rail nilayam
-
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
రైల్‌నిలయంలో వీడియో సర్వైలెన్స్ కంట్రోల్ రూమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు, పరిపాలనా కార్యకలాపాలను ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా చూస్తూ పర్యవేక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీసీ కెమెరాల ద్వారా ఆయా స్టేషన్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వైలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ విధానంలో ఉన్నతాధికారులు రైల్ నిలయం నుంచి చూస్తూ ఆయా స్టేషన్లలో అధికారు లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి వీలుంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన రైల్వే స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, బేగంపేట, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్ స్టేషన్లు, ఏపీ లోని గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగో లు, రాజమండ్రి, తుని, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల్నా, నాగర్సోల్, పర్లివైద్యనాథ్ స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతోపాటు ఆయా స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్ సీసీకెమెరాల స్థానంలో ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీఎస్ఎస్ విధానం ఏర్పాటు చేశారు. రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో దీన్ని అనుసంధానించారు. మొత్తం 520 సీసీ కెమెరాలతో అనుసంధాన అయ్యిందని జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఆయా స్టేషన్లలో మనుషుల ముఖ కవళికలను స్పష్టంగా గుర్తించేందుకుగాను 4కే రెషల్యూషన్ అల్ట్రా హెచ్డీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చదవండి: డిజిలాకర్: ఆధార్‌ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు! యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
రైలు నిలయం రెండు రోజులు మూసివేత
సాక్షి, హైదరాబాద్ : దేశీయ రవాణా వ్యవస్థలను కరోనా మహమ్మారి సంక్షోభంలోకి నెట్టేసింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపు తరువాత పాక్షికంగా సేవలందిస్తున్నరైల్వే శాఖలోను కరోనా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా తెలంగాణాలోని సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కేంద్రం రైలు నిలయంలో మహమ్మారి మరోసారి పంజా విసిరింది. దాదాపు 30మంది ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు నిలయాన్ని రెండు రోజులు పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రోటోకాల్ ప్రకారం శానిటైజేషన్ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికి 1,57,096 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 961 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 92,071 మంది వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులసంఖ్య 48,46,427కు చేరగా మరణాల సంఖ్య 79,722 గా ఉంది. -
రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 12.30-1.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందుగా స్క్రాప్ రూంలో మంటలు వచ్చాయని సిబ్బంది అంటున్నారు. ఈ మంటలను గమనించగానే ఉద్యోగులు ముందుగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే గది మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ గదిలో స్క్రాప్ పేపర్లు, ఆయిల్‌కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి.. అవన్నీ కాలిపోయాయి. రైల్ నిలయంలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారు. ప్రమాదం విషయం తెలియగానే వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి, బయటకు పరుగులు తీశారు. ఏ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనా.. మరేదైనా కారణం ఉందా అని చూస్తున్నారు. మరికొన్నిచోట్లకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన సికింద్రాబాద్‌లో ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. -
రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు
-
రైల్వేలో సమ్మె సైరన్
కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సమ్మె నోటీసును సికింద్రాబాద్ రైల్ నిలయంలోని దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీందర్‌కు కార్మిక నేతలు గురువారం సమ్మె నోటీసును అందజేశారు. రైల్వే కార్మిక సంఘం నేత రాఘవయ్య నేతృత్వంలో సికింద్రాబాద్ నుంచి భారీ ర్యాలీతో వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. కొత్త పెన్షన్ విధానం, బిబేక్ దెబ్రయ్ కమిటీ రద్దుతోపాటు, ఖాళీ ఉద్యోగా లభర్తీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మెనోటీసు ఇచ్చిన రాఘవయ్య తెలిపారు. జులై 11లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
టిప్పర్ బీభత్సం.. NCC విద్యార్థిని మృతి!
-
సికింద్రాబాద్‌లో లారీ ఢీ కొని విద్యార్థిని దుర్మరణం
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పేరెడ్ గ్రౌండ్స్‌కు వెళ్తున్న విద్యార్థిని స్వప్నకు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికక్కడే మరణించింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సికింద్రాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో రైల్ నిలయం సమీపంలోని ఆర్ఆర్సీ గ్రౌండ్స్‌లో పేరెడ్ రిహారల్స్ జరుగుతున్నాయి. ఆ పేరెడ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా స్వప్న మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్సీసీ క్యాడెట్ అని పోలీసులు చెప్పారు.