women home guard
-
అధికారుల వేధింపులతో మహిళా హోంగార్డు మనస్తాపం
అనంతపురం సెంట్రల్: ఏఆర్ విభాగంలో అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఓ మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమవుతోంది. బాధితురాలి కథనం మేరకు... నగరంలో మూడవ పట్టణపోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హోంగార్డు (పేరు రాయవద్దని బాధితురాలి విజ్ఞప్తి మేరకు) మంగళవారం ఏఆర్ అధికారుల తీరును వివరించింది. తనకు ఆరోగ్యం బాగలేదని, చిన్న పిల్లాడు కూడా ఉన్నాడని మొరపెట్టుకుంటున్నా పెడచెవిన పెడుతూ ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నారని వాపోయింది. ఎవరినీ బదిలీ చేయకుండా తనను మాత్రమే బదిలీ చేశారని, చిన్న పిల్లాడిని వదిలి ఎక్కడికి పోవాలని విలపించింది. ఆర్ఐ పెద్దయ్య, హోంగార్డు ఇన్చార్జ్ ఇక్బాల్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విషపుద్రావకం తీసుకొచ్చింది. స్థానిక ఉద్యోగులు ఆమెకు సర్ది చెప్పి పంపారు. ఈ విషయంపై ఏఆర్ డీఎస్పీ మురళీధర్‌ను వివరణ కోరగా సులభతరమైన విధులకు బదిలీ చేసినా పోనని చెప్పడం ఏమటని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని, పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సిబ్బంది సహకరించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా చేయరాదని సూచించారు. -
మహిళా హోంగార్డ్‌పై గొడ్డలితో తండ్రి దాడి
పశ్చిమగోదావరి, భీమడోలు: మహిళా హోంగార్డుపై ఆమె తండ్రి గొడ్డలి దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంగళవారం జరిగింది. మహిళా హోంగార్డ్ కుడివైపు మెడపై గొడ్డలితో నరికిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే త్రుటిలో ప్రాణాప్రాయస్థితి నుంచి తప్పించుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలుకు చెందిన తుమరాడ జ్యోతి నాలుగేళ్లుగా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పని చే స్తోంది. ఈమె భర్త హోంగార్డ్‌గా పని చేస్తూ చనిపోవడం వల్ల కారుణ్య నియామకాల్లో ఈ మెకు ఉద్యోగం వచ్చింది. జ్యోతికి ఒక పాప,బాబు ఉన్నారు. పిల్లలతో తండ్రి చీర రామకృష్ణ ఇంట్లోనే నివాసముంటోంది. తండ్రి చీర రామకృష్ణ నిత్యం మద్యం సేవించి అప్పులు చేస్తున్నాడు. ఆ అప్పులు తీర్చాలని జ్యో తిపై రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పలుమార్లు తండ్రిని జ్యోతి మందలించింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అదే గ్రామంలో వేరుగా పిల్లలతో నివాసముంటోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ నుంచి భోజనానికి జ్యోతి ఇంటి కి వచ్చింది. ఈ సమయంలో అక్కడకు వచ్చి న తండ్రి రామకృష్ణ జ్యోతితో ఘర్షణ పడ్డాడు. ఒక్కసారిగా ఆగ్రహించి తన వద్ద ఉన్న గొడ్డలితో జ్యోతి మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, గద్వాల : మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్ష్ వేటు పడింది. ఏఆర్ ఏఎస్ఐ హసన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్ఐ హసన్...ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో సిబ్బంది విశ్రాంతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డ్‌తో ఏఎస్ఐ వ్యక్తిగత సేవలు చేయించుకున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వెలుగుచూసింది. -
మహిళా హోంగార్డు దారుణ హత్య
మేడ్చల్: మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. నగర శివార్లలోని బాసిరేగడి అటవీ ప్రాంతంలో ఆమె తలపై రాళ్లతో మోది దారుణంగా హత్యమార్చారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పేట్ బషిరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాలు.. నగరంలోని బేగంపేట్ రసూల్‌పూరలో నివసించే సురివి నవనీత (45) హైదరాబాద్ పోలీ స్ కమిషనర్రేట్ పరిధిలోని సెంట్రల్ జోన్లో హోంగార్డుగా నియామకమై కంట్రోల్‌రూంలో విధులు నిర్వహిస్తోంది. రోజూ మాదిరిగానే నవనీత గురువారం తన నివాసం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీకి బయలుదేరింది. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయ ంలో మద్యం మత్తులో నడవలేని స్థితిలో ఆమె నగరంలోని లింగంపల్లి బస్టాప్‌లో స్థానికులకు కనిపించింది. అదే సమయంలో ఆమె తన ఆడపడుచూ ప్రమీలకు ఫోన్ చేసి తాను లింగంపల్లి బసా ్టండ్ వద్ద ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆమె అక్కడ కూడా కనిపించలేదు. తలపై రాళ్లతో మోది హత్య.. అయితే మేడ్చల్-గండిమైసమ్మ రోడ్డులో ఉన్న బాసిరేగడి అటవీ ప్రాంతలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాళ్లతో తలపై మోది హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐడి కార్డు , ఓ సెల్ ఫోన్ లభ్యమయ్యాయి. ఆ ఐడి కార్డుపై నవనీత హోంగార్డు, హైదరాబాద్ సిటీ, ఎస్జి నంబర్ 1841 అని ఉంది. దీంతో పోలీసులు ఆ సెల్‌లోని నెంబర్లకు ఫోన్ చేసి ఆనవాళ్లు చెప్పగా హత్యకు గురైంది హోంగార్డు నవనీతేనని నిర్ధారించారు. మృతురాలి కుమారుడు దుర్గాప్రసాద్, బంధువులు సంఘటనా స్థలానికి చేరకొని తీవ్రంగా విలపించారు. సైబరాబా ద్ పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ ఎ.ఆర్. శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవనీత భర్త రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ముగ్గురు కుమార్తెల వివాహాలు జరిగాయి. -
తెగని పంచాయితీ
అనంతపురం శివారులోని పంచాయతీల పరిధిలో ఉన్న కాలనీలను నగర పాలక సంస్థలో విలీనం చేయాల్సిన ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని చిన్నాపెద్దా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటైన పురపాలకాలు, నగర పంచాయతీల్లో పరిసర పంచాయతీలను విలీనం చేస్తున్నా ‘అనంత’లో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. అనంతపురం నగరం కార్పొరేషన్ హోదా పొంది ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా విలీనానికి సంబంధించిన ఫైల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోకి శివారు ప్రాంతాల్లోని పంచాయతీల విలీనం కలగా మారుతోంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఈ ప్రక్రియపై దృష్టి సారించడం లేదు. పంచాయతీల విలీనం గురించి కనీసంగా కూడా ప్రయత్నాలు జరగడం లేదనేందుకు ప్రభుత్వపరంగా జరుగుతున్న జాప్యం నిదర్శనంగా నిలుస్తోంది. నగర శివారుల్లోని పంచాయతీలకు చెందిన పలు కాలనీలు ఇప్పటికే నగర పాలక సంస్థ స్థాయిలో సౌకర్యాలు పొందుతున్నాయి. పంచాయతీల విలీనం చేయడం ద్వారా అవన్నీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఆధీనంలోకి వస్తాయి. తద్వారా సంస్థకు ఆస్తిపన్ను రూపంలో అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆ నిధులతో విలీన కాలనీలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను, మౌలిక వసతులు అందించేందుకు అవకాశం ఉంటుంది. విలీనమైతే నీటి సమస్యకు చెక్ పంచాయతీలను విలీనం చేస్తే నీటి యుద్ధాలు తప్పుతాయి. అనంతపురం నగరానికి పీఏబీఆర్ ప్రాజెక్టు ద్వారా నీరు సంపూర్ణ స్థాయిలో అందుతోంది. చుట్టుపక్కల ఉన్న నారాయణపురం, రుద్రంపేట, కక్కపల్లి, కక్కలపల్లి కాలనీ, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ నీటిని అనధికారికంగా మళ్లించుకునేందుకు నారాయణపురం గ్రామస్తులు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున్న గొడవలు చోటు చేసుకున్నాయి. రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దంతో పాటు మహిళా హోంగార్డ్‌కు గాయాలయ్యాయి. దాదాపు పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పంచాయతీలను విలీనం చేస్తే ఆ ప్రాంతాలకు కూడా అధికారికంగా తాగునీటి సరఫరా చేయవచ్చు. విలీనం అయ్యే పంచాయతీలు నగర పాలక సంస్థలోకి బుక్కరాయసముద్రం, రాప్తాడు, కక్కలపల్లి, పాపంపేట, నారాయణపురం, అనంతపురం రూరల్ (ఉత్తర, దక్షిణ) పంచాయతీల పరిధిలోని కొంత భాగం విలీనం చేసేలా అధికారులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు. రాజీవ్ పంచాయతీ : కేంద్రీయ ఉద్యానవం, తడకలేరు, మహదేవనగర్, రాజీవ్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పొట్టిశ్రీరాములు కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రిక్షాకాలనీ, ప్రియాంక నగర్, గుత్తిరోడ్డులోని పరిశ్రమలు. అనంతపురం రూరల్ పంచాయతీ : లెనిన్‌నగర్, ఎన్టీఆర్ నగర్, రామకృష్ణనగర్, ఎల్ఐసీ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని ప్రొఫెసర్ కాలనీ, భైరవ నగర్, సంఘమిత్ర నగర్ ఎక్స్టెన్షన్, అయ్యప్పస్వామిగుడి, బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న మెటల్ క్రషర్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, దాని సమీపంలోని మెడికల్ కళాశాలలు. నారాయణపురం పంచాయతీ : ఎ.నారాయణపురం, సుఖదేవనగర్, అల్లూరిసీతారామరాజు నగర్, రాయల్‌నగర్, స్టాలిన్ నగర్, తపోవనం, సోమనాథ్‌నగర్ ఎక్స్టెన్షన్, బళ్లారి రోడ్డులోని ఏపీ లై టింగ్ వరకు. పా పంపేట, విద్యారణ్యనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బసవతారక నగర్, జొన్నావీరయ్య కాలనీ, కంబైండ్ ఆటో సర్వీస్. కక్కలపల్లి కాలనీ పంచాయతీ : నారాయణరెడ్డి కాలనీ, సీపీఐ కొట్టాలు, సియాన్నగర్, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ. కక్కలపల్లి పంచాయతీ : సంగమేశ్వర పిక్నిక్ సెంటర్, సహార టౌన్‌షిప్‌లోని కొంత భాగం, బైపాస్‌రోడ్డు. రుద్రంపేట పంచాయతీ : రుద్రంపేట గ్రామం, శ్రీనగర్‌కాలనీ ఎక్స్టెన్షన్ రాప్తాడు పంచాయతీ : సహార టౌన్షిప్లో కొంత భాగం, బైపాస్‌రోడ్డు, ప్రభాకర్‌చౌదరి కాలనీ, ఈనాడు ఎడిషన్ కార్యాలయం, వాటర్ వర్క్స్, ఆర్డీటీ స్టేడియం, బెంగళూరు బైపాస్‌రోడ్డు, ఆర్డీటీ బ్రెయిలీ రెసిడెన్సియల్ పాఠశాల, సెయింట్ విన్సెంట్ డీ పాల్ పాఠశాల. ఉప్పరపల్లి పంచాయతీ : ఆర్డీటీ స్టేడియం, రైస్‌మిల్, ఆటవీశాఖకు చెందిన నర్సరీ. బుక్కరాయసముద్రం పంచాయతీ : సమ్మర్ స్టోరేజి ట్యాంక్, విరూపాక్షనగర్, గుత్తిరోడ్డు తడకలేరు వరకు ప్రసన్నాయపల్లి పంచాయతీ : ప్రసన్నాయపల్లి గ్రామం, ఎల్‌ఆర్‌జీ స్కూల్, చిన్మయనగర్, కళాకారుల కాలనీ, పోస్టల్ కాలనీ