
సాక్షి, గుంటూరు : జిల్లాలోని పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని ఒక ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇంటి యజమాని రాధాకృష్ట మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా 24 గంటలు గడవకముందే పోలీసులు కేసును ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అనే యువకుడు బంగారం, డబ్బు కోసమే వ్యాపారి రాధాకృష్టను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద లభించిన 250 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మల్లెల గోపిపై హత్య కేసు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment