loot thieves
-
మణిపూర్‌లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్‌సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్‌ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
‘ప్లాన్ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతారు’
సాక్షి, హైదరాబాద్ : అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగల ముఠాను బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురు సభ్యుల ముఠా ఈ నెల 4న దోపిడికి ప్లాన్ చేశారని.. పుత్లిబౌలిలో ఒక వ్యాపారి తీసుకువెళుతున్న మనీబ్యాగ్‌ను చోరీ చేశారన్నారు. కాగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చోరికి పాల్పడ్డ ఐదుగురు దొంగల ముఠా సభ్యులలో సయ్యద్ పాషా, సయ్యద్ ఫైయజ్ ఇమ్రాన్, అమీర్ ఖాన్‌తో పాటు వసీంను అరెస్ట్ చేయగా ఒక్కరు మాత్రం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి 2.65 లక్షల నగదు, 2 డాగర్స్ ( కత్తులు), 10 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై గతంలోనూ హత్య, చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లో వీరిపై వివిధ కేసులు నమోదైనట్లు తెలిపారు. -
'డబ్బు, నగల కోసమే వ్యాపారిని హతమార్చా'
సాక్షి, గుంటూరు : జిల్లాలోని పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని ఒక ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇంటి యజమాని రాధాకృష్ట మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా 24 గంటలు గడవకముందే పోలీసులు కేసును ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అనే యువకుడు బంగారం, డబ్బు కోసమే వ్యాపారి రాధాకృష్టను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద లభించిన 250 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మల్లెల గోపిపై హత్య కేసు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
తెగబడ్డ దోపిడీ దొంగలు
బాలాపూర్: షిరిడీ-మైసూర్ రైలులో దోపిడీ దొంగలు తెగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగి నుంచి ఎస్ 14 బోగిల వరకు స్వైర విహారం చేశారు. ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.