రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా: నంబూరు శంకరరావు | YSRCP Leader Namburu Sankara Rao Reacts On TDP Cadre Attacks In Guntur Pedakurapadu | Sakshi
Sakshi News home page

రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా: నంబూరు శంకరరావు

Published Tue, Sep 10 2024 6:23 PM | Last Updated on Tue, Sep 10 2024 6:57 PM

ysrcp leader Namburu Sankara Rao Reacts on tdp cadre attacks

గుంటూరు, సాక్షి: గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించమని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

‘‘పెదకూరపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంట పొలాల నస్థానికి 15 రోజుల్లోనే నష్టం పరిహారం ఇవ్వడం జరిగింది. రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా?. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకూడదా? లేమల్లకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వాసు అనే వ్యక్తి కారు ధ్వంసం చేశారు.

...పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధిని తట్టుకోలేక  దాడులు చేస్తున్నారు. నియోజవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. నియోజకవర్గం ఎవరి సొంతం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement