Telugu Book of Records
-
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్‌లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
ఇష్టాన్నే ఉపాధిగా మార్చుకున్న గృహిణి.. ఆదాయంతో పాటు అవార్డులు కూడా
ఇష్టంగా నేర్చుకోవాలే కానీ మట్టి కూడా పాఠాలు నేర్పుతుంది. కొత్త ఆవిష్కరణలతో పాటు ఉపాధికీ బాటలు వేస్తుంది. హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో ఉంటున్న సంగిశెట్టి సంగీత తన కళ ద్వారా ఈ విషయాన్ని మనందరికీ చాటుతోంది. సరదాగా నేర్చుకున్న కళ ద్వారా ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ‘‘కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్.. ఆర్టిస్ట్‌గా నాకు నేను గుర్తింపు సంపాదించుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. నేటి రోజులకు తగినట్టు స్టాచ్యూ, త్రీడీ ఎఫెక్ట్స్, క్యూబిజమ్, జపనీస్ ఆర్ట్, మల్టీపర్పస్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారుచేస్తుంటాను. ఇవన్నీ మట్టితో రూపొందించేవే. ఎకో, పాటరీ క్లే, పాలిమర్ క్లే, మోడలింగ్ క్లేతో కళారూపాల రూపకల్పన ఉంటుంది. ఇవి ఎప్పటికీ పాడవవు. నీటిలో కరగవు, కిందపడినా పగిలిపోవు. ఇల్లు, ఆఫీసులలో అలంకరణ వస్తువులుగా క్లే ఆర్ట్ కళాకృతులను ఎక్కువ వినియోగిస్తుంటారు. డిజైన్ బట్టి ధర ఉంటుంది. రెయిజన్ మెటీరియల్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, షాడో బాక్స్‌లు.. పెళ్లి, పుట్టిన రోజులు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆర్డర్స్‌ని బట్టి డిజైన్స్ చేస్తుంటాను. పెన్సిల్, చార్కోల్, మ్యూరల్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా నా రోజు వారి వర్క్‌లో భాగమే. వర్క్‌షాప్స్ ఎం.కామ్. వరకు చదువుకున్నాను. పెళ్లి, పిల్లలు జీవితంలో ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకొని, హాబీకే టైమ్ కేటాయించాను. ఇదే ఉపాధిగా మారుతుందని ముందు అనుకోలేదు. కానీ, ఇష్టమైన పనే ఆదాయమార్గాన్ని కూడా చూపిస్తుందని వచ్చిన ఆర్డర్స్ ద్వారా అర్థమైంది. ‘డూడుల్ బగ్స్ పేరుతో ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశాను. ఆన్లైన్ ద్వారా అమెరికా, కెనడాలోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు గృహిణులు గ్రూపుగా ఏర్పడి తమకు ఈ క్లే ఆర్ట్ నేర్పించమని అడుగుతారు. ఐదారుగురు గ్రూప్‌గా ఉన్నా వారి కోసం వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను. ఇప్పటికి వందల సంఖ్యలో మహిళలు శిక్షణ తీసుకున్నవారున్నారు. ప్రతిరోజూ సాయంకాలాలు క్లే ఆర్ట్ ట్రెయినింగ్ క్లాసులు తీసుకుంటాను. వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు ఇస్తుంటాను. రికార్డులు తెచ్చిన ఆర్ట్ రెండేళ్ళ క్రితం పిస్తా పొట్టుపై చేసిన మైక్రో క్లే ఆర్ట్ మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. పండ్లు, కూరగాయలు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు 150 కంటే ఎక్కువ రకాలు పిస్తాపొట్టుపై 74 గంటలలో చేసి చూపించాను. ఈ సూక్ష్మ కళా నైపుణ్యాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు వచ్చేలా చేసింది. వర్చువల్ అవార్డులూ వరించాయి. సాధనమున.. ఆసక్తి ఉండి, ఫీజు చెల్లించలేం అనుకునేవారికి మెటీరియల్ ఇచ్చి మరీ ఈ వర్క్స్ నేర్పిస్తుంటాను. ఏ కళ అయినా సాధన చేస్తూ ఉంటే కొత్త కొత్త నైపుణ్యాలు వచ్చి చేరుతాయి. అవే ఉపాధికి మార్గం చూపుతాయి. అందుకే, వర్క్ నేర్చుకున్నవాళ్లను మోటివేట్ చేస్తూ, తమను తాము బిల్డ్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తుంటాను. నాకు ఇష్టమైన పని కావడంతో మరింత కొత్తదనం కోసం సాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కళారంగంలో ఇష్టమే పెట్టుబడి అవుతుంది’’ అని వివరిస్తుంది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
24 గంటలపాటు ప్రసంగం
విద్యారణ్యపురి: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రియాంక సుంకురుశెట్టి. 24 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రియాంక హనుమకొండ నక్కలగుట్టలోని ఆస్పైర్ క్లినీ అకాడమీలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి సోమవారం ఉదయం 9:30 గంటల వరకు 24 గంటపాటు ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్’పేరుతో మారథాన్ లెక్చర్ ఇచ్చారు. ప్రతిగంటకు 5 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. క్లినిక్ రీసెర్చ్ అండ్ క్లినిక్ డేటా మేనేజ్మెంట్ తదితర అంశాలపై 24 గంటల పాటు ఆమె ప్రసంగించారు. తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్‌కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమకొండ వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు
బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్ పురందాస్ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
వండర్‌బుక్‌లో మణిపూసలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్బుక్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజిలప్పకు సన్మానం... బొంరాస్‌పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు. -
తెలుగు పద్యాలను అలవోకగా చెప్తున్న చిన్నారి
-
రికార్డుకెక్కిన చెస్‌బోర్డు!
కాచిగూడ: నారాయణగూడలోని హెచ్ఆర్డీ కళాశాల ఎమ్మెస్సీ విద్యార్థి ముస్లోజు సాయికిరణ్ తయారు చేసిన సూక్ష్మ చెస్‌బోర్డుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 3 సెంటీమీటర్ల చెస్‌బోర్డుతో పాటు బోనం ఆకృతి, అమరవీరుల స్థూపం, వరల్డ్ కప్ నమూనా, 0.3 మిల్లీగ్రాముల బంగారంతో చేసిన ఈగ, పెన్సిల్ మొనపై జాతీయ జెండా, బియ్యం గింజపై జాతీయ జెండా సూక్ష్మ వస్తువులను తయారు చేశాడు. సోమవారం హెచ్ఆర్డీ కళాశాలలో ప్రదర్శించాడు. కళాశాల వైస్ ప్రెసిడెంట్æపి.అనురాధ, ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి అభినందించారు. -
తనువు నర్తించగ.. హృదయం ఉప్పొంగగ..
-
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘దాసరి’
లాలాపేట (హైదరాబాద్‌సిటీ): ప్రముఖ దర్శకులు, నిర్మాత దాసరి నారాయణరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తెలిపారు. ఇటీవల జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో నమోదు పత్రాన్ని అందజేశామన్నారు. గురువారం లాలాపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వెంకటాచారి ఈ మేరకు వెల్లడించారు. -
ఐఏఎస్ అవ్వాలమ్మా!
బాల మేధావి శ్రీజకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఖమ్మం కల్చరల్: నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కితే ఆనందమే.. అదే సీఎం నుంచి ప్రశంసలు పొందితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఖమ్మం పట్టణానికి చెందిన బాల మేధావి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన వేల్పుల శ్రీజను ఈ అవకాశం వరించింది. ప్లీనరీ కోసం మంగళవారం రాత్రే ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్... గతంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీజ ఇంటికి వెళ్లారు. బ్లాక్‌టీ తాగి, 18 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రాజకీయ ప్రస్థానం గురించి శ్రీజ గడగడా చెప్పేయడంతో... సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, తుమ్మల ఆశ్చర్యపోయారు. శ్రీజను బాలమేధావిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కేసీఆర్ అభినందించారు. ‘ఐఏఎస్ కావాలి.. నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధించాలి..’ అని ఆశీర్వదించారు. శ్రీజను హైదరాబాద్‌లోని మంచి పాఠశాలలో చేర్పించేలా చూడాలని ఎంపీ కవితకు సూచించారు. ఇక ప్లీనరీలో శ్రీజకు అవకాశమిస్తే టీఆర్ఎస్ ఆవిర్భావ ఉద్దేశాన్ని రెండు నిమిషాల్లో చెప్పేస్తుందని ఆమె తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌ను కోరగా.. ఆయన సరేనని చెప్పారు. -
భద్రాద్రిలో నృత్యనీరాజనం
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆది వారం నిర్వహించిన భక్త రామదాసు కీర్తనల నృత్యాభిషేకం అలరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తరలివచ్చారు. ఉత్తర ద్వారం ముందు ఒకేసారి వేయి మంది చిన్నారుల రామదాసు కీర్తనలకు లయబద్ధంగా నాట్యం చేశారు. భద్రాద్రి నృత్యాభిషేకానికి తెలుగు బుక్ ఆఫ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు సంస్థల వారు గుర్తింపు ఇచ్చారు. ఈ మేరకు నిర్వాహకులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటాచారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సాయంత్రం గోదావరి తీరంలో విశ్వశాంతియాగం, గోమాతకు పూజలు, గోదావరి నదికి హారతి ఇచ్చారు. వేడుకలో స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు రాజయ్య, టి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పొంగులేటి పాల్గొన్నారు. నృత్యాభిషేకానికి వచ్చి: నృత్యాభిషేకంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి భద్రాచ లానికి కారులో వచ్చిన పేరం తనూజ(33) దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. -
4 గంటల పాటు ఏకధాటిగా నృత్యం..
కొణిజర్ల: ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన తూము సాయి స్నేహిత కూచిపూడి నృత్యంలో కొత్త రికార్డును సృష్టించింది. స్థానికంగా ఏడో తరగతి చదువుతున్న పదకొండేళ్ల విద్యార్థిని 4 గంటల 8 నిమిషాల 4 సెకండ్లపాటు ఏకధాటిగా నృత్యం చేసి.. విజయవాడకు చెందిన ఎం.చంద్రిక రికార్డును తిరగరాసింది. కొణిజర్ల మండలం తనికెళ్లలోని లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన నృత్య ప్రదర్శనను వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏ.ప్రసాద్, జీనియస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏఆర్.స్వామి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తిలకించి.. రికార్డులు నమోదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత బాలికకు రికార్డును ప్రదానం చేశారు. స్నేహిత, ఆమె గురువు కొండలరావును సన్మానించారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’
జిన్నూరు (పోడూరు) : స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘నైమిశ వేంకటేశ శతకం’లోని 108 పద్యాలను 1,850 మంది ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేసిన శతకధారణ కార్యక్రమం ద్వారా తమ విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. గుంటూరు సం పత్‌నగర్‌లోని శారదా పరమేశ్వరి ఆలయం లో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 1,850 మందిలో తమ విద్యార్థులు కలిగొట్ల మేఘన, యాండ్ర తేజస్వి, పెన్మెత్స రేణుక, బొర్రా మౌనిక, గోపరాజు కృష్ణలహరి, మల్లుల భావన, ఎస్.వెన్నెల, రావూరి నవ్యశ్రీ, సిరిమల్ల లక్ష్మీప్రియ, నుదురుపాటి సుబ్రహ్మణ్యం, సిరిమల్ల మణికంఠ కార్తీక్, ఎస్.శ్రీకార్తికేయ, మామడిశెట్టి బేబీ శ్రీ మంజు, కె.సాయిశ్రీ పవన్ ఉన్నారని చెప్పారు. వీరిని, శిక్షణనిచ్చిన టీచర్ మణిని అభినందించారు. -
భరత్@ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
విజయనగరం టౌన్: మల్టీ టాలెంట్ స్కిల్స్‌తో అదరగొడుతూ వండర్ వరల్డ్‌లో చోటు సంపాదించుకున్న చిన్నా రి భరత్‌కు ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి కోసం ఏర్పాటు చేసిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్న వయసులోనే చోటు సంపాదించిన ఘనత భరత్‌కే దక్కిందని తల్లిదండ్రులు తెలిపారు. పట్టణంలోని గాజులరేగ బీటీఆర్ కాలనీలో నివాసముంటున్న కోరాడ భరత్ చంద్ర మూడేళ్ల ప్రాయం నుంచి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తితో ప్రముఖ వ్యక్తులు, నక్ష త్రా లు, ప్రపంచ వింతలు వంటి వాటిని గుర్తుంచుకుని రికార్డులు సాధిస్తున్నాడు. తల్లిదండ్రులు రమణా, హేమలతలు ప్రత్యేక దృష్టి సారించి ఈ బుడతడిని ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఈ పిడుగు గాజులరేగలో ఉన్న శారదా విద్యాపీఠ్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్ ప్రతినిధులు గంట న్నర సేపు ఆన్లైన్లో ఇం టర్వ్యూ చేసి, సమాధానాలకు మెచ్చుకుని ప్రశంసాపత్రం, మెడల్, అవార్డు అందజేశారన్నారు. అ వార్డు రావడంపై పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.