లారీ ఢీకొని ముగ్గురు విద్యార్థులకు గాయాలు | 3 students injured in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ముగ్గురు విద్యార్థులకు గాయాలు

Published Tue, Nov 8 2016 3:21 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

3 students injured in road accident

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మెహిఫిల్ హోటల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఆరో తరగతి చదివే ముగ్గురు విద్యార్థులను వేగంగా వచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు బాలుర కాళ్లు విరగ్గా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement