
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment