
భద్రాద్రిలో నృత్యనీరాజనం
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆది వారం నిర్వహించిన భక్త రామదాసు కీర్తనల నృత్యాభిషేకం అలరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తరలివచ్చారు. ఉత్తర ద్వారం ముందు ఒకేసారి వేయి మంది చిన్నారుల రామదాసు కీర్తనలకు లయబద్ధంగా నాట్యం చేశారు. భద్రాద్రి నృత్యాభిషేకానికి తెలుగు బుక్ ఆఫ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు సంస్థల వారు గుర్తింపు ఇచ్చారు. ఈ మేరకు నిర్వాహకులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటాచారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సాయంత్రం గోదావరి తీరంలో విశ్వశాంతియాగం, గోమాతకు పూజలు, గోదావరి నదికి హారతి ఇచ్చారు. వేడుకలో స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు రాజయ్య, టి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పొంగులేటి పాల్గొన్నారు.
నృత్యాభిషేకానికి వచ్చి: నృత్యాభిషేకంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి భద్రాచ లానికి కారులో వచ్చిన పేరం తనూజ(33) దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.