
కులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి కర్కశత్వం
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తండ్రే దారుణంగా చంపాడు. తుంగతుర్తి మండలం గానుగుబండతండాలో ఈ సంఘటన జరిగింది. స్వప్న అనే అమ్మాయిని ఆమె తండ్రి గొడ్డలితో నరికి హతమార్చాడు.
స్వప్న వివాహం మూడు వారాల క్రితం జరిగినట్టు సమాచారం. కుమార్తె ఇంటికి రాగా తండ్రి ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.