
తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్‌ను ప్రియాంక సుంకురుశెట్టికి అందజేస్తున్న జ్యూరీ సభ్యుడు అశోక్‌కుమార్, తదితరులు
విద్యారణ్యపురి: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రియాంక సుంకురుశెట్టి. 24 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రియాంక హనుమకొండ నక్కలగుట్టలోని ఆస్పైర్ క్లినీ అకాడమీలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి సోమవారం ఉదయం 9:30 గంటల వరకు 24 గంటపాటు ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్’పేరుతో మారథాన్ లెక్చర్ ఇచ్చారు.
ప్రతిగంటకు 5 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. క్లినిక్ రీసెర్చ్ అండ్ క్లినిక్ డేటా మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై 24 గంటల పాటు ఆమె ప్రసంగించారు. తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్‌కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమకొండ వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment