అనంతపురం శివారులోని పంచాయతీల పరిధిలో ఉన్న కాలనీలను నగర పాలక సంస్థలో విలీనం చేయాల్సిన ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని చిన్నాపెద్దా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటైన పురపాలకాలు, నగర పంచాయతీల్లో పరిసర పంచాయతీలను విలీనం చేస్తున్నా ‘అనంత’లో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. అనంతపురం నగరం కార్పొరేషన్ హోదా పొంది ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా విలీనానికి సంబంధించిన ఫైల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోకి శివారు ప్రాంతాల్లోని పంచాయతీల విలీనం కలగా మారుతోంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఈ ప్రక్రియపై దృష్టి సారించడం లేదు. పంచాయతీల విలీనం గురించి కనీసంగా కూడా ప్రయత్నాలు జరగడం లేదనేందుకు ప్రభుత్వపరంగా జరుగుతున్న జాప్యం నిదర్శనంగా నిలుస్తోంది.
నగర శివారుల్లోని పంచాయతీలకు చెందిన పలు కాలనీలు ఇప్పటికే నగర పాలక సంస్థ స్థాయిలో సౌకర్యాలు పొందుతున్నాయి. పంచాయతీల విలీనం చేయడం ద్వారా అవన్నీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఆధీనంలోకి వస్తాయి. తద్వారా సంస్థకు ఆస్తిపన్ను రూపంలో అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆ నిధులతో విలీన కాలనీలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను, మౌలిక వసతులు అందించేందుకు అవకాశం ఉంటుంది.
విలీనమైతే నీటి సమస్యకు చెక్
పంచాయతీలను విలీనం చేస్తే నీటి యుద్ధాలు తప్పుతాయి. అనంతపురం నగరానికి పీఏబీఆర్ ప్రాజెక్టు ద్వారా నీరు సంపూర్ణ స్థాయిలో అందుతోంది. చుట్టుపక్కల ఉన్న నారాయణపురం, రుద్రంపేట, కక్కపల్లి, కక్కలపల్లి కాలనీ, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ నీటిని అనధికారికంగా మళ్లించుకునేందుకు నారాయణపురం గ్రామస్తులు సిద్ధపడ్డారు.
ఆ క్రమంలో పెద్ద ఎత్తున్న గొడవలు చోటు చేసుకున్నాయి. రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దంతో పాటు మహిళా హోంగార్డ్‌కు గాయాలయ్యాయి. దాదాపు పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పంచాయతీలను విలీనం చేస్తే ఆ ప్రాంతాలకు కూడా అధికారికంగా తాగునీటి సరఫరా చేయవచ్చు.
విలీనం అయ్యే పంచాయతీలు
నగర పాలక సంస్థలోకి బుక్కరాయసముద్రం, రాప్తాడు, కక్కలపల్లి, పాపంపేట, నారాయణపురం, అనంతపురం రూరల్ (ఉత్తర, దక్షిణ) పంచాయతీల పరిధిలోని కొంత భాగం విలీనం చేసేలా అధికారులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు.
రాజీవ్ పంచాయతీ : కేంద్రీయ ఉద్యానవం, తడకలేరు, మహదేవనగర్, రాజీవ్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పొట్టిశ్రీరాములు కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రిక్షాకాలనీ, ప్రియాంక నగర్, గుత్తిరోడ్డులోని పరిశ్రమలు.
అనంతపురం రూరల్ పంచాయతీ : లెనిన్‌నగర్, ఎన్టీఆర్ నగర్, రామకృష్ణనగర్, ఎల్‌ఐసీ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని ప్రొఫెసర్ కాలనీ, భైరవ నగర్, సంఘమిత్ర నగర్ ఎక్స్‌టెన్షన్, అయ్యప్పస్వామిగుడి, బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న మెటల్ క్రషర్, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, దాని సమీపంలోని మెడికల్ కళాశాలలు.
నారాయణపురం పంచాయతీ : ఎ.నారాయణపురం, సుఖదేవనగర్, అల్లూరిసీతారామరాజు నగర్, రాయల్‌నగర్, స్టాలిన్ నగర్, తపోవనం, సోమనాథ్‌నగర్ ఎక్స్‌టెన్షన్, బళ్లారి రోడ్డులోని ఏపీ లై టింగ్ వరకు. పా పంపేట, విద్యారణ్యనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బసవతారక నగర్, జొన్నావీరయ్య కాలనీ, కంబైండ్ ఆటో సర్వీస్.
కక్కలపల్లి కాలనీ పంచాయతీ : నారాయణరెడ్డి కాలనీ, సీపీఐ కొట్టాలు, సియాన్‌నగర్, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ.
కక్కలపల్లి పంచాయతీ : సంగమేశ్వర పిక్నిక్ సెంటర్, సహార టౌన్‌షిప్‌లోని కొంత భాగం, బైపాస్‌రోడ్డు.
రుద్రంపేట పంచాయతీ : రుద్రంపేట గ్రామం, శ్రీనగర్‌కాలనీ ఎక్స్‌టెన్షన్
రాప్తాడు పంచాయతీ : సహార టౌన్‌షిప్‌లో కొంత భాగం, బైపాస్‌రోడ్డు, ప్రభాకర్‌చౌదరి కాలనీ, ఈనాడు ఎడిషన్ కార్యాలయం, వాటర్ వర్క్స్, ఆర్‌డీటీ స్టేడియం, బెంగళూరు బైపాస్‌రోడ్డు, ఆర్‌డీటీ బ్రెయిలీ రెసిడెన్సియల్ పాఠశాల, సెయింట్ విన్సెంట్ డీ పాల్ పాఠశాల.
ఉప్పరపల్లి పంచాయతీ : ఆర్‌డీటీ స్టేడియం, రైస్‌మిల్, ఆటవీశాఖకు చెందిన నర్సరీ.
బుక్కరాయసముద్రం పంచాయతీ : సమ్మర్ స్టోరేజి ట్యాంక్, విరూపాక్షనగర్, గుత్తిరోడ్డు తడకలేరు వరకు
ప్రసన్నాయపల్లి పంచాయతీ : ప్రసన్నాయపల్లి గ్రామం, ఎల్‌ఆర్‌జీ స్కూల్, చిన్మయనగర్, కళాకారుల కాలనీ, పోస్టల్ కాలనీ
తెగని పంచాయితీ
Published Sat, Feb 1 2014 2:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement