తీవ్రంగా గాయపడిన మహిళా హోంగార్డ్ తుమరాడ జ్యోతి
పశ్చిమగోదావరి, భీమడోలు: మహిళా హోంగార్డుపై ఆమె తండ్రి గొడ్డలి దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంగళవారం జరిగింది. మహిళా హోంగార్డ్ కుడివైపు మెడపై గొడ్డలితో నరికిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే త్రుటిలో ప్రాణాప్రాయస్థితి నుంచి తప్పించుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలుకు చెందిన తుమరాడ జ్యోతి నాలుగేళ్లుగా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పని చే స్తోంది. ఈమె భర్త హోంగార్డ్‌గా పని చేస్తూ చనిపోవడం వల్ల కారుణ్య నియామకాల్లో ఈ మెకు ఉద్యోగం వచ్చింది. జ్యోతికి ఒక పాప,బాబు ఉన్నారు. పిల్లలతో తండ్రి చీర రామకృష్ణ ఇంట్లోనే నివాసముంటోంది. తండ్రి చీర రామకృష్ణ నిత్యం మద్యం సేవించి అప్పులు చేస్తున్నాడు.
ఆ అప్పులు తీర్చాలని జ్యో తిపై రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పలుమార్లు తండ్రిని జ్యోతి మందలించింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అదే గ్రామంలో వేరుగా పిల్లలతో నివాసముంటోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ నుంచి భోజనానికి జ్యోతి ఇంటి కి వచ్చింది. ఈ సమయంలో అక్కడకు వచ్చి న తండ్రి రామకృష్ణ జ్యోతితో ఘర్షణ పడ్డాడు. ఒక్కసారిగా ఆగ్రహించి తన వద్ద ఉన్న గొడ్డలితో జ్యోతి మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment