నరోడ్డు...

జాతీయ రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఈ ఆస్పత్రి భనవం ఉంది. అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు సైతం అధ్వానంగా ఉండటంతో ఉంది. గ్రావెల్ రోడ్డంతా గుంతలమయం కావడంతో వర్షాలు పడినపుడు నడిచేందుకు సైతం వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యశాలకు చేరుకునేందుకు రోగులు, వారి బంధువులు ఇబ్బందిపడుతున్నారు. చుట్టూ పంటపొలాల కారణంగా  విషజంతువులు సంచరిస్తుండటంతో వైద్యశాల సిబ్బంది సైతం భయంభయంగానే విధులు నిర్వరిస్తున్నారు
 
మంచినీరు కరువు..

వైద్యశాలలో మంచినీటి వసతి లేదు. తగిన వసతులు లేకపోవడంతో పీహెచ్‌సీలో కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది.దీంతో మండలానికి చెందిన గర్భిణులు కాన్పుల కోసం ఇతర మండలాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లు, అన్ని గదులకు విద్యుత్ సదుపాయం, స్టెరిలైజేషన్ వసతి లేకపోవడంతో ఈ వైద్యశాల నామమాత్రపు సేవలకే పరిమితమైంది.
 
ఆరోగ్య సిబ్బంది కొరత.....

పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉండగా, ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు ఇద్దరిని ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. దీంతో ప్రస్తుతం ఒక్క స్టాఫ్‌నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన విభాగాల సిబ్బంది కొరత కూడా ఉంది.
 
ఐదు పడకలే ఏర్పాటు..

పీహెచ్‌సీలో 25 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేసినట్లు  ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు చెబుతుండగా, వైద్యశాలలో కేవలం ఐదు బెడ్లుమాత్రమే దర్శనమిస్తున్నారుు.  వీటిపై పరుపులు కూడా లే కపోగా..ఆ మంచాలు సైతం తుప్పుపట్టి ఉన్నారుు. ఇలా నూతనంగా నిర్మించిన కంచికచర్ల పీహెచ్‌సీలో తగిన వసతులు లేకపోవడంతో సరైన వైద్యసేవలు అంద క రోగులు అవస్థలుపడుతున్నారు ఇకనైనా ఆరోగ్యశాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పీహెచ్‌సీలో మౌలికవసతులు కల్పించడంతోపాటు పూర్తిస్థారుులో సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement