Jewellery shop owner
-
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
ఫైనాన్స్ ఉద్యోగిపై కత్తితో దాడి
-
మచిలీపట్నంలో మరో దారుణం
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగిపై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి కాలువలో పడేశాడు. రాజేష్ పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. కారు ఫైనాన్స్ వసూలు చేయడానికి వేళ్లిన వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్‌పై జ్యూయలరీ షాప్ యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్యాయత్నం కింద జ్యూయలరీ షాప్ యజమాని మీద కేసు నమోదు చేశారు. పారారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (కాల్ డాటా ఆధారంగానే రవీంద్ర అరెస్టు: ఎస్పీ) -
ఆ డీసీటీవోకు లంచాల దాహం
జ్యూయలరీ షాపు యజమాని నుంచి లంచం డిమాండ్ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి, ఇంట్లో సోదాలు ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు విశాఖపట్నం : ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. జ్యూయలరీ షాప్ యజమాని శ్రీనివాసరావు నుంచి రూ.లక్షా 50 వేల లంచం తీసుకుంటుండగా ఉప వాణిజ్య పన్నుల అధికారి కమలారావును సోమవారం ఉద యం పట్టుకున్నారు. లంచం కేసే కాకుండా కమలారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతనికి ఐవోబీలో రెండు లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. లాకర్లు తెరిస్తేనే అతడి ఆస్తులు విలువ తేలుతుందని అధికారులు భావిస్తున్నారు. వాటిని తెరవడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు రోజుల కిందటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన డి ప్యూటీ తహశీల్దారు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.పది కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేశారు. రూ.లక్షా 50 వేల డిమాండ్: వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్-2 పరిధి వన్‌టౌన్‌లో శ్రీనివాస్ జ్యూయలరీ షాప్‌ను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ సర్కిల్ కార్యాలయం ఉప వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తున్న పి.కమలారావు ఫిబ్రవరిలో శ్రీనివాస జ్యూయలరీ షాప్‌పై దాడులు చేశారు. అప్పటి నుంచి ఎసెస్మెంట్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అవి ఇవ్వాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని జ్యూయలరీ షాప్ యజమాని తెలపగా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొత్తం సోమవారం ఉదయం అప్పుఘర్ కైలాసగిరి రోప్‌వే వద్ద ఉన్న తన నివాసానికి తీసుకురావాలని శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు నగదు తీసుకుని కమలారావు ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కమలారావును పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి అతడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. స్థలాలు, నగదు, బంగారంతోపాటు బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. కమలారావుపై ఆరోపణలు: సహ వాణిజ్య పన్నుల అధికారిగా ఉన్నప్పటి నుంచి కమలారావుపై ఆరోపణలున్నాయి. షెక్పాయింట్ వద్ద విధులు నిర్వహించినప్పుడు లారీల యజమానుల వద్ద లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. లారీలు నిలిపి సోదాలు చేసిన విషయంలో ఓ పంజాబ్ లారీ డ్రైవర్ కమలారావును కొట్టి రూమ్‌లో బంధించడం అప్పట్లో రాద్దాంతమైంది. సిరిపురం డివిజన్ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహించినప్పుడు మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.