పెద్దకూరపాడు: గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలంలోని తాళ్లూరు, కాశిపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కంభవరం గ్రామానికి చెందిన గోపి (25)ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.