
కవల పిల్లలతో తల్లిదండ్రులు (ఫైల్)
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): తాగుబోతు లారీ డ్రైవర్ నిర్వాకం వల్ల ఒక కుటుంబం ఛిద్రమైంది. బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో కవల పిల్లలు, తల్లి మృతిచెందగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డ సంఘటన హాసన్ పట్టణ శివార్లలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హాసన్ నివాసులయిన శివానంద్, జ్యోతి దంపతులు ఆదివారం అర్ధరాత్రి తమ కవల పిల్లలు ప్రణతి (3), ప్రణవ్ (3)లతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
చదవండి: (Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య)
కిందపడిన ఇద్దరు చిన్నారులపై నుంచి లారీ వెళ్లడంతో వారి శరీరాలు చక్రాలకు చిక్కుకుని రెండు కిలోమీటర్ల దూరం వరకూ ముక్కలుగా పడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ శివానంద్, జ్యోతి హాసన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ జ్యోతి మరణించింది. లారీ డ్రైవర్ పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ విపరీతంగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..)