శింబుతో కలసి... | swathi sing a song with hero simbu | Sakshi
Sakshi News home page

శింబుతో కలసి...

Published Fri, Mar 27 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

శింబుతో కలసి...

శింబుతో కలసి...

హీరో, హీరోయిన్లతో పాడించడం ఫ్యాషన్‌గా మారింది. మంచి ప్రచారంతోపాటు ఈ తరహా పాటలకు ప్రేక్షకుల మధ్య క్రేజ్ పెరిగింది.  అదేవిధంగా నాయికల్లో మమత, ఆండ్రియ, రమ్యానంబీశన్ లాంటి కొందరు గాయనిమణులగా ప్రాచుర్యం పొందారు. ఈ వరుసలో తాజాగా నటి స్వాతి చేరింది. సుబ్రమణిపురం చిత్రంతో కథానాయికగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడికి ఆ తరువాత అవకాశాలు అంతంత మాత్రమే. తాజాగా గాయనిగా అవతారమెత్తడానికి నటుడు శింబు కోసం ఎదురు చూస్తోంది. విషయం ఏమిటంటే జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్‌ను నటి స్వాతితో పాడించాలని భావించారట. ఆమెకు విషయం చెప్పగానే నటిగా అవకాశలెటూ లేవు.

కాబట్టి గాయనిగానైనా వార్తల్లో కెక్కుదామని వెంటనే ఒప్పేసుకుందట స్వాతి. అన్నట్లు ఈమెతోపాటు సంచలన నటుడు శింబును పాడించాలన్న తమన్ ప్రయత్నం ఫలించింది. ఆయన ఓకే చెప్పారట. అయితే అందుకు కాల్‌షీట్ ఎప్పుడిచ్చేది చెప్పకపోవడంతో ఇప్పుడు తమన్‌తో పాటు స్వాతి కూడా శింబు కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఇకపోతే కోలీవుడ్, టాలీవుడ్‌లలో అంతగా అవకాశాలు లేకపోయినా స్వాతికి మాలీవుడ్‌లో ఆదరణ బాగానే ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement