విజయవాడ : కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడుతో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య, మామను భర్త గొడ్డలిలో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన అత్త, బావమరిదిపైనా అతడు దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారైయ్యాడు.
స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ఘటన స్థలాన్ని నూజివీడు, తిరువూరు డీఎస్పీలు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.