టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వేకేషన్ ట్రిప్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.
అయితే తాజాగా ఓ టీవీ షో మెరిశారు అనసూయ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఏంటి నాన్‌సెన్స్ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్(బాధితురాలిగా) కార్డ్ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది. అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది. కాగా.. టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్ షర్ట్ విప్పుతూ కనిపించారు. దీనిపై నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.
ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ..'నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి. ఎలా ఉండే షో ఎలా అవుతుందో.. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి. కానీ బ్యాడ్ వైపు వెళ్తుంది. ఒక నటిగా మీరంటే ఇష్టమే..ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది' అని కామెంట్ చేశాడు. దీనిపై కూడా అనసూయ స్పందించింది.
అనసూయ రిప్లై ఇస్తూ..'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.. పెద్ దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్‌బస్టర్ చేస్తారు.. అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్ ఇస్తారు. ఇది కేవలం ప్రోమో. స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది. అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్‌కే పరిమితం. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది.
Neeku nijangaa ardam kaatledaa andi
Elaa unde show elaa aithunnaai andulo mee paatra good lo undaali gaani bad ki velthundi andi
We really love you as a actor but ilaanti programs lo alaantivi cheyyakunte me better andi— Santosh (@Santosh54493715) June 23, 2024
As someone belonging to the entertainment industry we explore certain things with the changing times and tastes of the audiences.. aina mee pratapam anta chinna tera ke parimitama andi.. pedda tera meeda yenno abhyantaramainavi ostunna meeru blockbusters chestaru.. also show anta…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment