
సాక్షి, గద్వాల : మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఎస్‌ఐ హసన్‌పై సస్పెన్ష్ వేటు పడింది. ఏఆర్ ఏఎస్‌ఐ హసన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్‌ఐ హసన్...ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో సిబ్బంది విశ్రాంతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డ్‌తో ఏఎస్‌ఐ వ్యక్తిగత సేవలు చేయించుకున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వెలుగుచూసింది.