
పంజా నాగేంద్ర
వీరవాసరం: మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు..
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.రమేష్ తెలిపారు.
చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
Comments
Please login to add a commentAdd a comment