బీరట్: సిరియాలోని హామ్స్ నగరంలో రెండు భద్రతా దళాల శిబిరాలపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ హసన్ సహా 42 మంది మరణించారు. ముఖ్యంగా హసన్ ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముఖ్య పర్యవేక్షణ అధికారి ఒకరు స్పందిస్తూ.. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నారని చెప్పారు. రెండు బృందాలుగా విడిపోయి వారు ఈ దురాగతానికి పాల్పడ్డారని తెలిపారు. ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి సందర్భంగా భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు.
అఫ్గానిస్తాన్ లో 11 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ లోని ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో పది మంది పోలీసు అధికారులు చనిపోయారు. ఉత్తర జాజ్వాన్ ప్రావిన్స్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు మసీదు నుంచి బయటికి వస్తుండగా దాడి జరిగింది. తన భర్తను కాల్చి చంపారన్న సంగతి తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి భార్యను కూడా దుండగులు చంపేశారు.
సిరియాలో ఆత్మాహుతి దాడులు
Published Sun, Feb 26 2017 2:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement
Advertisement