
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగిపై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి కాలువలో పడేశాడు. రాజేష్ పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. కారు ఫైనాన్స్ వసూలు చేయడానికి వేళ్లిన వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్‌పై జ్యూయలరీ షాప్ యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్యాయత్నం కింద జ్యూయలరీ షాప్ యజమాని మీద కేసు నమోదు చేశారు. పారారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (కాల్ డాటా ఆధారంగానే రవీంద్ర అరెస్టు: ఎస్పీ)
Comments
Please login to add a commentAdd a comment