సికింద్రాబాద్లో లారీ ఢీ కొని విద్యార్థిని దుర్మరణం
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పేరెడ్ గ్రౌండ్స్కు వెళ్తున్న విద్యార్థిని స్వప్నకు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికక్కడే మరణించింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సికింద్రాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో రైల్ నిలయం సమీపంలోని ఆర్ఆర్సీ గ్రౌండ్స్లో పేరెడ్ రిహారల్స్ జరుగుతున్నాయి. ఆ పేరెడ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా స్వప్న మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్సీసీ క్యాడెట్ అని పోలీసులు చెప్పారు.