రోడ్డు దాటుతున్న తల్లి, కూతురును లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడింది. తాండూరు శివారులోని పాలిషింగ్ యూనిట్‌లో పనిచేసే సునీత(30), ఆమె కూతురు స్వప్న(5) గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో స్వప్న అక్కడికక్కడే చనిపోగా సునీత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని తాండూరు ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు కారణమైన లారీని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
Published Thu, Jan 21 2016 12:35 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement