స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి స్థానికంగా ఉండే టీకొట్టులో పనిచేస్తోంది. ఉండటానికి సరిగ్గా ఇళ్లు కూడా లేదు. డబ్బాలాంటి ఓ రేకుల షెడ్డులో ఈ కుటుంబం కాలం వెళ్లదిస్తోంది. తండ్రి కూడా ఐదేళ్లుగా ఆనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయం, తల్లి కష్టంతోనే ఇల్లు గడిచింది. దీనికి తోడు ఆమె శరీరాకృతి కూడా సమస్యగా మారింది. శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది.