మాతృత్వపు ఔన్నత్యం | actress Swapna playing lead role in this movie 'amma neeku vandanam' | Sakshi
Sakshi News home page

మాతృత్వపు ఔన్నత్యం

Published Tue, Aug 6 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

మాతృత్వపు ఔన్నత్యం

మాతృత్వపు ఔన్నత్యం

నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకునిగా మారి తీసిన తొలి చిత్రం ‘అమ్మా! నీకు వందనం’. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఎవరెన్ని విధాలుగా చూపించినా అమ్మలోని గొప్పతనాన్ని ఎవ్వరూ సంపూర్ణంగా ఆవిష్కరించలేరు. 
 
 అమ్మ గొప్పతనాన్ని, మాతృత్వపు ఔన్నత్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తీశాం. గర్భశోకం కన్నా గర్భకోశం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానం ఇది. జాతీయ స్థాయిలో పురస్కారాలు గెలుచుకునే సత్తా ఉన్న కాన్సెప్ట్ ఇది. కెమెరామేన్ కోట తిరుపతిరెడ్డి నాకు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంతా కథానాయిక స్వప్నే. అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement