Hassan
-
టార్గెట్ నస్రల్లా.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
బీరుట్: హెజ్బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీరుట్లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం. పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది. ఇరాన్ ఆరా.. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది. -
యుద్ధం అంచున..
బీరుట్: చేతిలో ఇమిడే చిన్నపాటి పేజర్లు, వాకీటాకీలను పేల్చేసి హెజ్బొల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ శుక్రవారం ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్విమానాలతో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలుళ్లతో వేలాది మంది హెజ్బొల్లా సాయుధుల, పౌరుల రక్తం కళ్లజూసిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో సమరాగ్నిని మరింత రాజేసింది.ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బొల్లా దీటుగా బదులిస్తున్నాయి. ఈ సందర్భంగా అల్–మర్జ్ ప్రాంతంలో హెజ్బొల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని 43 ఏళ్ల రిజర్వ్ మేజర్ నేయిల్ ఫార్సీ, 20 ఏళ్ల సర్జెంట్ టోమర్ కెరెన్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ ఎన్12 న్యూస్ వార్తాసంస్థ ప్రకటించింది. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు తక్కువ ఎత్తులో చెవులు చిల్లులుపడేలా ధ్వని వేగంతో దూసుకుపోవడంలో అసలేం జరుగుతుందో తెలీక జనం భయపడి పోయారు. తాము చాలా డ్రోన్లను ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూశామని స్థానికులు చెప్పారు.హెజ్బొల్లా స్థావరాలపై దాడులుహెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తుండగానే∙ హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాదాపు 150 రాకెట్ లాంఛర్లను ధ్వంసంచేసింది. హెజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని హెజ్బొల్లాపై ఆరోపణలు గుప్పించింది. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఆరోపించింది. ‘‘ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులతో తరలిపోయిన ఇజ్రాయెలీలు మళ్లీ సరిహద్దు ప్రాంతాల సొంతిళ్లకు తిరిగి చేరుకోవడం మాకు ముఖ్యం. వారి రక్షణ, భద్రత లక్ష్యంగా ఎలాంటి సైనిక చర్యలకైనా మేం సిద్ధం.సమస్యను మరింత జఠిలం చేస్తూ, ఆలస్యం చేసేకొద్దీ హెజ్బొల్లా మరింతగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ హెచ్చరించారు. ‘‘ ఈ దాడులు ఆగవు. అయితే హెజ్బొల్లాతో పోరు చాలా సంక్లిష్టతో కూడుకున్న వ్యవహారం’’ అని సైన్యాధికారులతో భేటీలో గాలంట్ వ్యాఖ్యానించారు. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని ఇరుపక్షాలకు అమెరికా, ఫ్రాన్స్ సూచించాయి.ఈ విపరిణామంతో లెబనాన్‌లో ప్రజారోగ్యం కుదేలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసిస్ ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యే వీలుంది. యుద్ధభయాలతో అక్కడి తమ పౌరులు లెబనాన్‌ను వీడాలని బ్రిటిషర్లకు బ్రిటన్ విదేశాంగ శాఖ శుక్రవారం అత్యవసర అడ్వైజరీ జారీచేసింది. మరోవైపు లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌లో పేజర్, వాకీటాకీలపై నిషేధంవేలాది పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో కొంతమంది మరణాలు, వేలాదిగా హెజ్బొల్లా సభ్యులు క్షతగాత్రులైన ఘటనతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికుల, పౌర విమానయాన సంస్థల విమానాల భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా బీరుట్ నగరంలోని రఫీక్ హరీరీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ఏ విమానంలోనూ పేజర్, వాకీటాకీలను అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఈ నిషేధం అంశం తెలియజేయాలని విమానయాన సంస్థలకు సూచించింది.రెడ్‌లైన్ దాటి భారీ తప్పిదం చేసింది: నస్రల్లాపరస్పర దాడులు మొదలుకావడానికి ముందే గుర్తుతెలియని ప్రదేశం నుంచి హమాస్ చీఫ్ నస్రల్లా టెలివిజన్‌లో ప్రసంగించారు. ‘‘పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వేలాది మంది ప్రాణాలు హరించేందుకు బరితెగించి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. వేల మందిని రక్తమోడేలా చేసి యుద్ధనేరానికి పాల్పడింది. పరికరాల విధ్వంసంతో మా కమ్యూనికేషన్‌కు భారీ నష్టం వాటిల్లిన మాట వాస్తవమే. అయినాసరే దాడులతో మాలో నైతిక స్థైర్యం మరింత పెరిగింది. ఇజ్రాయెల్‌పై పోరుకు మరింత సంసిద్ధమయ్యాం. అనూహ్య పేలుళ్లతో శత్రువు తన పరిధి దాటి ప్రవర్తించాడు.అన్ని నియమాలను, రెడ్‌లైన్‌ను దాటేశాడు. వాళ్లు ఊహించినట్లే దాడులు చేస్తాం. ఊహించనంతగా దాడి చేస్తాం. గాజాలో దాడులు ఆపేదాకా మేం ఉత్తరలెబనాన్ సరిహద్దులో దాడులు ఆపబోం. మా దాడుల దెబ్బకి పారిపోయిన సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలు ఎన్నటికీ తమ సొంతిళ్లకు రాలేరు. దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెడితే అది మాకు సువర్ణావకాశం. వాళ్లు దారుణ ఫలితాలను చవిచూస్తారు’’ అని అన్నారు. -
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
హాసన్ విషయంలో నా వైఖరి మారదు
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు. -
కవలలు, తల్లి లారీ కింద ఛిద్రం.. రెండు కి.మీ. వరకూ ముక్కలుగా..
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): తాగుబోతు లారీ డ్రైవర్ నిర్వాకం వల్ల ఒక కుటుంబం ఛిద్రమైంది. బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో కవల పిల్లలు, తల్లి మృతిచెందగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డ సంఘటన హాసన్ పట్టణ శివార్లలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హాసన్ నివాసులయిన శివానంద్, జ్యోతి దంపతులు ఆదివారం అర్ధరాత్రి తమ కవల పిల్లలు ప్రణతి (3), ప్రణవ్ (3)లతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. చదవండి: (Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య) కిందపడిన ఇద్దరు చిన్నారులపై నుంచి లారీ వెళ్లడంతో వారి శరీరాలు చక్రాలకు చిక్కుకుని రెండు కిలోమీటర్ల దూరం వరకూ ముక్కలుగా పడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ శివానంద్, జ్యోతి హాసన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ జ్యోతి మరణించింది. లారీ డ్రైవర్ పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ విపరీతంగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) -
వధువు చీర గురించి గొడవ.. చివరికి
బెంగళూరు: మంచి కాఫీ లాంటి సినిమా ‘ఆనంద్’ గుర్తుందా? పెళ్లికూతురు కట్టుకున్న చీర బాగోలేదని, వెంటనే చీర మార్చుకోమని చెబుతుంది కాబోయే అత్తగారు. లేదు, నాకీ చీరే బాగుంది. ఇది మా అమ్మ చీర అని చెబుతుంది పెళ్లికూతురు. ఆ మాటలకు కాబోయే అత్తగారు ఉరిమి చూసి, నానా మాటలూ అంటుంది. అప్పుడు పెళ్లికూతురే ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. అందరూ ఆమెను నానా మాటలూ అంటారు చీరకోసం పెళ్లి రద్దు చేసుకుంటావా అని. అచ్చం ఇటువంటి ఘటనే కర్ణాటకలోని హసన్‌లో జరిగింది. బీఎన్ రఘుకుమార్, సంగీత అనే అమ్మాయి ఏడాది కాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ మేరకు గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. అయితే పెళ్లికూతురికి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పెళ్లి చీర నాసిరకంగా ఉందన్న కారణంతో రఘుకుమార్ తల్లిదండ్రులు పెళ్లిమండపంలో గొడవ చేశారు. ‘అమ్మాయిని చీర మార్చుకు రమ్మనండి, తను కట్టుకుని ఉన్నది బొత్తిగా నాసిరకంగా ఉంది’ అంటూ వధువు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే వాళ్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఆ వాదన చివరికి పెళ్లి రద్దు చేసేందుకు దారితీసింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల మాట మేరకు రఘుకుమార్ పెళ్లి మండపానికి రాకుండానే అదృశ్యమైపోయాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికొడుకు మీద, అతని అమ్మానాన్నల మీద స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మంచి కాఫీ లాంటి ఆనంద్ సినిమాలా ఈ కథ కూడా సుఖాంతం అవుతుందేమో చూడాలి! -
విమానాశ్రయంలో ఆ ఒక్కడు!
ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సామెత వినే ఉంటారు.. కానీ దానికి అర్థం హసన్ అల్ కొంటార్ అనే వ్యక్తికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! ఆయన వంద రోజులుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోనే ఉంటున్నాడు.. స్వదేశంలోనేమో యుద్ధం.. ఇంకో దేశానికి వెళ్లలేని పరిస్థితి.. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో.. ఇప్పుడు నాసా వెంటపడ్డాడు.. ‘బాబ్బాబు.. కొన్నేళ్లలో అంగారకుడిపైకి మనుషుల్ని పంపుతున్నారట కదా.. ఆ గుంపులో నన్నూ చేర్చుకొ’మ్మని! మరి ఎవరీ హసన్.. ఎందుకలా విమానాశ్రయంలో ఉన్నాడు.. ఏమిటీ పరిస్థితి తెలుసుకుందామా..? నిన్న మొన్నటి వరకూ హసన్ అరబ్ ఎమిరేట్స్‌లో బీమా ఏజెంటుగా పనిచేసేవాడు. పుట్టింది సిరియాలో. వయసు 38 ఏళ్లు. ఏ దుర్ముహూర్తాన బయలుదేరాడోగానీ ఈ ఏడాది మార్చి 7వ తేదీన మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. యుద్ధంలో చేరేందుకు నిరాకరించాడంటూ సిరియా ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును రద్దు చేసింది. దాంతో 200కుపైగా దేశాలున్న ఈ ప్రపంచంలో ఏ దేశానికీ చెందని వాడైపోయాడు. విమానాశ్రయంలోని టెర్మినల్–2యే ఆయన ఇల్లయిపోయింది. ఓ దిండు, నీళ్ల బాటిల్, నడుం వాల్చేందుకు ఓ బెంచి.. అంతే! ‘ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకొన్ని రోజులు ఇక్కడే గడపాల్సి ఉంటుందేమో! పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. స్నానం చేసే అవకాశం లేదు. నిద్రపోదామన్నా కుదరడం లేదు. ఆఖరికి జబ్బు చేస్తే మందులు వేసుకునే దిక్కూ లేకుండా పోయింది’’అని వాపోతున్నాడు. అసలేమైంది? హసన్‌కు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అర్థం కావాలంటే సిరియా గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆ దేశంలో చదువు అయిపోయిన తరువాత కొంతకాలం నిర్బంధంగా మిలటరీలో పనిచేయాలి. ఒకవేళ చదువు అయిపోయే సమయానికి దేశంలో లేకపోతే.. ఏటా కొంచెం రుసుము చెల్లించి మినహాయింపు పొందవచ్చు. ఈ క్రమంలో హసన్ కూడా తన చదువు అయిపోతూండగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వెళ్లిపోయాడు. మూడు, నాలుగు కంపెనీల్లో బీమా ఏజెంటుగా పనిచేశాడు. అంతా బాగానే ఉందికదా అనుకుంటున్న సమయంలో 2011లో సిరియాలో యుద్ధం మొదలైంది. విదేశాల్లో ఉన్న సిరియన్లు యుద్ధంలో పాల్గొనేందుకు స్వదేశానికి రావాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. కానీ యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేని హసన్ సిరియాకు వెళ్లలేదు. దాంతో సిరియా ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును రద్దు చేసేసింది. హసన్ నిఘా సంస్థల కళ్లలో పడకుండా యూఏఈలోనే కొంతకాలం నెట్టుకురాగలిగినా.. వర్క్ పర్మిట్‌ను పునరుద్ధరించుకునే అవకాశం లేక ఉద్యోగంలో కొనసాగలేకపోయాడు. చివరికి యూఏఈ అధికారులు హసన్‌ను అదుపులోకి తీసుకుని 3 నెలల వర్క్ పర్మిట్ ఇచ్చి మలేసియాకు పంపారు. ఆ సమయం ముగిశాక ఈక్వెడార్‌కు వెళ్లేందుకు టర్కీకి చెందిన విమానం ఎక్కడం.. అది కాస్తా టికెట్ రద్దు చేయడంతో మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. నాసాకు దరఖాస్తు.. హసన్ కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉండిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఆయన ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. తన దుస్థితిపై అప్పుడప్పుడూ ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నాడు. చివరికి విసుగొచ్చి.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. ‘చిన్నప్పటి నుంచి అంతరిక్ష సంబంధిత సినిమాలు బోలెడన్ని చూశాను. అంతరిక్ష నౌకల్లో ఎప్పుడు, ఏం చేయాలో బాగా తెలుసు. ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నన్ను అంగారకుడిపైకి పంపే నౌకలో చేర్చుకోండి..’’అంటూ లేఖలూ రాశాడు. నాసా ఏం చేస్తుందో తెలియదుగానీ.. హసన్‌ను ఈ కష్టాల నుంచి బయటపడేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం ప్రయత్నిస్తోంది. ఆయనను శరణార్థిగా కెనడాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హసన్ తరహాలోనే.. ‘ద టెర్మినల్..’ 2004లో హాలీవుడ్లో ‘ది టెర్మినల్’పేరిట ఓ సినిమా వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హ్యాంక్స్, కెథరీన్ జెటా జోన్స్ హీరో, హీరోయిన్లు. విక్టర్ నొవరోస్కీగా పేరున్న హీరో మరో దేశ విమానాశ్రయంలో దిగే సమయానికి.. ఆయన స్వదేశంలో మిలటరీ తిరుగుబాటు జరుగుతుంది. ఇతర దేశాలన్నీ ఆ దేశంతో సంబంధాలు తెంచుకుని, ఆ దేశ పౌరులను తమ దేశాల్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదని తీర్మానం చేస్తాయి. దీంతో నొవరోస్కీ విమానాశ్రయంలోనే చిక్కుకుపోతాడు. కొన్ని నెలలపాటు అక్కడే గడుపుతాడు. ఇమిగ్రేషన్ అధికారిణిగా పనిచేస్తున్న హీరోయిన్‌తో పరిచయం, ప్రేమ అన్నీ విమానాశ్రయంలోనే జరిగిపోతాయి. చివరకు క్రాకోజియాలో యుద్ధం ముగియడంతో విక్టర్ సమస్యలు తీరిపోతాయి. స్టీఫెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమాకు... హసన్ అల్ కొంటార్ తాజా పరిస్థితికి సారూప్యత బోలెడంత!! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, గద్వాల : మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్ష్ వేటు పడింది. ఏఆర్ ఏఎస్ఐ హసన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్ఐ హసన్...ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో సిబ్బంది విశ్రాంతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డ్‌తో ఏఎస్ఐ వ్యక్తిగత సేవలు చేయించుకున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వెలుగుచూసింది. -
సిరియాలో ఆత్మాహుతి దాడులు
బీరట్: సిరియాలోని హామ్స్ నగరంలో రెండు భద్రతా దళాల శిబిరాలపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ హసన్ సహా 42 మంది మరణించారు. ముఖ్యంగా హసన్ ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముఖ్య పర్యవేక్షణ అధికారి ఒకరు స్పందిస్తూ.. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నారని చెప్పారు. రెండు బృందాలుగా విడిపోయి వారు ఈ దురాగతానికి పాల్పడ్డారని తెలిపారు. ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి సందర్భంగా భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. అఫ్గానిస్తాన్ లో 11 మంది మృతి కాబూల్: అఫ్గానిస్తాన్ లోని ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో పది మంది పోలీసు అధికారులు చనిపోయారు. ఉత్తర జాజ్వాన్ ప్రావిన్స్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు మసీదు నుంచి బయటికి వస్తుండగా దాడి జరిగింది. తన భర్తను కాల్చి చంపారన్న సంగతి తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి భార్యను కూడా దుండగులు చంపేశారు. -
శింబుతో కలసి...
హీరో, హీరోయిన్లతో పాడించడం ఫ్యాషన్‌గా మారింది. మంచి ప్రచారంతోపాటు ఈ తరహా పాటలకు ప్రేక్షకుల మధ్య క్రేజ్ పెరిగింది. అదేవిధంగా నాయికల్లో మమత, ఆండ్రియ, రమ్యానంబీశన్ లాంటి కొందరు గాయనిమణులగా ప్రాచుర్యం పొందారు. ఈ వరుసలో తాజాగా నటి స్వాతి చేరింది. సుబ్రమణిపురం చిత్రంతో కథానాయికగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడికి ఆ తరువాత అవకాశాలు అంతంత మాత్రమే. తాజాగా గాయనిగా అవతారమెత్తడానికి నటుడు శింబు కోసం ఎదురు చూస్తోంది. విషయం ఏమిటంటే జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్‌ను నటి స్వాతితో పాడించాలని భావించారట. ఆమెకు విషయం చెప్పగానే నటిగా అవకాశలెటూ లేవు. కాబట్టి గాయనిగానైనా వార్తల్లో కెక్కుదామని వెంటనే ఒప్పేసుకుందట స్వాతి. అన్నట్లు ఈమెతోపాటు సంచలన నటుడు శింబును పాడించాలన్న తమన్ ప్రయత్నం ఫలించింది. ఆయన ఓకే చెప్పారట. అయితే అందుకు కాల్షీట్ ఎప్పుడిచ్చేది చెప్పకపోవడంతో ఇప్పుడు తమన్‌తో పాటు స్వాతి కూడా శింబు కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఇకపోతే కోలీవుడ్, టాలీవుడ్‌లలో అంతగా అవకాశాలు లేకపోయినా స్వాతికి మాలీవుడ్‌లో ఆదరణ బాగానే ఉందట. -
అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ...
అదేదో సినిమాలో హీరో ‘కంచుకట్ల వారి పట్ల’తో భామలను తన వెంట తిప్పుకుంటాడు. శాండల్‌వుడ్ భామ సంజన వరస చూస్తుంటే అలానే ఉంది. హీరోలను బుట్టలో వేసుకొనే కిటుకులు అమ్మడికి బాగా తెలిసినట్టున్నాయి. నిన్న గాక మొన్న హీరో తమిళ హీరో శింబును అతని పుట్టిన రోజు సందర్భంగా ‘ట్వీట్స్’తో ఆకాశానికెత్తేసిన సంజన... నేడు బాలీవుడ్ స్టార్ అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులే కాదు... ఇండస్ట్రీ పీపుల్ కూడా కాస్తంత ఆశ్చర్యపోయారు. అసలు అనిల్‌ను ఎందుకు కలిసిందన్నది చెప్పలేదు గానీ... ‘లెజండ్ అనిల్ కపూర్‌తో కప్పు కాఫీ... కాసిన్ని కబుర్లు పంచుకున్న అద్భుతమైన మార్నింగ్’ అంటూ ట్వీటిందీ చిన్నది! -
'మార్చురీలో ఉన్న చిన్నారిని ఎలుకలు తిన్నాయి'
బెంగళూరు: తన కుమారుడి మృత దేహం ఎలుకల పాలు కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ మాతృమూర్తి లోకాయుక్తను ఆశ్రయించిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు... అరసికెరెకు చెందిన జగదీష్, యోగమ్మ దంపతులు రెండు నెలల కుమారుడు ఇటీల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన చిన్నారి చనిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్లో యోగమ్మ ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా పోస్ట్‌మార్టం కోసం శిశువు మృతదేహాన్ని హాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’ లోని మార్చురీలో ఉంచారు. అయితే శిశువు కళ్లు, చెవులతో పాటు మొహం లోని కొన్ని భాగాలు ఎలుకలు తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై లోకాయుక్తలో బుధవారం బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో.. ‘నాతో పాటు నా భర్తకూడా వికలాంగుడు. ఇకపై నేను గర్భం దాల్చలేను. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వంశోద్ధారకుడిని కోల్పాయాం. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరైన స్పందనలేదు. పైగా నా కుమారుడి ముఖాన్ని ఆఖరు సారిగా చూసుకుందామన్నా వీలు లేకుండా పోయిం ది. అందువల్ల ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుండి.’ అని పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన లోకాయుక్త ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.