- మృతులు చీరాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు
- ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే
లారీ కిందపడి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
Published Mon, Oct 31 2016 11:14 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
చీరాల/కర్లపాలెం : మృత్యురూపంలో వచ్చిన లారీ ఇద్దరు విద్యార్థులను బలితీసుకుంది. మరో గంటలో ఇంటికి చేరాల్సిన విద్యార్థులు విగతజీవులయ్యారు. వివరాలు.. ప్రకాశం జిల్లా చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న గుంటూరు జిల్లా కర్లపాలెం చెందిన యాజలి రాజేష్ ( 21), పొన్నూరుకు చెందిన షేక్ నితిన్ షరీఫ్ (21)లు సోమవారం కళాశాల వదిలిన తర్వాత బైకుపై స్వగ్రామాలకు బయల్దేరారు. కొత్తపేట బజాజ్ షోరూమ్ సమీపంలో బైపాస్‌లో లారీని ఢీకొట్టి ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాజేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా నితిన్ షరీఫ్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తపేట నుంచి వడ్డే సంఘం వైపునకు ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. బైపాస్‌పై వాహనాలు వస్తుండటంతో అమె ఆగింది. ద్విచక్ర వాహనం ఆపే క్రమంలో అదుపుతప్పి ఆమె వాహనం కిందపడిపోయింది. ఆమె ముందు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి చూస్తూ బైకు నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కిందపడి దుర్మరణం చెందారు. అప్పటి వరకూ తమతోనే ఉన్న మిత్రులు కొద్దిసేపటికే విగజీవులవ్వడంతో కళాశాల విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఉద్యోగానికి వెళ్తాడనుకుంటే..అనంతలోకాలకు...
కర్లపాలెం గ్రామానికి చెందిన యాజలి శ్రీనివాసరావు, భారతీదేవిలకు ఇద్దరు సంతానం కాగా, వారిలో రాజేష్ పెద్దవాడు. ఇంటికి పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజేష్‌కు హైదరాబాద్‌లోని ప్రై వేట్ కంపెనీలో నెలకు రూ.40 వేలకు ఉద్యోగం కూడా వచ్చిందని, ఫైనల్‌ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరతాడని ఆశించిన తల్లిదండ్రులకు మతి వార్త తెలియడంతో సొమ్మసిల్లిపడిపోయారు.
Advertisement
Advertisement