ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్‌లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.
శబరి నిర్మాతకు అవార్డ్
టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment