ప్రేమించి పెళ్లిచేసుకొని.. మోసంచేశాడని ఆత్మహత్య | Young woman commits suicide cheating after love marriage | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లిచేసుకొని.. మోసంచేశాడని ఆత్మహత్య

Published Wed, Jun 17 2015 11:08 PM | Last Updated on Wed, Aug 1 2018 2:20 PM

ప్రేమించి పెళ్లిచేసుకొని.. మోసంచేశాడని ఆత్మహత్య - Sakshi

ప్రేమించి పెళ్లిచేసుకొని.. మోసంచేశాడని ఆత్మహత్య

నల్గొండ: ప్రేమించి పెళ్లిచేసుకొని కాపురానికి తీసుకెళ్లకుండా తనను మోసంచేశాడని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని గుండాల మండలం తేర్యాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వప్నలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆర్నేళ్లు కాపురం సజావుగా సాగాక ఆమెను సొంతూరుకు తీసుకెళ్లాడు.

ఆ తర్వాత నీతో సంబంధంలేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన స్వప్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె బంధువులు మృతదేహంతో శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement