pedakurapadu
-
పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకం
-
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే శంకరరావు కార్యాలయంపై దాడి
పెదకూరపాడు/లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరులోని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కంభంపాడు గ్రామానికి చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఒక్కసారిగా శంకరరావును, ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయంలోనే ఉన్న కార్యకర్త నరేంద్రపై విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను చించివేసి శంకరరావు , ఆయన సతీమణిపై దుర్భాషలాడుతూ తీవ్రంగా భయభ్రంతులకు గురిచేశారు.ఈ విషయమై శంకరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఇలాంటి దాడులు ప్రజాస్వాయ్యంలో సరికాదన్నారు. కావాలనే దాడులకు పాల్పడ్డారని ఇకపై ఇలాంటివి సహించేదే లేదన్నారు. ఇదిలా ఉండగా, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం అరాచాకాలకు అడ్డు లేకుండాపోయింది. పెదకూరపాడు నియోజకవర్గ సీటు దక్కించుకున్న భాష్యం ప్రవీణ్ గెలిచిన తరువాత పెద్ద ఎత్తున , ఇసుక మాఫియా నడుపుతూ ప్రత్యర్థిపై దాడులకు పురిగొలుపుతున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన: అంబటి, శంకరరావుగుంటూరులో పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడిచేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు శంకరరావును పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేశ్ ప్రోద్బలంతో రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.ఈ దాడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ కంభంపాడు ప్రాంతానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు ఈ దాడిచేసినట్లు చెప్పారు. అనంతరం.. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండంపుడి నరేంద్రసాయి, కట్టబోయిన జగదీష్, చైతన్యరెడ్డి, సిద్ధు, మనోజ్, శ్రీనులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా: నంబూరు శంకరరావు
గుంటూరు, సాక్షి: గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించమని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పెదకూరపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట పొలాల నస్థానికి 15 రోజుల్లోనే నష్టం పరిహారం ఇవ్వడం జరిగింది. రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా?. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకూడదా? లేమల్లకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వాసు అనే వ్యక్తి కారు ధ్వంసం చేశారు....పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని తట్టుకోలేక దాడులు చేస్తున్నారు. నియోజవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. నియోజకవర్గం ఎవరి సొంతం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?’’ అని అన్నారు. -
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
-
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
-
సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!
-
హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపినట్టే: సీఎం జగన్
పల్నాడు జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారని చెప్పుకుంటారు.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తొస్తుందా? అంటూ ప్రశ్నించారు.‘‘గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే. విశ్వసనీయతకు మరోసారి ఓటేసేందుకు మీరంతా సిద్ధమా?. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చా. మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?. పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడైనా మీరు చూశారా?. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి, దీవెన, ఆసరా, చేయూత, కాపునేస్తం లాంటి పథకాలు చూశారా?. గతంలో మేనిఫెస్టో పేరుతో ఎలా మోసం చేశారో అందరూ చూశారు2014లో మేనిఫెస్టోను నమ్మి కూటమికి ఓటు వేశారు?. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారా?. అర్హులైనవారికి పక్కా ఇళ్లు అన్నారు.. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా?. సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానని అన్నారు.. జరిగిందా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?’’ అంటూ చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు.‘‘జరగబోయే ఈ ఎన్నికలు మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తుంది. సాధ్యం కాని హామీలతో బాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రజలను మోసం చేయడమే. చంద్రముఖి నిద్ర లేస్తే గతంలోలాగే మీ రక్తం తాగేందుకు ఇంటింటికీ వస్తుంది. బాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలపించడానికి, విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?. మీరు జగన్‌ను నమ్మి అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతి ఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల కాలంలోనే ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 59 నెలల్లోనే జరుగుతోంది. మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చి 99% అమలు జరిగింది ఈ పాలనలోనే. ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. లంచాలు లేని వివక్షలేని ఇంటివద్దకే పాలన, పెన్షన్, పౌరసేవలు, పథకాలు గతంలో ఎప్పుడూ లేవు’’ అని సీఎం జగన్ వివరించారు. -
బాబు సభ అట్టర్ ఫ్లాప్.. టీడీపీ సానుభూతి రాజకీయాలు
-
టీడీపీలో టికెట్ల పంచాయితీ
-
పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో బస్సుయాత్ర
-
చర్చకు కాదు.. రచ్చకు.. కయ్యానికి కాలుదువ్విన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
అమరావతి: ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తరచూ అధికార పక్షంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు తాజాగా పల్నాడు జిల్లా అమరావతిలోనూ కయ్యానికి కాలుదువ్వారు. అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత కొంతకాలంగా ప్రస్తుత పెదకూరపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వీటిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించి అమరేశ్వరస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. కానీ, కొమ్మాలపాటి చర్చకు కాకుండా తన బలగంతో రచ్చచేయడానికే అన్నట్లు అక్కడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కొమ్మాలపాటిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మూకలు రెచ్చిపోయి బస్సుపై దాడిచేశారు. పోలీసులు వెంటనే ఇరుపార్టీల వారిని వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటన పూర్వాపరాలు.. తనపై టీడీపీ నేతలు ఇటీవల కొన్నిరోజులుగా చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆదివారం అమరావతి అమరేశ్వరస్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు. ఇందుకు టీడీపీ నేతలు, కొమ్మాలపాటి శ్రీధర్ స్పందించి తాము కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో వారం రోజులుగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. సత్తెనపల్లి డీఎప్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులకు నోటీసులు జారీచేసి ముఖ్య నేతలపై నిఘా పెట్టారు. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు వారంతా ఎక్కడ ఉన్నారో తెలీక పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అమరావతితోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి అమరావతికి నాలుగు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అలాగే, ఆదివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి అమరావతికి వచ్చే ఇరుపార్టీల నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉ.9.35కు ఎమ్మెల్యే శంకరరావు అమరేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ముస్లిం కాలనీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వైపు దాడులకు తెగబడేందుకు అన్నట్లుగా పెద్దఎత్తున తన మందీమార్బలంతో కొమ్మాలపాటి శ్రీధర్ బయల్దేరారు. దీనిని పోలీసులు పసిగట్టి వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. అనంతరం.. కొమ్మాలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకుని అమరావతి పోలీస్‌స్టేషన్ వైపు తరలిస్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న బస్సుపై వారు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. దీంతో కొమ్మాలపాటిని క్రోసూరు వైపునకు మళ్లించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అమరేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి గాంధీబొమ్మ వైపు వస్తుండగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. డీఎస్పీ ఆదినారాయణ సంయమనంతో వారిని నిలువరించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. -
అభివృద్ధిపై చర్చకు రావాలని కొమ్మలపాటికి నంబూరి సవాల్
-
బాబు శవ రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
-
విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..
సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు. -
మీకోసం మీ ఎమ్మెల్యే
-
పాపా.. కీర్తీ... ఎక్కడున్నావమ్మా..
సాక్షి, పెదకూరపాడు: పాపా.. కీర్తీ... ఎక్కడ ఉన్నావమ్మా.. ఎలా ఉన్నావు తల్లీ.. పుట్టిన రోజు అని నాన్న కేక్ తెచ్చాడు.. పెదనాన్న కొత్త డ్రస్సు కొన్నాడు.. జాలిలేని దేవుడు నా బిడ్డ జాడ చూపలేదు.. కళ్ల ముందు తిరిగే పాప 40 గంటలు గడిచినా కనిపించలేదంటూ చిన్నారి కీర్తి తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల రమేష్, శ్రీలక్ష్మి అలియాస్ తిరుపతమ్మ రెండో కుమార్తె నాలుగేళ్ల కీర్తి సోమవారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిన సంగతి విదితమే. చిన్నారి కీర్తి జాడ కనుగొనేందుకు సోమవారం రాత్రి నుంచి తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, సత్తెనపల్లి పట్టణాల్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాల్లో గాలించారు. పాటిబండ్ల గ్రామంలో మంగళవారం ఏఎన్ఎస్ బృందాలు అణువణువు గాలించాయి. అయినప్పటికీ పాప ఆచూకీ దొరకకపోవటంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. (జన్మదినం రోజే బలవన్మరణం) యాచకురాలిపై అనుమానం సోమవారం గ్రామంలో ఓ గుర్తు తెలియని యాచకురాలు పసుపు రంగు చీర ధరించి బ్లూమాస్క్ పెట్టుకుని అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కోణంలో పోలీసులు గ్రామంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులను ఇళ్ల వద్ద వదిలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో యాచకురాలు కీర్తిని అపహరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
'డబ్బు, నగల కోసమే వ్యాపారిని హతమార్చా'
సాక్షి, గుంటూరు : జిల్లాలోని పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని ఒక ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇంటి యజమాని రాధాకృష్ట మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా 24 గంటలు గడవకముందే పోలీసులు కేసును ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అనే యువకుడు బంగారం, డబ్బు కోసమే వ్యాపారి రాధాకృష్టను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద లభించిన 250 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మల్లెల గోపిపై హత్య కేసు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మాచర్ల ఘటనపై స్పందించిన డీజీపీ
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సత్వరం స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆయన బుధవారం ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ.... మాచర్లకు బయల్దేరారు. ఎవరు దాడి చేశారో తెలియదు... కాగా మాచర్ల ఘటనలో ఎవరు దాడి చేశారో తెలియదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఎవరు...ఎవరిపై దాడి చేశారో విచారణలో తెలుస్తుందన్నారు. మాచర్లలో ప్రజలను రెచ్చగొట్టేందుకే బోండా ఉమ, బుద్ధా వెంకన్న అక్కడకు వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. -
ఎమ్మెల్యేకు సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
సాక్షి, గుంటూరు : పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఎమ్మెల్యేను పరామర్శించారు. ఇవాళ లక్ష్మీకాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు. -
టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ పాగా
సాక్షి, పెదకూరపాడు: తెలుగు దేశం పార్టీ కంచుకోట అయిన పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తొలిసారి జెండా ఎగురువేసింది. తెలుగుదేశం పార్టీ పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. తొలి రౌండ్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు సమీప టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్‌పై ఆధిక్యతను సాధించారు. మొత్తం 19 రౌండ్లు జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు 14,104 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. టీడీపీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ మూడో స్థానంలో నిలిచింది. రౌండ్ రౌండ్‌కు పెరిగిన మోజార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం 2,22,675 ఓట్లు ఉండగా, వాటిలో 1,96,466 ఓట్లు పోలైయ్యాయి. అందులో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 99,577 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్‌కు 85,473 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి పుట్టి లక్ష్మీసాంమ్రాజ్యంకు 7,156 ఓట్లు వచ్చాయి. మొత్తం 265 పోలింగ్ కేంద్రాలు ఉండగా కౌంటింగ్‌కు మొత్తం 19 రౌండ్లు నిర్వహించారు. పోస్టల్‌లోనే భారీ మెజార్టీ పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో పోస్టల్లోనై వెఎస్సార్ సీపీ విజయబావుట ఎగురవేసింది. మొత్తం 1239 ఓట్లుకు గాను వైఎస్సార్సీపీ 706 టీడీపీకి 352, జనసేనకు 42 ఓట్లు వచ్చాయి. ఉద్యోగులు కూడ వైఎస్సార్సీïల వైపు మొగ్గు చూపారు. తొలిసారి పోటీ.. తొలిసారి ఎమ్మేల్యే నంబూరు.. ప్రత్యేక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మేల్యేఅ భ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తొలిసారి పోటీలో నిలిచి విజేతగా నిలిచారు. -
కొమ్మాలపాటి అవినీతిలో మేటి
సాక్షి, గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు.. సదావర్తి సత్రం భూములను చేజిక్కించుకోవడం నుంచి ఎర్ర మట్టి దోపిడీ వరకు.. బెట్టింగ్ మాఫీయా నుంచి ‘నీరు–చెట్టు’లో అవినీతి వరకు.. కాదేది ఆయన అక్రమార్జనకు అనర్హం. కన్నుపడితే దౌర్జన్యం చేయడం ఖాయం. ఒక సామాన్య వ్యక్తి నుంచి నేడు రూ.కోట్లకు పడగెత్తిన రాజకీయ నాయకుడిగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సాగించిన అవినీతి కథలు రాయాలంటే పుస్తకాలే చాలవేమో. కృష్ణమ్మ నది గర్భంలో డ్రెడ్జర్లతో భారీ లోతులో ఇసుక తవ్వకాలు జరిపి.. అమాయక ప్రాణాలను బలిగొన్నా.. బినామీల పేరుతో గ్రావెల్ కొట్టేసినా ఆయనకే చెల్లింది. ఇలా ఇందు లేదు అందు లేదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతిని విస్తరించి.. మద్యాన్ని ఎరులై పారించిన ప్రజాప్రతినిధి కొమ్మాలపాటి. రాజధాని ప్రాంతఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అండతో ఇసుక మాఫియాను నడుపుతూ వేల కోట్లు దోచేశారు కొమ్మాలపాటి శ్రీధర్. అందులో చినబాబు వాటాపోను సుమారు రూ. 500 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ప్రతి చోటా ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించి రెవెన్యూ అధికారుల ద్వారా సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను సైతం చెరబట్టారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని బొక్కేయడంతోపాటు, అమరావతి మండలంలో అతి ఖరీదైన ఎర్ర మట్టిని తవ్వేసి సుమారుగా రూ. 100 కోట్లు దండుకున్నారు. నియోజవకర్గంలో మద్యం దుకాణాల వద్ద 20 శాతం వాటా గుంజేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి సుమారుగా 25 మందికిపైగా అమాయకులు బలయ్యారు. అయినా కొమ్మాలపాటి ధనదాహం మాత్రం తీర లేదు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణా నది మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. నీరు–చెట్టులో అవినీతి ప్రవాహం.. నీరు–చెట్లు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి బంగారు బాతుగా మారింది. పథకం పేరుతో నియోజకవర్గంలోని మండలాల్లో నిధులను ఎమ్మెల్యే భారీగా మింగేశారు. బెల్లంకొండ మండలంలో నందిరాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీలు 28 సంవత్సరాలుగా 40 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 40 ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో 10 ఎకరాల్లో నీరు– చెట్టు కింద మట్టిని తవ్వి అవినీతికి పాల్పడ్డారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు రూ. 30 కోట్ల వరకూ మట్టిని మింగేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్నారు... నాలుగున్నరేళ్లలో కొమ్మాలపాటి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2016 ఆగస్టు 16న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ప్రాంతాన్ని కలిపే కృష్ణా నది పాయలో పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు కృష్ణానదిలో తీసిన భారీ గోతిలో ఓ విద్యార్థి మునుగుతుండగా, పక్కన ఉన్న తోటి విద్యార్థులు అతనిని రక్షించేందుకు వెళ్ళి వారు సైతం మృత్యువాత పడిన సంఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అదే ఏడాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు శివారులో ఉన్న కృష్ణా నదిలో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఐదుగురు యువకులు ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి జల సమాధయ్యారు. 2017 జనవరి 15న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృత్యువాత పడ్డ వారంతా 20 ఏళ్లులోపు. మీటరు (మూడు అడుగులు) లోతుకంటే ఎక్కువ తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కృష్ణానదిలో 20 అడుగులు తవ్వేశారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా ఇసుకాసురులు మాత్రం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీ మాదినేని బాలజీ కొమ్మాలపాటి శ్రీధర్ మామ మాదినేని సుబ్బయ్య కుమారుడు కావడం గమనార్హం. బాలాజీ సొంతగా బోర్డు నడుపుతూ ఆన్లైన్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు లైన్ ఇస్తూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతని జోలికి పోలీసులు వెళ్ళకుండా కొమ్మాలపాటి చూసుకుంటారు. బాలాజీ తమ వద్ద భూములు, స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ అనేక మంది బాధితులు 2016 డిసెంబర్లో అప్పటి గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బుకీల ఆట కట్టించేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ బుకీల కోసం వేట సాగించారు. ఈ బృందం కీలక బుకీ బాలాజీతోపాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారంతో బాలాజీ సోదరుడు, అమరావతికి చెందిన మండల స్థాయి టీడీపీ నేతతోపాటు జిల్లాలోని అనేక మంది కీలక క్రికెట్ బుకీల పాత్ర ఉన్నట్లు తేలింది. బాలాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి బావమరిది కావడంతో వారి జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఆ మరుసటి రోజు ఐదుగురు క్రికెట్ బెట్టర్లను అరెస్టు చూపించారు. అందులో కీలక బుకీ బాలాజీ ఎవరనేది కూడా విలేకరులకు చెప్పకుండా.. కనీసం కోర్టులో హాజరు పర్చకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేశారు. అమరావతిలో గతంలో పేకాట కూడా నిర్వహించారు. ఎర్ర మట్టి దోపిడీ.. అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములలో కోట్లాది రూపాయల ఎర్ర గ్రావెల్ దోచుకున్నారు. ఎమ్మెల్యే బినామీలైన పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన మాదినేని సుబ్బయ్య కుమారుడు శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి గంగాధరరావు ఈ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన షేక్ మస్తాన్‌బీ డీకె పట్టా రద్దు చేయిస్తామని బెదిరించి సర్వే నెంబరు 95/1, 95/2లో ఉన్న 1.98 ఎకరాలు లేమల్లెలోని మేకల యేసోబుకు చెందిన 96/2లో ఉన్న ఎకరం భూమిని మాదినేని శ్రీనివాసరావు లీజుకు రాయించుకున్నాడు. దీంతోపాటుగా 2013 నవంబరు 23వ తేదీన చనిపోయిన కట్టెపోగు వందనం భార్య చిట్టెమ్మ పేరు మీద 96/2 నంబరులో ఉన్న 1.25 ఎకరాల భూమిని కూడా 2017 ఏప్రిల్ 1న నోటరీ అఫిడవిట్ ఇచ్చినట్లు ఏటుకూరి గంగాధరరావు పేరు మీద ఫోర్జరి చేసి లీజు అగ్రిమెంట్ సృష్టించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్సీ నెం.402/2017బీ అర్డరులో డీకే పట్టాగా పేర్కొన్న భూములు మైనింగ్ మెమో నెం.1418/టీపీలో మాత్రం పట్టా భూమి అని చూపించారు. మొత్తం మీద 6150 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేశారు. ప్రస్తుతం కర్లపూడి ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న గంగమ్మచెరువు వద్ద ప్రత్తిపాటి బేబమ్మ, ప్రత్తిపాటి బూదమ్మలకు పూర్వార్జితంగా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని కొమ్మాలపాటి బంధువులు కొనుగోలు చేసి అక్రమ తవ్వకాలకు తెర తీశారు. -
గుంటూరు జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర
సాక్షి, గుంటూరు : వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల బస్సుయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా నేమల్లె నుంచి ప్రారంభమైంది. పెదకూరపాడు చేరుకున్న రాజన్న తనయకు అపూర్వ స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు రోడ్లకు రెండువైపులా ప్రజలు బారులు తీరారు. ‘మీ రాజన్న బిడ్డను...జగనన్న చెల్లెను..మీ ముందుకొచ్చాను’ అంటూ ప్రజలకు అభివాదం చేస్తూ...వైఎస్ షర్మిల ముందుకు కదిలారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు,అభిమానులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా పెదకూరపాడు, మధ్యాహ్నం రొంపిచెర్లలో మహిళలతో వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి చీరాలలో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగిస్తారు. -
అన్నంలో మట్టి.. టెంట్లు కూల్చివేత
అమరావతి (పెదకూరపాడు): అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. అలాంటి అన్నంలో టీడీపీ నాయకులు మట్టిపోశారు. అంతేకాదు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి వెసిన టెంట్లు కూల్చివేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అమరావతిలోని ముస్లిం బజారులో కొందరు ముస్లిం యువకులు పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు సమక్షంలో పార్టీలో చేరటానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు భోజనం పెట్టటానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. వండిన ఆహార పదార్ధాలు అన్నంలో మట్టి, బూడిద, నీరు పోశారు. ఈ కార్యక్రమానికి వేసిన టెంట్లను సైతం కూల్చివేశారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ ప్రభాకరరావు సిబ్బందితో వచ్చి మసీదు సెంటరులో ఉన్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం నంబూరు శంకరరావు కూడా అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి టీడీపీ కార్యకర్తల చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అందరికీ తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. టీడీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని అందుకే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు అమరావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శంకరరావుతోపాటు మంగిశెట్టి శ్రీనివాసరావు, మంగిశెట్టి కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, హనుమంతరావు, విన్నకోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు జిమ్మిక్కులకు ఈసీ ఝలక్
సాక్షి, గుంటూరు : ప్రజలను అయోమయానికి గురిచేసి.. ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మిక్కులకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకరరావు కాగా.. ఓటర్లను అయోమయానికి గురిచేసే ఉద్దేశంతో ఇక్కడ ప్రజాశాంతి పార్టీ నంబూరి శంకరరావు అనే పేరు గల మరో వ్యక్తిని నిలబెట్టింది. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ మంగళవారం తిరస్కరించింది. నామినేషన్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. దరఖాస్తును అభ్యర్థి సరిగ్గా పూర్తి చేయకపోవడంతో నిబంధనల మేరకు తిరస్కరించారు. దీంతో ఓటర్లను తికమక పెట్టేందుకు టీడీపీ వేసిన ఎత్తుగడ విఫలమైంది. కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఒక పెదకూరపాడే కాకుండా మరో ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను కలిగివున్న వ్యక్తులను పోటీలోకి దించారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్సీపీ సీలింగ్ ఫ్యాన్ గుర్తును పోలి ఉండటం... ఇక ఆ పార్టీ జెండా రంగులు కూడా వైఎస్సార్సీపీ జెండా రంగులను పోలి ఉండటంతో చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ప్రజాశాంతి పుట్టుకొచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ రెండు అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. -
ఓటు వేయాలంటే నడక యాతనే..
సాక్షి, పెదకూరపాడు : పురాతన కాలంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థిని చేతులు ఎత్తి ఎన్నుకునేవారు. అనంతరం బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం అధునిక యుగంలో ఈవీఎంలు, వీవీప్యాడ్లు వచ్చాయి. అయినా ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు మాత్రం సార్వత్రిక ఎన్నికలైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా ఓటు వేయాలంటే రెండున్నర కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాల్సిందే. మండలంలోని రామాపురం పంచాయతీ పరిధిలోని 20 ఎస్సీల కుటుంబాలకు 50 ఏళ్ల క్రితం గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్‌నగరం స్థలాలు కేటాయించారు. అక్కడే వారు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. అప్పటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. హుస్సేన్‌నగర్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని వారు కోతున్నప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పెదకూరపాడు నియోజకవర్గంలోని 156 బూత్‌లో మొత్తం 710 ఓట్లు ఉంటే వారిలో 84 ఓట్లు వీరివి ఉన్నాయి. -
దత్తత ఉత్తదయిన వేళ...
సాక్షి, పెదకూరపాడు : ‘ఈ గ్రామవాసిగా పెదకూరపాడును దత్తత తీసుకుంటున్నా. గ్రామ దశ, దిశలు మారుస్తా. ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా.. జన్మభూమి రుణం తీర్చుకుంటా’.. అంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కొమ్మాలపాటి శ్రీధర్ హామీలు గుప్పించారు. అయితే ఆయన ఈ గ్రామానికి చేసింది మాత్రం శూన్యమని, సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా 13,14 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలో రోడ్లు వేసి తన నిధులతో చేసినట్లు బీరాలు పలకడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదని గ్రామస్తులు ఎద్దేవాచేస్తున్నారు. పెదకూరపాడు రైల్వేస్టేషన్లో జన్మభూమి, పల్నాడు ఎక్సెప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నది గ్రామ ప్రజల చిరకాల వాంఛ. ఇందు కోసం ఎన్నోసార్లు రైల్వే అధికారులను కలసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానంటూ తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాజా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. ఎక్సెప్రెస్ రైలుకు హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లేవారు గ్రామంలోనే రైలు ఎక్కొచ్చన్న ఆశ కలగానే మిగిలింది. మూతపడ్డ హాస్టళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా పెదకూరపాడులో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాన్ని రద్దుచేశారు. ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నా ఈ హాస్టళ్లను కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవని ఎస్సీ, బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొమ్మొకరిది... సోకు ఒకరిది ఇరుకుగా ఉన్న పెదకూరపాడు ప్రధాన రహదారి తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి స్వగ్రామం పెదకూరపాడులో నిర్మించిన సీసీ రోడ్ల వ్యవహారం సొమ్మొకరది, సోకు ఒకరది అన్న చందంగా మారింది. ఈ గ్రామాన్నికి ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివి. 13, 14 ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనూ సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆ నిధులతోనూ టీడీపీ వారే రోడ్లు వేశారు. అయితే కొమ్మాలపాటి శ్రీధర్ రహదారులు అంటూ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఎమ్మెల్యే నిధులు కింద పెదకూరపాడు గ్రామానికి వచ్చింది రూ.60 లక్షలు. వాటిలో రూ.40 లక్షలే వినియోగించారు. మిగిలిన రూ.20 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏమైంది? ప్రజల చిరకాల కోరిక పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాలన్నది. మేము అనేక సార్లు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాం. అయితే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేగా శ్రీధర్ రైళ్ల హాల్ట్ కూడా సాధించలేకపోయారు. – షేక్ బాలిసైదా, అడ్వకేట్, పెదకూరపాడు చేనేతలకు చేసింది శూన్యం పెదకూరపాడులో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కొమ్మాలపాటి చేసిన మేలు ఏమీ లేదు. సొంతూరు వ్యక్తి అయినా కనీసం చేనేత సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. – గాత్రం కాంతారావు,పెదకూరపాడు -
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతాం..
* టీడీపీ శ్రేణులను హెచ్చరించిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స * అమరావతిలో పెదకూరపాడు నియోజకవర్గ సమావేశం అమరావతి: తమ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలినా సహించేది లేదని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఇన్చార్జి బొత్స సత్యనారాయణ టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. పెదకూరపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, అమరావతి పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు విన్నకోట శివయ్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి జరిగాయి. స్థానిక పల్లపు వీధిలోని డాల్ మిల్లులో నిర్వహించిన ఈ బహిరంగసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స మాట్లాడుతూ.. సొంత అవసరాల కోసమే పనిచేస్తున్న టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకోవడం మాని తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఈగ వాలినా సహించబోమన్నారు. పార్టీ అధికార ప్రతి నిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నిన్న కాక మొన్న పుట్టిన లోకేష్ కుమారుడు పేరుతో కోట్లు ఎలా ఉన్నాయని నిలదీశారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ ఇసుక, మట్టితో పాటు చివరికి దేవుడి భూములను సైతం వదల్లేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ప్రజల మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు చిచ్చుపెడుతున్నారని అన్నారు. టీడీపీ ఓట్లు వేసిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపచేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. తాను చివరివరకు వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పారు. మంత్రి అనుచరులే నకిలీ విత్తనాల దొంగలు.. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులే నకిలీ విత్తనాల దందా చేసి రైతులను మోసం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఇసుక, మట్టి అక్రమాల్లో టీడీపీ నేతలది అందెవేసిన చెయ్యి అన్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్, సీఐ ఎమ్మెల్యే శ్రీధర్‌కు తొత్తులుగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశార న్నారు. – మర్రి రాజశేఖర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
యువకుడి దారుణ హత్య
పెద్దకూరపాడు: గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలంలోని తాళ్లూరు, కాశిపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కంభవరం గ్రామానికి చెందిన గోపి (25)ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పెదకూరపాడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ!
అమరావతి: గుంటూరు జిల్లాలో అంతంతమాత్రంగానే ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మ విజయసాగర్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించిన విజయసాగర్ బాబు 2000 మంది అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయసాగర్‌బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. సీమాంధ్ర అభివృద్ధి, మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విజయసాగర్ బాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయంలో పాలుపంచుకుంటామని కార్యకర్తలు వెల్లడించారు. -
పెదకూరపాడులో కాంగ్రెస్ ఖాళీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు :పెదకూరపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సైతం ఆ పార్టీని వీడి భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అక్కడ ఇప్పటి వరకు తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కనుసన్నల్లో కొనసాగిన రాజకీయాలకు వైఎస్సార్ సీపీ నేతలు బ్రేక్ వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలు, ఇస్తున్న హామీలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా రాజకీయాలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే ఉంటే కష్టాలు తప్పని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. = అమరావతి మండలంలో నెల రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లోని 80 శాతంపైగా ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ చేరికకు వైఎస్సార్ సీపీ విధానాలు, నాయకులపై విశ్వసనీయత ప్రధాన కారణమైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పక్కాల సూరిబాబుపై వ్యతిరేకతను మరో కారణంగా చెబుతున్నారు. = గత నెల 10న అమరావతిలో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో ముగ్గురు మాజీ సర్పంచ్‌లు, ఒక మాజీ ఎంపీటీసీ, మరో గ్రామ సర్పంచ్‌తోపాటు యండ్రాయి గ్రామంలోని 80 శాతానికి ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు. = ఆ తరువాత వారం రోజులకు నేమల్లి గ్రామంలోని ఎక్కువ మంది ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు. వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం.= పెదకూరపాడు మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు వారి అనుచరులతో గురువారం ఆళ్ల అమోధ్యరామిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లంకొండ రామగోపాలరావు, మాజీ ఎంపీపీ యావర్తి శేషారత్నం, సొసైటీ మాజీ అధ్యక్షుడు బద్దాల భద్రాచలం వారి అనుచరులు ఉన్నారు.కన్నా రహస్య సమావేశం ...పెదకూరపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కన్నాకు సమాచారం ఉండటంతో బుధవారం రాత్రి కొందరు ముఖ్యనాయకులను గుంటూరు పిలిపించుకుని చర్చలు జరిపారు. నియోజకవర్గ ఇన్చార్జి పక్కాల సూరిబాబు తమ సామాజికవర్గం (కమ్మ) పట్ల అనుచితంగా వ్యవహరించారని, మూడు సంవత్సరాల నుంచి తమకు అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వివరించినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓట్లకోసం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోయినా అభివృద్ధి పూర్తి చేయించారని, ఇప్పటి వరకు చెల్లింపులు జరగక అప్పులు పాలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అతడి వల్ల తాము నష్టపోతున్నామని, అతడిని బదిలీ చేయాలని వేడుకున్న ఎవరూ పట్టించుకోలేదని కన్నాకు వివరించినట్టు తెలిసింది. ఇతర గ్రామాలకు చెందిన నేతలు తమ గ్రామాలకు వచ్చి పెత్తనం చెలాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇంకా ఈ పార్టీలో అవమానాలు పడలేమని చెప్పినట్టు తెలిసింది. పక్కాలపై లెక్కకు మించి ఆరోపణలు చేయడంతో మాజీ మంత్రి కన్నాకు ఏంచేయాలో పాలు పోక గురువారం మరోసారి సమావేశమైనా వారి నుంచి సరైన హామీ లభించలేదు. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కన్నా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో వారిలో ఎక్కువ మంది వైఎస్సార్సీపీలో చేరిపోయారు.