
సాక్షి, హైదరాబాద్ : దేశీయ రవాణా వ్యవస్థలను కరోనా మహమ్మారి సంక్షోభంలోకి నెట్టేసింది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత పాక్షికంగా సేవలందిస్తున్నరైల్వే శాఖలోను కరోనా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా తెలంగాణాలోని సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కేంద్రం రైలు నిలయంలో మహమ్మారి మరోసారి పంజా విసిరింది. దాదాపు 30మంది ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు నిలయాన్ని రెండు రోజులు పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రోటోకాల్ ప్రకారం శానిటైజేషన్ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికి 1,57,096 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 961 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 92,071 మంది వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులసంఖ్య 48,46,427కు చేరగా మరణాల సంఖ్య 79,722 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment