సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన నల్లజర్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లజర్ల మండలం జగన్నాధపురానికి చెందిన రాంబాబు(50) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కుమారుడు అచ్చారావుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ కుమారుడు బుధవారం కన్నుమూశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి : పబ్‌జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..
Comments
Please login to add a commentAdd a comment