పల్నాడు జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు సెంటర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారని చెప్పుకుంటారు.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తొస్తుందా? అంటూ ప్రశ్నించారు.
‘‘గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే. విశ్వసనీయతకు మరోసారి ఓటేసేందుకు మీరంతా సిద్ధమా?. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చా. మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?. పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడైనా మీరు చూశారా?. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి, దీవెన, ఆసరా, చేయూత, కాపునేస్తం లాంటి పథకాలు చూశారా?. గతంలో మేనిఫెస్టో పేరుతో ఎలా మోసం చేశారో అందరూ చూశారు
2014లో మేనిఫెస్టోను నమ్మి కూటమికి ఓటు వేశారు?. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారా?. అర్హులైనవారికి పక్కా ఇళ్లు అన్నారు.. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా?. సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానని అన్నారు.. జరిగిందా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?’’ అంటూ చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు.
‘‘జరగబోయే ఈ ఎన్నికలు మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తుంది. సాధ్యం కాని హామీలతో బాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రజలను మోసం చేయడమే. చంద్రముఖి నిద్ర లేస్తే గతంలోలాగే మీ రక్తం తాగేందుకు ఇంటింటికీ వస్తుంది. బాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలపించడానికి, విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?. మీరు జగన్‌ను నమ్మి అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతి ఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల కాలంలోనే ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 59 నెలల్లోనే జరుగుతోంది. మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చి 99% అమలు జరిగింది ఈ పాలనలోనే. ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. లంచాలు లేని వివక్షలేని ఇంటివద్దకే పాలన, పెన్షన్, పౌరసేవలు, పథకాలు గతంలో ఎప్పుడూ లేవు’’ అని సీఎం జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment