బబ్లీ పాత్రలో స్వాతి | Swathi next movie under VIshnuvardhan direction | Sakshi
Sakshi News home page

బబ్లీ పాత్రలో స్వాతి

Published Tue, Jul 8 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

బబ్లీ పాత్రలో స్వాతి

బబ్లీ పాత్రలో స్వాతి

 ఇంగ్లిషులో స్లో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే సామెత ఉంది. యువ నటి స్వాతి ఈ సామెతను పాటిస్తున్నట్లుంది. ఒక్కో చిత్రంలో నటిస్తూ కోలీవుడ్‌లో హీరోయిన్‌గా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ టాలీవుడ్ బ్యూటీ. సుబ్రమణిపురం చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించిన ఈ అమ్మడు ఇక్కడ చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ఆ మధ్య ఇదర్కుదాన్ ఆశై పట్టాయ్ బాలకుమార చిత్రంలో విజయ్ సేతుపతితో జతకట్టి నటిగా మంచి మార్కులు కొట్టేసిన స్వాతి ఈ మధ్య వడకర్రి చిత్రంలో నటుడు జయ్‌తో రొమాన్స్ చేసింది.
 
 తాజాగా మరో మంచి అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. ఆరంభం వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం యాచ్చన్. ఈ చిత్రంలో ఆయన తమ్ముడు కృష్ణ, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. ఆర్య సరసన నూతన నటి దీపా సన్నిధి నటిస్తుండగా కృష్ణకు జంటగా స్వాతిని ఎంపిక చేశారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చెన్నైలో మొదలైంది. ఇందులో స్వాతిది మంచి బబ్లీ పాత్ర అని దర్శకుడు విష్ణువర్ధన్ తెలిపారు. రాజారాణి తరువాత ఆర్య నటిస్తున్న చిత్రం ఇదే. అలాగే యామిరుక్క భయమే వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత కృష్ణ నటిస్తున్న చిత్రం యాచ్చన్‌నే. ఈ మల్టీ స్టారర్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే కదా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement