ఘట్‌కేసర్, న్యూస్‌లైన్ : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలంలోని పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్నకు ఇదే జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న ఇచ్చి వివాహం చేశారు. ఈ సందర్భంగా స్వప్న తల్లిదండ్రులు కట్నకానుకల కింద వెంకన్నకు ఐదు తులాల బంగారం, *3.50 లక్షల నగదు, *50వేల విలువ చేసే ఇంటి సామగ్రి, ఫ్యాషన్‌ప్లస్ బై క్‌ను ఇచ్చారు. అయితే ఉపాధి పనుల కోసం వెంకన్న, స్వప్న దంపతులు ఆరునెలల క్రితం ఘట్‌కేసర్ మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు.
ఈ సందర్భంగా వెంకన్న స్థానిక ఐటీసీ కంపెనీలో హమా లీగా చేరాడు. అయితే కొద్దిరోజుల నుంచి వెంకన్న తనకు *50వేలు అదనపు కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతం సాయంత్రం 5 గంటలకు వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగాఆమె స్పందించలేదు. అనుమానం చెందిన వెం కన్న ఇంటికి వచ్చి చూసే సరికి స్వప్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. దీంతో వెంకన్న కాలనీవాసుల సాయంతో స్వప్నను కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వప్న అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిం చారు. కాగా, మల్కాజ్‌గిరి ఏసీపీ చిన్నయ్య కూ డా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన స్వప్న ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు. అల్లుడు వెంకన్న అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతోనే తమ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
Published Thu, Dec 12 2013 3:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement